Home /News /andhra-pradesh /

TIRUPATI HERE ARE THE COMPLETE DETAILS OF TIRUMALA TEMPLE WHICH HAS THOUSEND YEARS HISTORY PRN TPT

Tirumala Temple: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!

తిరుమల ఆలయం (ఫైల్)

తిరుమల ఆలయం (ఫైల్)

Tirumala Facts: సాక్షాత్ శ్రీమహా విష్ణువే వైకుంఠం వీడి శేషాద్రిశుడై ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరుడుగా కొలువయ్యాడు. సువర్ణ కాంతులు వెదజల్లే బంగారుమేడలో కటాక్షిస్తున్న శ్రీనివాసుని దర్శించుకోవాలంటే ఎన్ని మండపాలు దాటాలి. అసలు ఆ మండపాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి...?

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupati, News18

  History of Tirumala: సాక్షాత్ శ్రీమహా విష్ణువే వైకుంఠాన్ని వీడి శేషాద్రిశుడై ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరుడుగా (Lord Venkateswara) కొలువయ్యాడు. సువర్ణ కాంతులు వెదజల్లే బంగారుమేడలో కటాక్షిస్తున్న శ్రీనివాసుని దర్శించుకోవాలంటే ఎన్ని మండపాలు దాటాలి. అసలు ఆ మండపాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి...? స్వామి వారికి ఎవరు ఈ మండపాలని నిర్మించారు. వెంకన్న కొలువైన బంగారు మేడలో మండపాల పై ప్రత్యేక కధనం.... భక్తుల కష్టాలు తీర్చేందుకు శ్రీవారు ఏడుకొండలైన శేషాద్రి, వేంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వృషబాద్రి, నారాయణాద్రి కొండలపై వెలిసాడు కాబట్టే ఏడుకొండల వాడని, సప్తగిరిషుడని భక్తులు స్వామి వారి నామస్మరణ చేస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavalu) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో కలియుగ వైకుంఠం గురించి తెలుసుకోవాలని భక్తలు ఆసక్తి చూపుతుంటారు.

  ప్రధాన ఆలయం విశేషాలు..
  ఆలయ మహా ద్వారం నుంచి భగవత్ నమ స్మరణ చేస్తూ.., వెండి వాకిలి దాటి బంగారు వాకిలిలోకి అడుగు పెట్టగానే ప్రధాన ఆలయ మండపంలోకి చేరుకుంటారు. ఈ మండపం బంగారు వాకిలిని, గరుడళ్వార్ సన్నిధి, జయ విజయలను అనుసంధానం చేస్తూ ఉంటుంది. 43 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు గల మండపాన్ని ముఖ మండపం, ఘంటామండపం, మహామణి మండపం అని పిలుస్తారు. ఈ ముఖ మండపాన్ని 1417లో విజయనగర సామ్రాజ్య మంత్రి వర్యులు అమాత్య మల్లన నిర్మించి పూర్తి చేశాడు. మొత్తం నాగులు వరుసలో 16 స్థంబాలు ఏర్పాటు చేశారు. ఈ స్థంభాలపై శ్రీ భువరహ స్వామి, నృహింహ స్వామి, శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ వరద రాజ స్వామి శిల్పాలు చెక్కబడి ఉంటాయి. మహా మణి మండపంలో ప్రతినిత్యం వేకుజము కౌసల్య సుప్రజా రామ పుర్వాసంధ్య ప్రవర్తతే అంటూ సుప్రభాత సేవను నిర్వహిస్తారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు ఎందుకంతటి ప్రాముఖ్యత..? ఈ పూజలో ఎన్ని ఘట్టాలుంటాయో తెలుసా..?


  ప్రతి బుదవారం నాడు శ్రీ భోగ శ్రీనివాస మూర్తికి, శ్రీ మలయప్ప స్వామికి, విశ్వక్సేనుల వారికి సహస్ర కళషాభిసేకం, గురువారం నాడు రెండవ గంట సమయంలో తిరుప్పావడై సేవను నిర్వహిస్తారు. విశేష దినాలైన ఉగాది, ఆణివార ఆస్థానం, దీపావళి, ఇతర పర్వ దినాలలో శ్రీ గరుడళ్వార్ అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వారిని వెంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీరామ నవమి నాడు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరాముడ్ని, శ్రీ కృష్ణాష్టమి నాడు రుక్మిణి సమేత శ్రీ శ్రీకృష్ణ స్వామి వారిని వెంచేపు చేసి కొలువు నిర్వహిస్తారు.

  ఇది చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎందుకంత ప్రాముఖ్యత... వందల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోదంటే..!  ఘంటా మండపం.. స్నపన మండపం..
  బంగారు వాకిలికి దక్షిణ బాగంలో రెండు పెద్ద గంటలు ఉంటాయి. వీటిని స్వామి వారికీ నివేదనలు సమర్పించే సమయంలో మ్రోగిస్తుంటారు. అందుకే ఈ మండపాన్ని ఘంటా మండపం అని అంటారు. ఘంటా మండపం దాటి ఉన్న మండపాన్నే స్నపన మండపం అని అంటారు. 27 అడుగుల చతురస్త్ర కారంలో నాలుగు స్థంబాలలో బాల కృష్ణ, యోగ నరసింహ, కాళీయ మర్ధనుడైన శ్రీ కృష్ణుని శిల్పాలు ఉంటాయి. ఈ మండపాన్నే తమిళంలో తీరు వీసాల్ అని అంటారు. తెలుగులో బాలాలయం అని అర్థం. ఈ మండపాన్ని 1614వ సంవత్సరంలో పల్లవ రాణి సామవాయి (పేరుందేవి) వెండి భోగ శ్రీనివాస మూర్తిని ఆలయానికి బహుకరించారు. అదే సమయంలో స్వామి వారికీ పూజలు నిర్వహించారని శాసనాలలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మండపంలో ప్రతి రోజు శ్రీవారికి తోమాల సేవ అనంతరం గర్భాలయంలో కొలువైన భోగ శ్రీనివాస మూర్తిని వెంచేపు చేసి బంగారు సింహాసనంపై కొలువు నిర్వహిస్తారు.

  ఇది చదవండి: శ్రీవారిని మలయప్ప అని ఎందుకు పిలుస్తారు... పంచబేర ఆరాధన అంటే ఏంటి..?


  శ్రీ వేంకటేశ్వరుడు రాజది రాజులకే రాజు కాబట్టి ప్రతి రోజు పంచాంగ శ్రవణం, ఆరోజు తిది నక్షత్రంతో పటు స్వామి వారికీ భక్తులు హుండిలో సమర్పిచిన కానుకల లెక్కలు చెబుతారు. ఏకాంత సేవ అనంతరం శ్రీవారి హుండీని ఇదే ప్రాంతంలో భద్రపరుస్తారు. స్వామి వారికి అలంకరించే ఆభరణాలు అన్ని కూడా ఇదే మండపంలో భద్రపరుస్తారు. శ్రీవారికి ప్రతి శుక్రవారం నాడు ఆభరణాలు అలంకరించడం, గురువారం నాడు సడలించిన ఆభరణాలను ఇదే మండపంలో బద్ర పరచడం జరుగుతుంది. దీనితో ఈ మండపానికి కొలువు మండపం అని, కానుక భాండారం అనే పేరు వచ్చింది.


  Onion Price: అమ్మో ఘాటెక్కిన ఉల్లి.. కట్ చేయకుండానే కన్నీరు.. వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే..?  రాములవారి మేడ...
  స్నపన మండపాన్ని దాటగానే వచ్చే మండపమే రాముల వారి మేడ అని అంటారు. 10 అడుగుల వెడల్పు 12 అడుగుల పొడవు ఉండే రాములవారి మేడను 1262-65 కాలంలో లేదని, ఇప్పుడు ఉన్న వైకుంఠ ప్రదిక్షిణ మార్గంలో కలసి ఉండేదని పరిశోధకుల అంచనా. రాముల వారి మేడకు ఇరువైపులా ఏతైన అరుగులు ఉంటాయి. దక్షిణం వైపు ఉన్న అరుగు మీద ఉత్తరాభి ముఖంగా శ్రీరాముని సేవ పరివారం అంగద, సుగ్రీవ, హనుమత ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఉత్తరం అరుగుపై దక్షినభి ముఖంగా శ్రీ వేంకటేశ్వరుని సేవ గళంవిశ్వక్సేనుల వారు, గరుడళ్వార్, అనంత ఆళ్వార్ కొలువై ఉంటారు. ప్రస్తుతం శ్రీవారి గర్భాలయంలో ఉండే శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలు కూడా ఇదే మండపంలో ఉదేవని తెలుస్తోంది. అందుకే ఈ మండపానికి రాముల వారి మేడ అనే పేరు వచ్చిందని అంటారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గర్భాలయంలోకి, మిగిలిన విగ్రహాలను అంకురార్పణ మండపంలోకి తరలించారు.

  MLA Roja: జ్యోతిష్యురాలితో ఎమ్మెల్యే రోజా భేటీ.. మంత్రి పదవి కోసమేనా..?  శయన మండపం
  రాముల వారి మేడ నుంచి ముందుకు సాగితే వచ్చే మండపమే శయన మండపం. శ్రీనివాసుడు కొలువై విరాజిల్లుతున్న గర్భాలయంకు ముందు ఉన్న అంతరాళమే శయన మండపం అంటారు. 13 1/2 అడుగులు కొలతలో ఉండే ఈ మండపాన్నే అర్ధ మండపం అని అంటారు. శ్రీవారికి ప్రతినిత్యం రాత్రి వేళలో ఏకాంత సేవను ఈ మండపంలోనే నిర్వహిస్తారు. శ్రీవారి ప్రతి బింభం అయిన శ్రీనివాస మూర్తికి ఇదే మడపంలో ఏకాంత సేవ నిర్వహిస్తారు. శ్రీవారికి నైవేద్య నివేదన కూడా ఈ మండపంలోనే నిర్వహించడం ఆనవాయితీ. స్వామి వారికీ భోజనశాలగా, పవళింపు శాలగా పవిత్ర శయన మండపంను వినియోగిస్తున్నారు. శ్రీవారికి నిర్వహించే సహస్ర నామార్చన సేవను పండితులు శయన మండపంలో నిలబడి అర్చన చేస్తారు.

  IRCTC Tirupati Tour: ఫ్లైట్‌లో తిరుపతి టూర్... దర్శనం టికెట్లు కూడా... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే  కులశేఖర పడి...
  ఆ తరువాత ఉండే మండపమే సర్వజగత్ రక్షకుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన దివ్య స్థలం. గర్భాలయంలోకి వెళ్ళాలంటే కులశేఖర పడిని దాటాల్సిందే. పవిత్ర పుణ్య క్షేత్రం అయిన వెంకటాచలంపై భక్తి ప్రపర్తులతో 11 పసురాలను తమిళంలో రచించారు. ఓ వెంకటేశ్వర నీ ముందు రాతి గడపగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని శ్రీనివాసుని ప్రర్ధించాడట. అయన కోరిక తీరుస్తూ గర్భాలయానికి ముందున్న గడపను కులశేఖర పడి అని అంటారు.

  AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పీఆర్సీ అమలుకు రంగం సిద్ధం..  గర్భాలయం...
  కులశేఖర పడి దాటిన వెంటనే వచ్చేదే శ్రీవారి గర్భాలయం 7.2 అడుగుల మందంతో 12.9 అడుగుల చతురస్ర మండపం శ్రీవారి గర్భాలయం. శ్రీవారి గర్భాలయంపై ఆనంద నిలయాన్ని 1244-50 సంవత్సరాల నడుమ నిర్మించారట. సాలగ్రామ రూపంలో కొలువైన శ్రీవారి గర్భాలయంలో వంశ పారంపర్య అర్చకులు, జీయర్ స్వాములకు మినహా మరెవ్వరికి అనుమతి ఉండదు. శ్రీవారి గర్భాఆలయంలో పంచ బెరలు కొలువై ఉంటాయి. మూలమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు మూర్తి, ఉగ్ర శ్రీనివాస మూర్తి, మలయప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడే ఉంటాయి. శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీ సీత రామ లక్ష్మణ విగ్రహాలు, చక్రతాళ్వార్ విగ్రహాలు స్వామి వారి గర్భాలయంలోనే ఉంటాయి. భక్త ప్రియున్ని దర్శించాలంటే ఇన్ని మండపాలు దాటాల్సిందే. ప్రతి మండపం విశిష్టత తెలిస్తేన శ్రీవారి ఆలయం విశిష్టత అర్థం అవుతుంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala brahmotsavam 2021, Tirumala Temple, Tirumala tirupati devasthanam

  తదుపరి వార్తలు