Tirupati Girls: ప్రస్తుత సమాజంలో విద్యార్థినులు అబ్బాయిలకంటే చాల చురుకుగానూ.., చదువులో ముందుగానూ ఉంటున్నారు. కొన్ని కళాశాలలో అయితే అబ్బాయికన్న మేమేమి తిసిపోమంటూ అల్లరల్లరి చేస్తుంటారు. వారు చేసే ఆగడాలు ఉపాధ్యాయులకు తలనొప్పులు తెచ్చిపెడుతూనే ఉంటాయి.
ప్రస్తుత సమాజంలో విద్యార్థినులు అబ్బాయిలకంటే చాల చురుకుగానూ.., చదువులో ముందుగానూ ఉంటున్నారు. కొన్ని కళాశాలలో అయితే అబ్బాయికన్న మేమేమి తిసిపోమంటూ అల్లరల్లరి చేస్తుంటారు. వారు చేసే ఆగడాలు ఉపాధ్యాయులకు తలనొప్పులు తెచ్చిపెడుతూనే ఉంటాయి. బాగా చదువుకొని సత్ మార్గంలో నడవాలని ఆడపిల్లలను సైతం తల్లితండ్రులు హాస్టల్ లో విడిచిపెట్టి వస్తుంటారు. కొందరు పిల్లలు తమ జీవితాలకు పూలబాట వేసుకుంటుంటే మరి కొందరు మాత్రం టీనేజ్ దశలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పిల్లల్ని హాస్టల్లో ఎందుకు విడిచిపెట్టామంటూ తల్లితండ్రులు కన్నీరు పెట్టుకొనేలా చేస్తున్నారు కొందరు విద్యార్థినులు. తాజగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati)కి సమీపంలోని చంద్రిగిరిలో తొండవాడ గ్రామం ఉన్న సాంప్రదాయ పాఠశాలలో జరిగిన ఘటనలో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.
సాంప్రదాయ పాఠశాలలో దాదాపు 350 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వారి రక్షణ కోసం 150 సీసీ కెమెరాలు, 100మందికి పైగా సిబ్బందితో అత్యంత హైసెక్యూరిటీ నడుమ పాఠశాలను నిర్వహిస్తున్నారు. బాలురకు వేదపీఠం మాదిరిగానే.. బాలికలకు సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పించేందుకు ప్రత్యేకంగా పాఠశాలను నిర్వహిస్తున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ విద్యాసంస్థ నడుస్తోంది.
విద్యార్థినులంతా స్థానిక శ్రీనివాస డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీ సమీపంలోని సంప్రదాయ పాఠశాలలో వసతి పొందుతున్నారు. క్యాంపస్ చుట్టూ ఎనిమిది అడుగుల ఎత్తైన గోడ, దానిపై గాజు ముక్కల, ఎక్కినా గాయాలయ్యేలా ఏర్పాట్లు చేశారు. అంతటి హైసెక్యురిటీ ఉన్న పాఠశాలలో విద్యార్థినులు గోడదూకి పారిపోవడం తీవ్రకలకలం రేపుతోంది.
పరారైన విద్యార్థినులు విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాలకు చెందిన విద్యార్ధినులుగా పోలీసులు గుర్తించారు. పాఠశాల ఇన్ ఛార్జ్ లక్ష్మీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా విద్యార్ధినులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. పారిపోయిన విద్యార్థినుల స్నేహితులను కూడా విచారించారు.
పాఠశాల నుండి పరారైన నలుగురు విద్యార్ధినిల్లో ఇద్దరు మైనర్లు. వారి తల్లితండ్రులు సమాచారం అందించిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.ఇప్పటికే విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని విచారిస్తున్నారు. నాలుగు జిల్లాల్లో నాలుగు ప్రత్యేక బృందాలు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మరో ప్రత్యేక బృందం విద్యార్ధినుల కోసం గాలిస్తున్నాట్లు తిరుపతి వెస్టు డిఎస్పీ నరసప్ప వెల్లడించారు. విద్యార్థినులు ఎక్కడికెళ్లారు..? ఏమయ్యారు..? సెక్యూరిటీ కళ్లుగప్పి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఉపాధ్యాయులు మందలించడంతోనా లేక ఇంటిపై బెంగతో వెళ్లిపోయారా..? లేక కిడ్నాప్ కు గురయ్యారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.