హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Floods: ఏపీలో వరద బీభత్సం.. నాలుగు జిల్లాలు అతలాకుతలం..

AP Floods: ఏపీలో వరద బీభత్సం.. నాలుగు జిల్లాలు అతలాకుతలం..

ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు (Nellore District), చిత్తూరు (Chittoor District), కడప (Kadapa District), అనంతపురం జిల్లాలో (Anantapuram District) నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు (Nellore District), చిత్తూరు (Chittoor District), కడప (Kadapa District), అనంతపురం జిల్లాలో (Anantapuram District) నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వేలాది మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. భారీ వర్షాల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. తిరుపతి, నెల్లూరు నగరాలు ఇంకా నీటిముంపులోనే ఉన్నాయి. పెన్నా, సువర్ణముఖి నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమై వరద బాధితులకు సాయం అందిస్తున్నారు. నదులు, వాగులు, చెరువుల సమీపంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలాచోట్ల రోడ్లు కాలువలను తలపిస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

  భారీ వరదలతో నెల్లూరు జిల్లా జలదిగ్బందంలో చిక్కుకుంది. ముఖ్యంగా కోవూరు పరిసర ప్రాంతాలు అతలాకుతలంగా మారాయి. పెన్నానదికి పొర్లుకట్టకి గండిపడటంతో కోవూరు పట్టణం పూర్తిగా నీటమునిగింది. పట్టణంలో మొదటి అంతస్తువరకు వరదనీరు చేరింది. పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ నీటిలో కొట్టుకోవడంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపేశారు. కోవూరు వద్ద జాతీయ రహదారి కోతకు గురికావడంతో నెల్లూరు-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

  ఇది చదవండి: ధరపెరిగినా దొరకని కూరగాయలు.. జనానికి పచ్చడి మెతుకులే గతి.. కారణం ఇదే..!  వరదనీటిలో చిక్కుకున్న ప్రజలకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సాయమందిస్తున్నాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు జిల్లాలో ప్రాజెక్టులు నిండుకండల్లా మారాయి. సోమశిల జలశయానికి ఎగువ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే 29 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు జలమయం కావడంతో రైతులు భారీగా నష్టపోయారు.

  ఇది చదవండి: రెండు రోజుల్లో నిశ్చితార్థం.. మహిళా కానిస్టేబుల్ విషాదాంతం... ఇది ఊహకందని విషాదం..  చిత్తూరు జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరుపతి రామచంద్రాపురం మండలం రాయలచెరువు వరద నీటి కారణంగా చుట్టుప్రక్కల ఐదు గ్రామాలు నీటమునిగాయి. రాయల చెరువు గ్రామం, కాలేపల్లి, చిట్టలూరు, గొల్లపల్లి, సూరవారిపల్లి చుట్టుపక్కల గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

  ఇది చదవండి: కిటికీలో చేయిపెట్టి దోచేస్తాడు.. ఈ దొంగ రూటే సపరేటు..!  కడప జిల్లా జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. కడప-కమలాపురం మధ్య పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. వరద ఉధృతికి బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోవడంతో కూలిపోయింది. అక్కడక్కడ బ్రిడ్జి అడ్డంగా చీలిపోయింది. దీంతో కమలాపురం-కడప మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి కూలిపోయే సమయంలో వాహనాలు, ప్రజలు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు అటువైపు రాకుండా రెండువైపులా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కడప నగరంలోని రమేష్ థియేటర్ సమీపంలో పాత భవనం వర్షానికి దెబ్బతిని కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అందులో ఇరుక్కుపోయిన తల్లికుమార్తెను సురక్షితంగా బయటకుతీసుకొచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP Floods, Chitoor, Heavy Rains, Kadapa, Nellore Dist

  ఉత్తమ కథలు