Home /News /andhra-pradesh /

TTD Board Members List: టీటీడీ పాలకమండలి తుది జాబితా ఇదే.. కొత్త సభ్యులు వీళ్లే..

TTD Board Members List: టీటీడీ పాలకమండలి తుది జాబితా ఇదే.. కొత్త సభ్యులు వీళ్లే..

శ్రీవారి ఆలయం (ఫైల్)

శ్రీవారి ఆలయం (ఫైల్)

TTD Board: టీటీడీ జంబో పాలక వర్గం సిద్ధమైంది. ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 80మందితో జాబితాను ఎంపిక చేసింది.

    తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి (Tirumala Tirupati Devastanam New Board) నియామకం పూర్తైంది. 25 మందితో కూడిన నూతన జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) విడుదల చేసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy)తో చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సుదీర్ఘ కసరత్తు అనంతరం పాలకమండలి సభ్యులను ఎంపిక చేశారు. పాలకమండలిలో చోటు కోసం వందకు పైగా సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది. వడపోతల అనంతరం సభ్యుల జాబితాకు తుదిరూపు ఇచ్చారు. ఇందులో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమబెంగాల్ కు చెందిన వారికి చోటు కల్పించింది. పాలకమండలిలో 24 మందికి చోటు కల్పించిన ప్రభుత్వం.. నలుగురు అధికారులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రకటించింది. దీంతో టీటీడీ బోర్డులో 28మందికి చోటిచ్చింది. మరోవైపు 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. గతంలో ఎన్నడూలేని విధంగా 80మందితో టీటీడీ పాలకమండలి సిద్ధమైంది.

    పాలకమండలి సభ్యులుగా పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, టంగుటూరి మారుతీ ప్రసాద్, మన్నె జీవన్ రెడ్డి, బండి పార్థసారథి రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు, ఎన్.శ్రీనివాసన్, రాజేష్ శర్మ, బోర సౌరభ్, మురంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్, ఎపీ నందకుమార్, పాచిపాల సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కేతన్ దేశాయ్, బూదాటి లక్ష్మీనారాయణ, మిలింద్ కేశవ్ నర్వేకర్, ఎమ్ఎన్ శశిధర్, అల్లూరి మల్లేశ్వరి, ఎశ్.శంకర్, ఎస్.ఆర్ విశ్వనాథ్ రెడ్డి, బుర్రా మధుసూధన్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఎంపిక చేసింది. అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్, టీటీడీ ఈవోలను ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ప్రకటించింది.

    ఇది చదవండి: ప్రైవేటీకరణ దిశగా తిరుపతి ఎయిర్ పోర్ట్.., కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం


    ఇక పాలకమండలిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, , బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ కు ఎక్స్ అఫీషియో ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. అలాగే 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

    ఇది చదవండి: చంద్రబాబుకు కొత్త తలనొప్పులు... అగ్గిరాజేసిన జేసీ కామెంట్స్.. టీడీపీలో ఏం జరుగుతోంది..?



    పాలకమండలి నియామకంపై ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిఫార్సులు వచ్చినట్లు సమాచారం. వీరే కాకుండా సీఎం జగన్ కేబినెట్లో ఉన్న మంత్రుల బంధువులు, వైసీపీ కీలక నేతలు, సీఎం మిత్రులు, బడా పారిశ్రామిక వేత్తల నుంచి సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు