హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD Alert: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటి దగ్గర నుండే టీటీడీ 2023 క్యాలెండర్లు, డైరీలు పొందండి? ధర ఎంతంటే?

TTD Alert: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటి దగ్గర నుండే టీటీడీ 2023 క్యాలెండర్లు, డైరీలు పొందండి? ధర ఎంతంటే?

ఇంటి దగ్గర నుంచే టీటీడీ డైరీలు, క్యాలెండర్లు ఇలా పొందండి..

ఇంటి దగ్గర నుంచే టీటీడీ డైరీలు, క్యాలెండర్లు ఇలా పొందండి..

TTD Alert: TTD Alert: కలియుగ వైకుంఠం తిరుమల లో కొలువై ఉన్న శ్రీ వారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఇంటి దగ్గర నుంచే టీటీటీ కొత్త డైరీలు.. క్యాలెండర్లు పొందవచ్చు.. ఒక్క డైరీ, క్యాలెండర్ ధర ఎంతో తెలుసా..? ఆన్ లైన్ లో వీటిని ఎలా పొందాలి అంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

TTD Alert: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) భక్తులకు అలర్ట్.. తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తారో.. క్యాలెండర్లు (Calenders), డైరీ (Daries) లను కొనుగోలు చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణంగా శ్రీవారి డైరీలు.. క్యాలెండర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. వీటి కోసం తిరుమల వెళ్లాల్సిన అవసరం లేదు.. సాధారణంగా గతంలో తిరుమలలో కాకుండా.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ కార్యాలయాలు.. ఆలయాల్లో విక్రయించేవారు.. తరువాత అమెజాన్ (Amzon)లాంటి ఈ కామర్స్ సంస్థలు వీటిని విక్రయిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) నేరుగా ఆన్ లైన్ లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల నుంచే ఆన్ లైన్ ద్వారా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి డైరీలు, క్యాలెండర్లు ఈజీగా పొందొచ్చు. క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేయడానికి నేరుగా తిరుమలకే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే తెప్పించుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.?

ఎలా బుక్ చేసుకోవాలి అంటే?

ప్రస్తుతం టీటీడీ 2023 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.వ వీటిని టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా క్యాలెండర్‌, డైరీలను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానములు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. లాగిన్ అయ్యి.. అక్కడే మీకు కావాల్సిన వాటిని బుక్ చేసుకోవచ్చు..

ఒకవేళ ముందుగానే వెబ్ సైట్ లో రిజిస్టర్ అయి ఉంటే ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. లేదంటే న్యూ యూజర్ పేరుతో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తరువాత వెబ్ సైట్ కు కుడివైపు చివర్లలో ఉండే పబ్లికేషన్స్‌ ఓపెన్ చేయాలి.. అక్కడ ఉండే డైరీస్‌/క్యాలెండర్స్‌/పంచాగమ్‌ ఆప్షన్లను క్లిక్ చేయాలి.. ఆ లింక్ ఓపెన్ చేయగానే.. కొన్ని కండిషన్స్‌ కనిపిస్తాయి. దానిపై క్లిక్‌ చేసి అగ్రీ బటన్‌ను క్లిక్ చేయాలి.. ఆ తరువాత షిప్పింగ్ ఎక్కడికి అన్నది కంట్రీ ఆప్షన్లు ఉంటాయి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

ఇదీ చదవండి : విశాఖలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే.. భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనం..!

ఆ తరువాత కొన్ని ఆప్షన్లు వస్తాయి. అక్కడ మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి.. ప్రస్తుతం బిగ్ డైరీలు.. స్మాల్ డైరీలు, తిరుమల క్యాలండర్, టేబుల్ క్యాలండర్ లను అందుబాటులో ఉంచుతోంది. వాటిలో ఏది కావాలి అన్నది మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంత క్వాంటిటీ కావాలి అన్నది కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ పూర్తైన తరువాత చివర్లో.. ఎక్కడ డెలివిరీ కావాలి అనుకుంటున్నారో.. అడ్రస్‌ను ఎంటర్‌ చేసిన తరువాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ కార్డ్, ఆన్ లైన్, యూపీఐ పేమెంట్ల ద్వారా మీకు నచ్చిన వాటిని నచ్చిన సంఖ్యలో బుక్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి : నవంబర్ లో వెళ్లాల్సిన బెస్ట్ పికినిక్ స్పాట్.. అక్కడ కొండెక్కితే మేఘాలు చేతికే అందుతాయా..?

ధర ఎంత..? సర్వీస్ ఛార్జ్ షాక్..

ఒక్క డైరీకి ఒక్కో ధర నిర్ణయించింది టీటీడీ. పెద్ద డైరీ అయితే 150 రూపాయలు.. చిన్న డైరీ 120 రూపాయలు, ఇక తిరుమల డేట్ క్యాలెండర్ 130 రూపాయలు.. టేబుల్ క్యాలండర్ అయితే 75 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. వీటి ధర కంటే సర్వీస్ చార్జ్ ఎక్కువ వసూలు చేస్తోంది టీటీడీ.. ఒక్కో డైరీకి 133 రూపాయలు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తోంది. అదే బల్క్ లో పది డైరీలు ఒక్కసారి బుక్ చేసుకుంటే 379 రూపాయలు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala news, Tirumala Temple

ఉత్తమ కథలు