Home /News /andhra-pradesh /

TIRUPATI GOOD NEWS TO TIRUMALA DEVOTEES WATCH E AUCTION AT THIS MONTH 18TH NGS TPT

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. 18న వేలానికి సిద్ధమైన వాచీలు.. వేలంలో ఎలా పాల్గొనాలి అంటే..?

తిరుమలలో వాచ్ ల వేలం

తిరుమలలో వాచ్ ల వేలం

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. సాధారణంగా స్వామివారికి సమర్పించిన కానుకలను ప్రసాదంగా భక్తులు భావిస్తారు. వాటిని తీసుకుని.. స్వామి వారి ఆశీస్సులు పొందాలని అరాటపడుతుంటారు. అలాంటి వారి కోసం ఈ నెల 18వ తేదీన వేలం వేసేందుకు టీటీడీ సిద్ధమైంది.. అయితే ఈ వేలంలో ఎలా పాల్గొనాలి అంటే..?

ఇంకా చదవండి ...
    Tirumala: కలియుగ వైకుంఠం శ్రీనివాసుడు (Lord Venkateswara Swamy)కి సాధారణంగానే భారీగా కానుకలను వస్తూ ఉంటాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తమ శక్తి కొలదీ కానుకలను నిత్యం సమర్పిస్తూనే ఉంటారు. ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో కానుకలు ఇస్తూ ఉంటారు. ధన, కనుక, వస్తువులను కానుకలుగా.. భూరి భూమిని విరాళంగా ఇస్తుంటారు. కొందరు కోట్లలో కొందరు లక్షల్లో.. సామాన్యులైతే వేలు, వందలు వారి స్థాయిని బట్టి కానుకలు సమర్పిస్తారు. అయితే అలా వచ్చిన వస్తువులను తిరుమల తిరుపతి (Tirumala Tirupati) దేవస్థానం వేలం వేస్తోంది. స్వామివారికి సమర్పించిన కానుకలను ప్రసాదంగా భక్తులు భావిస్తారు. వాటిని తీసుకుని.. స్వామి వారి ఆశీస్సులు పొందాలని అరాటపడుతుంటారు. అలాంటి వారి కోసం ఈ నెల 18వ తేదీన వేలం వేసేందుకు టీటీడీ సిద్ధమైంది.. అయితే ఈ వేలంలో ఎలా పాల్గొనాలి అంటే..

    తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఈ నెల 18న వాచీల ఈ-వేలం నిర్వహించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈ-వేలంలో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర ప్రభుత్వ (AP Government) కొనుగోలు పోర్టల్ ద్వారా 18న ఈ-వేలం నిర్వహించనున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ (TTD) ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.



    ఈ వేలంలో సీకో, హెచ్ఎమ్‌టీ, టైటాన్, సోని, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, సిటిజన్, రొలెక్స్‌తోపాటు ఇతర కంపెనీల వాచీలు ఉన్నాయి. వీటన్నింటినీ వేలంలో అందుబాటులో ఉంచుతారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా పాడైన వాచీలు.. ఇలా వివిధ కేటగిరీలుగా వీటిని భక్తులకు అందుబాటులోకి ఉంచుతారు.

    ఇదీ చదవండి : యాక్టర్లుగా మారుతున్న ఏపీ రాజకీయ నేతలు.. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మాజీ మంత్రి ఎంట్రీ.. ఎవరో తెలుసా?

    భక్తుల ఆరాటం నేపథ్యంలో స్వామివారి వాచ్ లను ఈ వేలం వేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రెడీ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు ఈ మధ్యా భారీగానే వాచ్ లు కానుకుగా వచ్చాయి. అలాంటి వాచ్ లను 18వ తేదీన ఈ వేలం వేయనున్నారు.

    ఇదీ చదవండి : పిన్నిని చంపిందెవరు అంటూ వైసీపీ ప్రశ్నల వర్షం.. మీదే రక్త చరిత్ర అంటూ లోకేష్ కౌంటర్.. వాస్తవం ఏంటి..?

    మొత్తం 22 లాట్ల వాచీలు ఈ-వేలంలో ఉంటాయి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే..? ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నెంబ‌రులో, కార్యాలయం వేళల్లో సంప్రదించవచ్చు. అలాగే టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించి ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించుకోవాలని సూచిస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Tirumala, Tirumala tirupati devasthanam, Ttd, Ttd news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు