హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati: కలియుగ వైకుంఠంలో శ్రీవారి మరో అవతారం.., కనుమరుగైన స్వామివారి వారి రూపం.. వివరాలివే..!

Tirupati: కలియుగ వైకుంఠంలో శ్రీవారి మరో అవతారం.., కనుమరుగైన స్వామివారి వారి రూపం.. వివరాలివే..!

తిరుపతిలో ఉనికి కోల్పోతున్న గుండాల వెంకన్న ఆలయం

తిరుపతిలో ఉనికి కోల్పోతున్న గుండాల వెంకన్న ఆలయం

Tirumala: పచ్చని కొండల నడుమ చినుకు పడితే చాలు జలధారలు జాలువారే కపిల తీర్థం ప్రాంతం అది. చుట్టూ కొండలు... ఎత్తైన చెట్లు... జలపాతం నెలకొన్న ప్రాంతంలో మాల్వాడి గుండం ఉంది. ఈ మాల్వాడి గుండానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

GT Hemanth Kumar, News18, Tirupati

కార్తికేయ-2 (Karthikeya-2) సినిమా ఘాన విజయం సాధించి... హిందువుల ఆరాధారణ పొందింది. సినిమా మొదటి నుంచి చివరి వరకు శ్రీ కృష్ణుడు., హీరో., భగీరలు., విల్లన్ల మధ్య కథ సాగుతూ ఉంటుంది. వృత్తి రీత్యా దొంగలైనా భగీరాలు.. శ్రీ కృష్ణుని భక్తులు. ద్వారకలో ప్రవేశం లేకుంటే.. శ్రీ కృష్ణుని ప్రతిమలు పెట్టుకొని పూజలు చేసే వాళ్ళు. కేవలం ద్వారకే పరితం కాలేదు. దేశ వ్యాప్తంగా ఇలానే సాగేది. నిజంగానే పూర్వం అలానే ఉండేలా వాళ్ళ..? అప్పట్లో తిరుమలలో సైతం కొందరికి ఆలయ ప్రవేశాలు ఉండేవి కావు..? ఆలయ ప్రవేశం లేని వాళ్ళు ఎక్కడ శ్రీవారిని కొలిచేవారో తెలుసా..?

పచ్చని కొండల నడుమ చినుకు పడితే చాలు జలధారలు జాలువారే కపిల తీర్థం ప్రాంతం అది. చుట్టూ కొండలు... ఎత్తైన చెట్లు... జలపాతం నెలకొన్న ప్రాంతంలో మాల్వాడి గుండం ఉంది. ఈ మాల్వాడి గుండానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఇక్కడ వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు గుండాల వెంకన్నగా పేరు గాంచారు. ఆలా అని ఇక్కడేం గుడి లేదు., ఎత్తైన గోపురం అంతకన్నా లేదు. ఓ ఎత్తైన కొండపై రెండు అడుగుల శిలారూపం చెక్కబడి ఉంటుంది.

ఇది చదవండి: సామాన్య భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ట్రయిల్ రన్ సక్సెస్ అయితే పండుగే

ఆ శిలా రూపం చూస్తే అప్పట్లోనే కళానైపుణ్యం ఎలా ఉండేదో యిట్టె పసిగట్టవచ్చు. అసలు గుండాల వెంకన్న ఎందుకు ఇక్కడ వెలిశాడు. హిస్టరీ ఏంటి అనే సందేహం రాక మానదు. పూర్వం... కులాల వారీగా విభజించి అగ్ర కులస్థులను క్షత్రియులు, సూద్రులకు మాత్రమే ఆలయ ప్రవేశము ఉండేది. బడుగు మహిళను వర్గమైన మాల, మాదిగలకు ఆలయాల్లోప్రవేశం ఉండేది కాదు. వెంకన్నపై అపారమైన భక్తి ఉన్న మాల వాళ్ళు కపిల తీర్థానికు సమీపంలో ఉన్న కొండల్లో నివసించే వారు. అక్కడే ఓ పెద్ద జలపాతం ఉండేది. తమ స్వామి వారిని ఆలయంలో చూసుకోలేని ఆ మాలలు కొండపై వెంకన్న రూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం స్వామి వారికి దూపదీప నైవేద్యాలు సమర్పించేవారు. ఇక అక్కడే జాలువారే జలపాతంలో స్నానాలు ఆచరించి స్వామి వారిని సేవించే వారు. అలా ఆ ప్రాంతానికి మాల్వాడి గుండం అని అక్కడ కొలువైన వెంకన్నను గుండాల వెంకన్న అని పేరు గాంచాడు.

కాలక్రమేణా అన్నమయ్య బ్రహ్మమొక్కటే పర పాటతో దళితులని ఆలయ ప్రవేశం చేసేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అలా మాల్వాడి గుండంలో వెలసిన వెంకన్నకు ఆరాధనలు కరువయ్యాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన జుంగిల్ బుక్ లో ఓ భాగం అయింది. రూపు పూర్తిగా మాపేసి రంగులద్ది.. సరైన రూపంలేకుండా గుండాల వెంకన్న దీనస్థితిలో ఉన్నాడు. స్వామి వారి రూపాన్ని పూర్వం ఉన్న విధంగా రూపుదిద్ది గుండాల వెంకన్న వైభవాన్ని పర్యాటకులకు అందించాలని కోరుకుంటున్నారు స్థానికులు. శ్రీవారు కొలువైన కొండా పవిత్రమైనదని అలాంటి కొండల్లో రూపం కోల్పోయిన గుండాల వెంకన్న రూపాన్ని తిరిగి ఏర్పాటు చేయాలనీ కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Tirupati

ఉత్తమ కథలు