Tirumala Tirupati Devasthanam: కలియుగ దైవం.. శ్రీవారి అనుగ్రహంతో.. వివాహం చేసుకోవాలని లక్షలాది మంది ఆశిస్తారు. ఎందుకంటే శ్రీనివాసుడి సన్నిధిలో వివాహం (Marriage) చేసుకోవాలనుకుంటే ఎంతో అదృష్టం ఉండాలని నమ్ముతారు. ఇప్పుడు అలాంటి అదృష్టాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) పేదలకు కలిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని వందల జంటలు కల్యాణ మస్తు కార్యక్రమం ద్వారా ఒక్కటి అవ్వనున్నాయి. కళ్యాణమస్తు (Kalyanamasthu) కార్యక్రమం పునః ప్రారంభానికి టీటీడీ (TTD) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక వివాహాలను జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ. వచ్చేనెల అంటే ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు కార్యక్రమానికి నేటి నుంచి ఈనెల 20 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 7న వీరికి ఉచిత సామూహిక వివాహాలు చేయనున్నారు. కళ్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న నూతన వధూవరులకు ఉచితంగా 2 గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండిమెట్టెలు, పెళ్లి వస్త్రాలు, సామగ్రిని అధికారులు ఇవ్వనున్నారు.
అయితే టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు కార్యక్రమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో శ్రీకారం చుట్టారు. 2006లో ఈ పథకానికి రూపకల్పన చేయగా.. 2007 ఫిబ్రవరి 21వ తేదీ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పట్లో ఒక్కో జంటకు 7 వేల రూపాయల వరకు ఖర్చు చేసేవారు. అప్పట్లో ప్రారంభించిన కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 34,017 జంటలను టీటీడీ ఒక్కటి చేసింది. దీంతో ఖర్చు సుమారు 24 కోట్ల రూపాయలు అయ్యాయని అంచనా. బంగారపు తాళిబొట్టు, వెండి మెట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధు మిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా టీటీడీ కల్పించేది.
ఇదీ చదవండి : మ్యాథ్స్‌లో ఈ టాపిక్స్ కవర్ చేస్తే చాలు.. ఎంసెట్‌లో మీదే మంచి ర్యాంకు..!
ఆయన మరణం తరువాత ఈ కార్యక్రమం అర్థాంతరంగా నిలిపి వేశారని, వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కళ్యాణమస్తు కార్యక్రమంను పునః ప్రారంభించాలని తమ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ సుబ్బారెడ్డి వివరించారు.. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Ttd news