GT Hemanth Kumar, Tirupathi, News18
డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్ అయ్యింది.. అందుకే ఇప్పుడు ఏదీ కొనాలి అన్నా.. ఏది తినాలి అన్నా? జనాలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. డబ్బులు ఊరికే రావు కదా.. అని ఆఫర్ల కోసం వెతుకుతున్నారు. అందులోనూ ఫుడ్ లవర్స్ (Food Lovers) అయితే.. ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఫుడ్ లవర్స్ ఎవరైనా.. వారి బెస్ట్ ఆఫ్షన్ ఏదంటే బిర్యానీ (Biryani) నే అని చెప్పొచ్చు. ఎందుకంటే బిర్యానీ అంటే ఇష్ట పడని వారు అతి తక్కువమందే ఉంటారు. మంచి మసాలాతో సువాసన వస్తేచాలు ఆ హోటల్ కి జనం క్యూ కడుతుంటారు. ఇక కొత్త హోటల్ అంటే సాధారణంగా జనం క్యూ కట్టరు.. బిర్యానీ బాగుందని ప్రచారం జరిగితే గానీ అటు చూడరు జనం.
దీంతో ఓ హోటల్ ఓనర్ సరికొత్తగా ఆలోచించాడు.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకునే దిశగా ఓ ప్రకటన చేశాడు. అదేంటి అంటే.. ఐదు పైసలకే బిర్యాని అంటూ ఆఫర్ ఇచ్చాడు. ప్పుడో మరిచి పోయినా ఐదు పైసల కాయిన్ ను వెతికి మరి హోటల్ ముందు క్యూ కట్టేశారు జనం.
తాజాగా తిరుపతి (Tirupati) లోని కే.టి రోడ్డులో గురువారం సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ ప్రారంభం అయ్యింది.. కొత్త రెస్టారెంట్ అయినా అనూహ్యంగా సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ ప్రారంభం రోజే బిర్యానీ కోసం పెద్ద ఎత్తున జనాలు క్యూ కట్టారు.. అసలు ఆ రెస్టారెంట్ వచ్చిన స్పందన చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మరి.. ఎందుకంటే.. గుమగుమ లాడే ధమ్ బిర్యానీ కేవలం 5 పైసలకే ఇస్తుంటే ఎవరు వదులుకుంటారు. అందుకే ఇంట్లో వెతికి వెతికి మరీ... 5 పైసల కాయిన్ తీసుకు వెళ్లిన వారికి బిర్యానీ పెట్టడంతో పాటుగా పార్సెల్ కూడా ఇచ్చారు.. ప్రస్తుతం 5 పైసల కాయిన్ కనిపించడమే లేదు.
ఇదీ చదవండి : ముంచుకొస్తున్న మాండూస్ తుఫాన్.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
ఇలాంటి తరుణంలో ఐదు పైసలకే బిర్యానీ ఎలా ఇస్తాడో అని చూసేందుకు జనం వచ్చారు.. మరికొందరైతే ఇంట్లో నిరుపయోగంగా పడేసిన ఐదు పైసల బిల్లలను వెతికి మరి బిర్యానీని పార్సెల్ తీసుకెళ్ళారు.. ఏదీ ఏమైనప్పటికీ సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ లో మాత్రం ఐదు పైసల బిర్యానీలు భారీగా అముడు అయ్యాయి.. ఈ సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ కేవలం తిరుపతిలో కాకుండా చిత్తూరు నగరంలో రెండు బ్రాంచ్ లు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇదీ చదవండి : వామ్మో ఇదేం వ్యాపారం.. విజిలెన్స్ అధికారులకే మతిపోయింది.. ఏం చేస్తున్నారో తెలుసా?
మొదటగా ఒక్కటే ఉన్నా, ప్రజలు ఆదరించడంతో మరొకటి ఏర్పాటు చేసినట్లు హోటల్ యాజమాన్యం చెబుతుంది.. ప్రస్తుతం తిరుపతిలో ఐదు పైసలకే బిర్యానీ పెట్టిన సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ పై చర్చ నడుస్తుంది.. తోటి హోటల్ వ్యాపారస్తులతో పోటీ పడేందుకు ఇది కేవలం ఒక బిజినెస్ ట్రిక్ అంటూ కొందరు నెటిజన్లు చెబుతున్నారు.. ఏదీ ఏమైనప్పటికీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలైన ఐదు పైసల బిర్యానీ సాయంత్రం నాలుగు గంటల వరకూ పంపిణీ కొనసాగింది.. మొత్తం వెయ్యికి పైగా బిర్యానీలు అమలు పోయినట్లు హోటల్ యాజమాన్యం చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Bumper offer, Tirupati