Home /News /andhra-pradesh /

TIRUPATI GOOD NEW TO TIRUMALA DEVOTEES AFTER MAY 1ST SREE VARI STEPS RE OPENING NGS TPT

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మే 1 నుంచి వారికి అవకాశం..

భక్తులకు శుభవార్త

భక్తులకు శుభవార్త

Tirumala Tirupati News: ఇటీవల వరుస వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ముఖ్యంగా భక్తుల సంఖ్య ఊహించిన దారికంటే పెరగడం.. అందుకుతగ్గ ఏర్పాట్లు అక్కడ లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో భక్తులకు ఓ శుభవార్త చెప్పింది టీడీడీ.

ఇంకా చదవండి ...
  Tirumala Tirupati News: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. అక్కడ వెలిసిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు (Ghat road) ద్వారా తిరుమల (Tirumala)కు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి (Alipiri), శ్రీవారి మెట్లు (Sri Vari Metlu) ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అన్నిటికన్నా అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఈ మధ్య కష్టాలు తప్పలేదు. కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో ఏడుకొండలవాడి చెంతకు చేరుకుంటారు. ఎందుకంటే తిరుమల చేరుకోవడానికి ఉన్నవి రెండు నడకమార్గాలే. ఒకటి అలిపిరి మార్గం, మరోకటి శ్రీవారి మెట్ల మార్గం. తిరుపతి నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉండేది ఈ శ్రీవారి మెట్టు నడకమార్గం, పద్మావతి (Padmavati) అమ్మవారిని కళ్యాణం చేసుకున్న తరువాత సాక్షాత్తు ఆ స్వామి అమ్మవార్లు కొండపైకి నడిచివెళ్లిన మార్గం కాబట్టే దానికి శ్రీవారి మెట్టు నడకమార్గంగా ప్రాచుర్యం పొందింది.

  ఇంతటి ప్రాశస్త్యం కలిగిన నడకమార్గం గతేడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దాదాపు 500 పైగా మెట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నాలుగు కల్వర్ట్‌లతో పాటు మెట్లకు ఇరువైపులా ఉండే రిటైనింగ్ వాల్స్ ధ్వంసమైపోయాయి. వరద ప్రభావంతో శ్రీవారి మెట్టు నడకమార్గం గుర్తుపట్టలేనంత.. పెద్దపెద్ద బండరాళ్లు, గుండులు, మట్టిపెళ్లలు, కొండచరియలతో నిండిపోయింది. ఇప్పటి వరకు తిరుమల చరిత్రలోనే మొదటిసారి.. ఇంత భారీ స్థాయిలో మెట్ల మార్గం దెబ్బతినడం.

  ఇదీ చదవండి : ఇంత నిర్లక్ష్యమా? వాటర్ బాటిల్ అడిగితే.. యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి.. ఏం జరిగిందంటే?

  పూర్తిగా రోడ్డు పాడవ్వడంతో గతేడాది.. నవంబర్ 19వ తేదీన శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని టీటీడీ మూసివేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో రోజూ టీటీడీ 6వేల సర్వదర్శనం టోకెన్లు మంజూరు చెసేది. ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసి వేయడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాదయాత్రగా వచ్చే గోవింద మాలధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మెట్ల మార్గం అందుబాటులో లేకపోవడంతో అదనంగా 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.

  ఇదీ చదవండి : మంత్రి-మాజీ మంత్రి మధ్య చిచ్చు.. జిల్లాకు వచ్చినా పలకరింపులు ల్లేవ్

  అలా ఇబ్బంది పడుతున్న భక్తులకు టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్‌ కుమార్ శుభవార్త అందించారు. మే 1వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని నడక భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైంది. దీంతో మెట్లు మరమ్మతులకు గురికావడంతో ఐదు నెలలుగా నడక మార్గం మూతపడింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మరమ్మతుల పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. దీంతో అలిపిరి మార్గంతో పాటు నడక ద్వారా తిరుమలకు చేరుకోవాలనే భక్తులు ఇకపై శ్రీవారి మెట్టు మార్గంలోనూ వెళ్లవచ్చు.

  ఇదీ చదవండి : ఆ ఇద్దరి వైసీపీ నేతలపై అధిష్టానం సీరియస్.. హద్దు దాటొద్దని హెచ్చరిక

  మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల కొండ భక్తులతో పోటెత్తుతోంది. భక్తులకు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని.. కొండపై కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్తున్నారు. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి, పాలు, తాగునీరు అందిస్తున్నామని వారు తెలిపారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు