TIRUPATI GOOD NEWS TO TIRUMALA DEVOTEES ONLINE AUCTION TO VENKATESWARA SWAMY GIFTED DRESSES NGS TPT
Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వేలానికి సిద్ధమైన స్వామి వారి వస్తువులు..? వేలంలో ఎలా పాల్గొనాలి అంటే..?
వేలానికి శ్రీవారి వస్త్రాలు
Tirumala: కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాత శ్రీవారి భక్తులకు వరుస శుభవార్తలు అందిస్తోంది టీటీడీ.. తాజాగా శ్రీవారికి వచ్చిన వస్త్రాలను వేలం వేయాలని టీడీడీ నిర్ణయించింది. అయితే దీనికి విపరీతమైన పోటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వేలంలో మీకు పాల్గొనాలని ఉందా.? అయితే ఇలా చేయండి.
Tirumala: కలియుగ దైవం.. ఆపదమొక్కుల వాడు శ్రీనివాసుడు కొలువైన దివ్య పుణ్య క్షేత్రం తిరుమల(Tirumala)కు ప్రస్తుతం భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. ఓ వైపు మాడు పగిలే ఎండ.. రోజులు తరబడి క్యూ లైన్లు ఉన్నా భక్తులు అవేమీ లెక్క చేయడం లేదు. సాధారణంగానే వేసవిలో భారీగా భక్తులు వస్తారు.. కానీ ఈ సారి ఊహించని విధంగా భక్తులు క్యూ కడుతున్నారు. ఒకటి రెండు రోజులు భక్తులు నెమ్మదించినట్టే కనిపించి.. మళ్లీ రికార్డు స్థాయిలో పోటెత్తుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. కరోనా (Corona) ప్రభావమే.. ఈ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు చాలామంది శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు.. కలియుగంలో మానవాళిని కష్టనష్టాల నుంచి రక్షించడానికి వెలిశాడని భక్తుల నమ్మకం. అందుకే స్వామివారిని రోజూ భారీ సంఖ్య (Rush in Tirumala) లో దర్శించుకుంటారు. ఇటీవల చూస్తే రికార్డు స్థాయిలో భక్తులు పెరుగుతున్నారు.. అందుకు తగ్గట్టే హుండీ ఆదాయం కూడా గతంలో్ కంటే భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ప్రత్యేకమైన రోజుల్లోనూ.. వారంతాల్లోనే అధికంగా భక్తులు పోటెత్తేవారు.. కాని ఇప్పుడు సాధారణ రోజుల్లో సైతం అదే రద్దీ కనిపిస్తోంది. కొన్ని సార్లు సర్వ దర్శనానికి 48కి పైగా గంటలు పట్టింది అంటే.. రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. మరోవైపు భక్తుల నుంచి వస్తున్న ఆధరణ బట్టి.. వరుస శుభవార్తలు చెబుతోంది.
సాధారణంగా శ్రీనివాసుడు (Lord Venkateswara Swamy)కి భారీగా కానుకలను వస్తూ ఉంటాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తమ శక్తి కొలదీ కానుకలను నిత్యం సమర్పిస్తూనే ఉంటారు. ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో కానుకలు ఇస్తూ ఉంటారు. ధన, కనుక, వస్తువులను కానుకలుగా.. భూరి భూమిని విరాళముగా ఇస్తారు. కొందరు కోట్లలో కొందరు లక్షల్లో.. సామాన్యులైతే వేలు, వందలు వారి స్థాయిని బట్టి కానుకలు సమర్పిస్తారు. అయితే ఇలా స్వామివారికి సమర్పించిన వస్త్రాలను శేష వస్త్రాలుగా ప్రసాదంగా భక్తులు భావిస్తారు. వాటిని తీసుకుని.. స్వామి వారి ఆశీస్సులు పొందాలని భక్తులు అరాటపడుతుంటారు.
అలా భక్తుల ఆరాటం నేపథ్యంలో స్వామివారి వస్త్రాలను ఈ వేలం వేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రెడీ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు ఈ మధ్యా భారీగానే కానుకులు వచ్చాయి. అలా భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వస్త్రాలను టీటీడీ ‘ఈ వేలం’ వేయడానికి సిద్దమైంది. ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేస్తున్నట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. వేలంలో పాలిస్టర్ నైలాన్, నైలెక్స్ చీరలు, ఆర్ట్ సిల్క్ చీరలు, బ్లౌజ్పీస్లు కొత్తవి, స్వామివారి సేవకు వినియోగించిన వస్త్రాలున్నాయి.
అయితే ఇది కేవలం ధనవంతులకు మాత్రమే కాదు.. సామాన్య భక్తులు సైతం ఈ వేలంలో పాల్గొనవచ్చు. స్వామివారి వస్త్రాలు కొనుగోలు చేసే ఆసక్తిగల భక్తులు ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంది. ఫోన్ నెంబర్ 0877-2264429 సంప్రదించవచ్చు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org వెబ్సైట్ను గానీ సంప్రదించి వేలానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.