హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD Rush: భక్తులతో కిటకిట లాడుతున్న ఏడుకొండలు.. సర్వదర్శనంకు ఎంత సమయం పడుతోంది అంటే?

TTD Rush: భక్తులతో కిటకిట లాడుతున్న ఏడుకొండలు.. సర్వదర్శనంకు ఎంత సమయం పడుతోంది అంటే?

తిరుమల పేరుతో ఉన్న డిపాజిట్స్ ఎంతంటే?

తిరుమల పేరుతో ఉన్న డిపాజిట్స్ ఎంతంటే?

TTD Rush: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సీజన్ తో సంబంధం లేకుండా..? భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తాజా తిరుమల గిరిలు కిటకిటలాడుతోంది..? తాజాగా ఎంతమంది దర్శించుకుంటున్నారు... ఎందుకంటే డిమాండ్..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

GT Hemanth Kumar, Tirupathi, News18

సప్తగిరుల్లో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి  (Lord Venkateswara Swamy)వారిని దర్శనార్ధం అనూహ్య రీతిలో తిరుమల గిరులకు భక్త జనం పోటేత్తారు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదలు కుని తిరుమల (Tirumala) లో ఎటు చూసినా భక్తులతో నిండి పోయింది.. అధిక రద్దీతో ఏడుకొండలు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి.. స్వామి వారి సర్వదర్శనానికి  దాదాపు ముప్పై గంటల సమయం పడుతోంది. తిరుచానూరు (Tiruchanoor) పద్మావతి అమ్మవారి  బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమీ తీర్థానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరు అవుతుంటారు.. పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానం ఆచరించేందుకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంకు చేరుకుని పుణ్యస్నానం ఆచరించి, అమ్మవారిని దర్శించుకుంటారు..

ఈ తరయణంలో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మత్సవాలు వీక్షించేందుకు విచ్చేసిన భక్తులతో ఏడుకొండకు కిటకిట లాడుతున్నాయి.. ప్రతినిత్యం  దేశ విదేశాల నుండి వివిధ రూపాల్లో కొండకు చేరుకున్న భక్తులకు వివిధ పద్దతుల ద్వారా స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తుంది టిటిడి.. వి.ఐ.పి బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, సర్వదర్శనం, దివ్య దర్శనం వంటి ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూనితులు అవుతుంటారు.

కోవిడ్ ముందు వరకూ సాఫీగానే స్వామి దర్శనం సాగినా.. ఆ తరువాత కోవిడ్ ఆంక్షలతో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాల్సి వచ్చింది టిటిడి.. దీంతో ఆన్లైన్ లో  టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులను టిక్కెట్లు పరిశీలించిన తరువాతే కొండకు అనుమతించేవారు.. కోవిడ్ తగ్గు ముఖం పట్టడంతో క్రమేపి భక్తుల సంఖ్యను పెంచుతూ వచ్చింది..

ఇదీ చదవండి : పవన్ పోటీ చేసే ప్లేస్ ఏది..? పిఠాపురమా? భీమవరమా? జనసేనాని మనసులో ఏముంది..?

తాజాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను భూదేవి కాంప్లెక్స్, గోవింద సత్రం, శ్రీనివాసం సత్రాల్లో రోజుకి నలభై ఐదు వేల టోకెన్ల జారీ చేస్తుంది.. ఈక్రమంలో స్వామి వారి దర్శనం కోసం సామన్య భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్దత్తున తిరుపతికి చేరుకుని టోకెన్లు పొంది కేటాయించిన సమయాల్లో తిరుమలకు వెళ్ళి స్వామి వారి దర్శనం పొందుతూ వస్తున్నారు..

ఇదీ చదవండి : గాడిద మాంసానికి ఏపీలో ఫుల్ డిమాండ్ పెరగడానికి కారణం ఇదే..?

అధిక రద్దీ కారణంగా టోకెన్ల ప్రక్రియలో రెండు, మూడు రోజు సంబంధిన టోకెన్లు ముందస్తుగానే టిటిడి జారీ చేయడంతో సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు కొండకు వెళ్ళలేక కుటుంబ సభ్యులతో కలిసి టోకెన్ల జారీ కేంద్రాల వద్దే ఉండాల్సిన పరిస్ధితి నెలకొనేది.. వారంతరాలు, సెలవు దినాల రోజుల్లో అధిక సంఖ్యలోనే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు చేరుకునేవారు.. భారీ సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకోవడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.. దీంతో తాత్కాలికంగా టోకెన్ల జారీని టిటిడి నిలిపి వేసింది.

ఇదీ చదవండి : ట్రాఫిక్ పోలీసుల రశీదుపై అన్యమత కీర్తనలు విషయంలో క్లారిటీ.. అధికారులు ఏమన్నారంటే..?

టోకెన్ల జారీ ప్రక్రియను టిటిడి పునః ప్రారంభించింది.. టైం స్లాట్ విధానంతో సామాన్య భక్తులకు కేవలం గంటన్నర సమయంలో స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది.. మరో వైపు తిరుపతిలో టైం స్కాడ్ టోకెన్లు పొందలేని భక్తులు నేరు తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామి వారిని దర్శనం పొందే సదుపాయం కల్పించింది టీటీడీ.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala, Ttd news