TIRUPATI HEATED DISCUSSION CAUSED TO PHYSICAL ATTACK BETWEEN GRAMA VOLUNTEERS IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Volunteers Fight: వాలంటీర్ల మీటింగ్ లో రేగిన వివాదం... మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వాలంటీర్ భర్త… తర్వాత ఏం జరిగిందంటే..!
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలు (Andhra Pradesh Government Schemes), ఇతర ప్రయోజనాలను నేరుగా ప్రజల వద్దకే అందించేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలను నేరుగా ప్రజల వద్దకే అందించేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. రేషన్ పంపిణి నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలు వారి ద్వారానే అమలు చేస్తూ వస్తున్నారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఓ గ్రామా వాలంటీర్లను నియమించి పథకాలు అమలుకు కృషి చేస్తున్నారు. అలంటి వాలంటీర్ల మధ్య వివాదం చెలరేగింది. మాట పట్టింపులకు పోయి ఒకరిపై మరొకరు దాడికి దిగేంత కక్షలకు దారి తీసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వాలంటీర్ల మధ్య రేగిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. చంద్రగిరి మండలంలో వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గానికి సంబంధించిన గ్రామా సచివాలయ సెక్రటరీల నుంచి... వార్డు వాలంటీర్ల వరకు సమావేశం అయ్యారు. అందరూ ఆ సమావేశంలో మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంతలో ఏ రంగంపేటకు చెందిన వాలంటీర్ సాయి మీటింగ్ మధ్యలో లేచి అదే గ్రామానికి చెందిన పవిత్ర అనే మరో వాలంటీర్ పై ఫిర్యాదు చేశాడు.
మీటింగ్ లో జరుగుతున్న చర్చను మొబైల్ లో సీక్రెట్ గా రీకార్డ్ చేస్తున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని గ్రామా సచివాలయం సెక్రటరీ దృష్టికి మీటింగ్ మధ్యలోనే తీసుకెళ్లాడు. ఇదే అంశంపై వాలంటీర్ పవిత్ర, సాయిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరికి సర్దిచెప్పిన అధికారులు వారిని ఇంటికి పంపారు. వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. మరుసటి రోజు వాలంటీర్ పవిత్ర జరిగిన విషయాన్ని తన భర్త సురేష్ కు చెప్పింది.
పవిత్ర భర్త సురేష్ పశువుల కాపరి కావడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో పశువులను మేపుతుండగా... అదే మార్గంలో వాలంటీర్ సాయి వెళ్లడాన్ని గమనించాడు. వెంటనే సురేష్ అతనిని పిలిచి వాదనకు దిగాడు. నువ్వు తప్పు చేశావంటే.... మీ భార్య తప్పు చేసిందంటూ ఇద్దరు మాటల యుద్దానికి దిగారు. మాట.. మాటా పెరగడంతో ఇద్దరూ ముష్టి యుద్దానికి దిగారు. ఒకరిపై మరొకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. ఘటనలో ఇద్దరికీ గాయాలవడంతో ఆస్పత్రి పాలయ్యారు. అంతేకాదు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో చంద్రగిరి పోలీసులు ఇద్దరి ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.