హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి మారిన బ్రేక్ దర్శనం టైమింగ్స్.. సామాన్య భక్తులు హ్యపీ

TTD Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి మారిన బ్రేక్ దర్శనం టైమింగ్స్.. సామాన్య భక్తులు హ్యపీ

భక్తులకు టీటీడీ సూచన

భక్తులకు టీటీడీ సూచన

TTD Alert: శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే సామాన్యుల భక్తులకు శుభవార్త.. నేటి నుంచి దర్శన సమయాల్లో మార్పులు చేశారు. విఐపీ విరామ సమయం దర్శనాల సమయానికి సాయంత్రం నుంచి ఉదయానికి మార్చడంపై సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

GT Hemanth Kumar, Tirupathi, News18

TTD Alert: భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) దర్శనార్థం నిత్యం లక్షలాది మంది తిరుమలకు చేరుకుంటారు. స్వామి వారి దివ్య స్వరూపాన్ని క్షణకాల దర్శనం కోసం తపించి పోతారు భక్తులు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం  క్యూ కడుతూనే ఉంటారు. స్వామి వారి దర్శనాలలోకెల్లా బ్రేక్ దర్శనం (VIP Break Dharshan) అంటేనే భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ఇతర ప్రముఖుల సిపార్సు లేఖపై స్వామి వారిని దర్శించుకుంటూనే.. త్వరగా దర్శనం అవుతుందన్నది అందరి నమ్మకం.. అందుకే  మాన్యులు., సంపన్నులు వారి వ్యక్తిగత సిపార్సు పై విఐపి బ్రేక్ దర్శనాలు పొందుతున్నారు. ఎలాంటి సిఫార్సు లేకుండా.. గంటల తరబడి క్యూలైన్లో వేచియుండే భక్తులకు మాత్రం కొంత మేర ఇబ్బందులు తప్పడం లేదు.

రాత్రంతా క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో టీటీడీ (TTD) మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సాగె విఐపి బ్రేక్ దర్శన టైమింగ్స్ లో మార్పులు తీసుకు వచ్చింది.

నేటి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12ల వరకు బ్రేక్ దర్శనాల సమయంలో మార్చులు చేశారు. స్వామి వారికీ నిత్య కైంకర్యాలు అయినా వెంటనే.. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సామాన్యులకు దర్శనభాగ్యం కల్పించాలని., అటు తరువాత.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్రేక్ దర్శనం ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి : ఆ విషయాలు చెపితే ఉరి వేసుకోవాల్సిందే..? చంద్రబాబుపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

ఈ విధానం ద్వారా సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం., గదుల కేటాయింపు పై ఒత్తిడి తగ్గించేలా టీటీడీ ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా నేటి నుంచి ప్రారంభమయ్యాయి.  సత్పలితాలు సాధిస్తే.. ఆచరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీటీడీ. గతంలోనూ విఐపి బ్రేక్ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. సామాన్య భక్తుల దృష్ట్యా ఎనిమిదేళ్ల  క్రితం బ్రేక్ దర్శన విధానంలో భారీ మార్పులను తీసుకొచ్చింది టీటీడీ.

ఇదీ చదవండి : బీసీలపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్.. ఒక్కరోజు ముందుగానే మరో భారీ కార్యక్రమం

ముందుగా వారాంతం రోజులలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ క్రమేణా గురువారం మినహా మిగిలిన అన్ని రోజులలో సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సాయత్రం బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి ఉదయం పూట మాత్రమే బ్రేక్ దర్శనాలు అమలు చేసింది టీటీడీ. దీంతో సామాన్య భక్తులకి అదనంగా మూడు గంటల పాటు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఏర్పడింది. గత ప్రభుత్వ హయంలో విఐపి బ్రేక్ దర్శనాలలో మూడు విధానాలను ప్రవేశ పెట్టారు.

ఇదీ చదవండి : వావ్.. లడక్ లో బైక్ పై రయ్ రయ్.. నారా బ్రహ్మణిలో ఆ టాలెంట్ కూడా ఉందా?

ఎల్ 1,ఎల్ 2 ,ఎల్ 3 విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో టికెట్ ధర మాత్రం అందరికి 500 రూపాయలే అయినా స్వామి వారి ముందు ఒక్కొక్కరికి ఒక్కోలా దర్శనం చేయించేవారు. ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కూడా గత పాలక మండలి విమర్శలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి : సొంత జిల్లాలకు సీఎం జగన్.. ఎందుకంటే.. పూర్తి షెడ్యూల్ ఇదే

దీంతో ఎల్ 1,ఎల్ 2 ,ఎల్ 3 దర్శనాలపై కోర్టులో ప్రజా ప్రయోజనాలవాజ్యం వేసారు.. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాల పేరుతో రోజు వేలాది విఐపి దర్శన టికెట్లు ను కేటాయించేవారు. శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నారో తెలియజేయాలని టీటీడీ ఈవోను హైకోర్టు ఆదేశించింది. తిరుమల కొండపై వీఐపీ బ్రేక్‌ దర్శనాల కారణంగా సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారని, వీటిని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మరోమారు విచారించింది.

ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దుపై తగిన నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు చైర్మన్‌ చెప్పినట్టుగా మీడియాలో వచ్చిన కథనాలను ధర్మాసనం ప్రస్తావించింది. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది అనుమానాలను వ్యక్తం చేశారు. బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ చైర్మన్‌ సొంతంగా నిర్ణయం తీసుకోలేరని, ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను ‘ప్రోటోకాల్‌ దర్శనం’గా మారుస్తారేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. బ్రేక్‌ దర్శనాలపై తగిన వివరణ ఇవ్వాలని టిటిడి ని ఆదేశించింది.  దీంతో టీటీడీ ఈ మార్పులు చేసింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala Temple, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు