Tirumala: శ్రీవారి ఆలయంలో బంగారు తాపడం పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం తరువాత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... 1957-58 సంవత్సరాల్లో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపట్టారని.. అప్పట్లో ఆగమ శాస్త్రం అనుసారం ఎలా నిర్వహించారో అదే విధంగా నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 23వ తేదీన బలాలయం ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లో బంగారు తాపడం పనులు పూర్తిచేస్తామన్నారు.
బంగారు తాపడం పనులకు బంగారంను భక్తులు కానుకగా ఇచ్చిన దానినే ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వైకుంఠ ద్వారా దర్శనాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పది రోజులపాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతాంమని చెప్పారు. గత రెండేళ్ల కాలంలో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చిన విధంగానే ఈ ఏడాది సైతం తిరుపతిలో స్ధానికుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసారు.
సామాన్య భక్తులకు మెరుగైన సౌఖర్యం కల్పించే విధంగా టిటిడి పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.1400 దేవాలయాల నిర్మాణంకు అనుమతి ఇచ్చిన 200 దేవాలయాలు మాత్రమే పూర్తి చేయగలినట్లు తెలిపిన ఆయన.. మిగిలిన 1200 దేవాలయాలను దేవదాయ శాఖతో చర్చించి త్వరితగతిన నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్రేక్ దర్శనాల మార్పు చేయడం ద్వారా గదుల ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నామని.. ఏ రోజుకు ఆరోజు భక్తులు కొండకు వచ్చి దర్శనం చేసుకుంటారన్నారు.
రాత్రంతా గంటల కొద్ది క్యూలైన్స్ లో వేచి ఉండే భక్తులకు సౌఖర్యార్ధం బ్రేక్ దర్శనం సమయం మార్పు చేసామన్నారు. రేపటి నుండి ప్రయోగాత్మకంగా నెల రోజుల పాటు బ్రేక్ దర్శనంను 7:30 నుండి 8 గంటల నడుమ నిర్వహిస్తామన్నారు. బ్రేక్ దర్శనంలో సమయాల్లో మార్పులు అవసరం అయితే సమయంను మార్పు చేస్తామని తెలిపారు. బాలజీ నగర్ లో కనీస వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు మూడు కోట్ల డెభై లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు. పద్మావతి అతిధి గృహంలో ఆధునీకరణకు మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు నిధుల మంజూరుకుపాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంటలను రైతుల దగ్గర నుండి మార్కెట్ రేటుతో కొనుగోలు చేయాలని ఈవోను ఆదేశించామన్నారు. జమ్మూ కాశ్మీర్ లో నిర్మిస్తున్న ఆలయంను రాబోయే రెండు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో శ్రీవారి ఆలయంకు ఘాట్ రోడ్డుకు ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని.. స్విమ్స్ ఆసుపత్రిలో అదనపు అంతస్తు నిర్మాణంకు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు కేటాయింపుకు బోర్డు ఆమోదం ముద్ర వేసిందన్నారు.
ఇక లడ్డూ కౌంటర్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. తరువాత టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి ఆన్ లైన్ద్వా రా రోజు ఇరవై ఐదు వేల చొప్పున విడుదల చేస్తామని స్పష్టం చేసారు. ఎస్ఎస్డి టోకెన్లను ప్రతి రోజు యాభై వేల టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తామని.. టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనంకు అనుమతిస్తామని తెలిపారు. నేరుగా వచ్చిన విఐపిలకు మాత్రమే జనవరి అర్ధరాత్రి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala tirupati devasthanam