TIRUPATI GOLD MERCHANT BOOKED FOR TRYING TO ABUSE WORKER WIFE IN TIRUPAIT FULL DETAILS HERE PRN TPT
Tirupati Woman: తండ్రిలాంటివాడని నమ్మితే ఇలా చేస్తాడనుకోలేదు.. ఈ వయసులోనూ కళ్లు మూసుకుపోయాయా..?
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh లోని తిరుపతి జిల్లా(Tirupati District) రేణిగుంటలో నేమ్ చంద్ అనే వ్యక్తి బడా బంగారు వ్యాపారి. వ్యాపారం బాగా చేస్తాడుగానీ బుద్ధి మాత్రం వంకరబుద్ధి. సొసైటీ లో మంచి పేరు ప్రఖ్యాలు ఉన్నప్పటికి తన వద్ద పనిచేసే గుమస్తా భార్యపై కన్నేశాడు.
సమాజంలో ప్రతి చోటా మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇంట్లో, ఉద్యోగం చేసే చోట, పనులు చేసుకునేటప్పుడు వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఓ బంగారు వ్యాపారి తన దగ్గర పనిచేసే గుమస్తా భార్యపై మనస్సు పడ్డాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇల్లు శుభ్రం చేయాలనే సాకుతో గుమస్తా భార్యను ఇంటికి పంపమన్నాడు. అయ్యగారు చెప్పింది విని అలాగే కొన్ని సార్లు పంపాడు ఆ గుమస్తా. ఈ సారి అయ్యగారికి అనసాగలేక గుమస్తా భార్యతో అసభ్యంగా ప్రవర్తించారు. చివరకు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh లోని తిరుపతి జిల్లా(Tirupati District) రేణిగుంటలో నేమ్ చంద్ అనే వ్యక్తి బడా బంగారు వ్యాపారి. వ్యాపారం బాగా చేస్తాడుగానీ బుద్ధి మాత్రం వంకరబుద్ధి. సొసైటీ లో మంచి పేరు ప్రఖ్యాలు ఉన్నప్పటికి తన వద్ద పనిచేసే గుమస్తా భార్యపై కన్నేశాడు.
తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి గుమస్తాకి ఫోన్ చేసి ఇల్లు శుభ్రపరచాలి మీ ఆవిడను ఇంటికి పంపు అని చెప్పాడు. గుమస్తా కూడా అతని మాటలు నమ్మి యజమాని అంటే తండ్రితో సమానం కదా అని నమ్మి తన భార్యను పంపాడు. యజమాని ఇంటికి చేరుకున్న గుమస్తా బార్య తన భర్తకు ఫోన్ చేసి ఇక్కడ యజమాని ఒక్కరే ఉన్నారు నాకు భయంగా ఉంది లోపలికి వెళ్లడానికి అని భర్తతో చెప్పింది. ఐతే ఆయన తండ్రితో సమానమని భయం లేకుండా వెళ్లమని సూచించాడు.
భర్త చెప్పిన మాటలకు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని ఫోన్ కట్ చేయకుండా అలానే పెట్టుకుని లోపలకి వెళ్ళింది గుమస్తా భార్య. అక్కడే ఉన్న చంద్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. గుమస్తా భార్య చేయి పట్టుకుని లాగి పక్కన కూర్చో పెట్టుకున్నాడు. నువ్వు నాతో ఉండు నీకు ఏమి కావాలో నేను చూసుకుంటా నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నీకు ఏది కావాలంటే అది తీసుకో బట్టలు, నగలు ఏవి కావాలన్న తీసుకో అనే మాయమాటలు చెప్పాడు. నీకు సమయం ఉన్నప్పుడు నాతో ఏకాంతంగా గడుపు నిన్ను నేను చూసుకుంటాను అన్నాడు. యజమాని చేసిన పని నచ్చక విదిలించుకుని బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. ఐతే ఇక్కడ జరిగిన ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని.. బంగారం దొంగతనం చేశావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైలులో పెట్టిస్తానని బెదిరించాడు.
ఐతే ఆమె ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతా తానే రేణిగుంట డీఎస్పీ వద్దకు వెళ్లి గుమాస్తా భార్యపై ఫిర్యాదు చేశాడు. ఐతే బాధితురాలు జరిగిన విషయాన్ని స్థానిక మార్వాడీ సంఘం దృష్టి తీసుకెళ్లింది. దీంతో స్పందించిన మార్వాడీ సంఘం నాయకులు బాధితురాలిని తీసుకెళ్లి తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు నేమ్ చంద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.