Home /News /andhra-pradesh /

TIRUPATI GAY MARRIAGE ISSUE CREATES TURNED INTO CONTROVERSY AS YOUNG MAN ATTEMPTED TO COMMIT SUICIDE IN KADAPA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Gay Marriage in AP: ప్రియుడి కోసం యువకుడి ఆందోళన... దుబాయ్ లో తెలుగు యువకుల పెళ్లి... ఏపీలో రచ్చ రచ్చ...!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

తెలంగాణ (Telangana) నిజామాబాద్ జిల్లాకు చెందిన కంది సాయి కుమార్ ఉపాధి రీత్యా దుబాయి (Dubai)కి వెళ్ళాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్ లో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కడప జిల్లా (Kadapa District) మైదుకూరుకు చెందిన యువకునితో పరిచయం ఏర్పడింది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18

    ఈ సృష్టిలో కొన్ని సంబంధాలను అందరూ అంగీకరిస్తారు. కొన్ని మాత్రం ఆమోదయోగ్యం కాదు. నేటి సమాజంలో సృష్టికి విరుద్ధమైన అలవాట్లు, సంస్కృతికి కొందరు భారతీయులు అలవాటు పడుతున్నారు. సాధారణంగా వెస్ట్రన్ కల్చర్ కు నార్త్ ఇండియన్స్ అలవాటు పడుతుంటారు. సౌత్ ఇండియాకు చెందిన వారికి ఇలాంటి అలవాట్లు తక్కువ. కానీ ఆంధ్రా, తెలంగాణకు చెందిన ఇద్దరు అబ్బాయిలు అసహజ బంధానికి అలవాటు పడ్డారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న అంశం గే వివాహం (Gay Marriage). ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవడం... కలసి సంసారం చేయడమే. ఇలాంటి తంతు చూసి నోరెళ్లబెట్టక తప్పదు. తెలంగాణకు చెందిన ఓ యువకుడు కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ రచ్చ చేశాడు.

    వివరాల్లోకి వెళ్తే..., తెలంగాణ (Telangana) నిజామాబాద్ జిల్లాకు చెందిన కంది సాయి కుమార్ ఉపాధి రీత్యా దుబాయి (Dubai)కి వెళ్ళాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్ లో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కడప జిల్లా (Kadapa District) మైదుకూరుకు చెందిన యువకునితో పరిచయం ఏర్పడింది. తరచు వీరిద్దరూ టిక్ టాక్ (TikTok) చేసుకుంటూ మాట్లాడుకునేవారు. వీరి మధ్య మాటలు శ్రుతిమించాయి. ఒకరిపై మరొకరికి సృష్టి విరుద్ధమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ క్రమంలో సాయిని దుబాయ్ నుంచి మస్కట్ రప్పించాడు మైదుకూరు యువకుడు. ఆలా వచ్చిన సాయిని వివాహం చేసుకున్నాడు.

    ఇది చదవండి: పెళ్లై 16 రోజులైనా కాలేదు... ఆమె ఊహించింది ఒకటి.. జరిగింది మరొకటి...


    ఇద్దరు కలసి కాపురం కూడా మొదలెట్టారు. అంతవరకు అంతా బాగానే ఉన్నా విదేశాల నుంచి ఇద్దరు స్వదేశానికి వచ్చారు. అనంతరం సాయికి మైదుకూరుకి చెందిన యువకుని వద్ద నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. అసలు ఓ చిన్న మెసేజ్ కూడా పెట్టిన సందర్భం లేదు. దీంతో అనుమానం వచ్చిన సాయి మైదుకూరుకు చేరుకున్నాడు. తన ప్రియుని కోసం ఊరంతా హల్చల్ చేసాడు. యువకుని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోనూ లేదంటూ కుటుంబ సభ్యులు చెప్పారు.

    ఇది చదవండి: ఒకేసారి ఇద్దరు యువతులతో సహజీవనం.. వీడు మామూలోడు కాదు..



    దీంతో చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసును లైట్ తీసుకున్నారు. ఇలాంటి కేసులు నిలబడవని హితవు పలికారు. పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసాడు. మోసం చేసిన యువకుని బంధువులే ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించారు. అయితే ఆ యువకుడు తన వద్ద ఓ రకంగా తల్లితండ్రులతో మరో రకంగా మాట్లాడుతున్నాడని బంధువులతో ఆవేదన వ్యక్తం చేశాడు. తామిద్దరినీ ఒకటి చేయాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని సాయి చెబుతున్నాడు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kadapa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు