HBD Nara Devansh: నారా-నందమూరి కుటుంబాల (Nara -Nandamuri Families) ముద్దల వారసుడు నారా దేవాన్ష్ (Nara Devansh) .. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కి.. ఇటు ఎమ్మెల్యే, నట సింహం నందమూరి బాలయ్య (Nandamuri Bala Krishna)కు.. ఇద్దరి దేవాన్ష్ అంటే అమితమైన ప్రేమ.. అందుకే దేవాన్షన్ పుట్టిన రోజు అంటే రెండు కుటుంబాల్లోనూ ఓ పండగ వాతావరణం.. దేవాన్ష్ పుట్టిన రోజును రెండు కుటుంబాలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాయి. అయితే కేవలం వేడుకలు చేసుకోవడమే కాదు.. అతడి పేరు మీద ఇరు కుటుంబాలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తుంటాయి. మరోవైపు ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా విరాళాలు అందిస్తూ వస్తోంది నారా కుటుంబం. దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా సోమవారం తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం జరగనుంది. టీటీడీ (TTD) అన్నదానం పథకానికి ఒక్క రోజు అయ్యే మొత్తం ఖర్చును విరాళంగా ఇచ్చారు నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) .
టీటీడీకి విరాళం ఇచ్చినట్టు నారా లోకేష్ ట్వీట్ చేశారు. సమాజమే దేవాలయం అని భావించే సంస్కృతిని, దానగుణాన్ని చిన్ననాటి నుండే పిల్లలకు అలవాటు చేయడం తల్లిదండ్రుల ఉత్తమ సంస్కారానికి నిదర్శనం అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సమాజమే దేవాలయం అని భావించే సంస్కృతిని, దానగుణాన్ని చిన్ననాటి నుండే పిల్లలకు అలవాటు చేయడం తల్లిదండ్రుల ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. టీడీపీ అధినేత, @ncbn గారి మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు ఈరోజు. (1/2) pic.twitter.com/stK8IMjTHQ
— Telugu Desam Party (@JaiTDP) March 21, 2023
అయితే ఇదే మొదటి సారి కాదు ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే వ్యయం మొత్తం విరాళంగా ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి నిత్య అన్నదానం కోసం 33 లక్షల రూపాయల విరాళం అందించారు నారా భువనేశ్వరి.. తన మనవుడు ఆయురారోగ్యాలతో వందేళ్లు సంతోషంగా ఉండాలని కోరుతూ శ్రీవారిని ఆమె మొక్కుకున్నారు.
సాధారణంగా ఒక్కరోజు అన్నదానినికి 30 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ విరాళంతో అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీని చంద్రబాబు కుటుంబం కోరింది. దీంతో సోమవారం తరిగొండ వెంగమాంబ నిత్యాప్రసాద భవనంలో టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి : మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. ఆ లీవులు ఎప్పుడైనా వాడుకొనే అవకాశం
టీడీపీ చీఫ్ చంద్రబాబు తనయుడు లోకేశ్, నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిలకు 2007లో వివాహం జరగ్గా, ఈ జంటకు 2015లో తొలి సంతానంగా దేవాన్ష్ పుట్టాడు. ఇవాళ్టితో దేవాన్ష్ తొమ్మిదవ ఏట అడుగుపెట్టాడు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, నారా అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nara Devansh, Nara Lokesh, Tirumala tirupati devasthanam