హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

SV University: యూనివర్సీటిలో మత్తు దందా.. అమ్మాయిలు కూడానా..! మరీ అంత దారణమా..?

SV University: యూనివర్సీటిలో మత్తు దందా.. అమ్మాయిలు కూడానా..! మరీ అంత దారణమా..?

ఎస్వీ యూనివర్సిటీలో గంజాయి కలకలం

ఎస్వీ యూనివర్సిటీలో గంజాయి కలకలం

Ganja Gang: యూనివర్సిటీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ కనిపించారు. వారిలో ఓ యువతి కూడా ఉండటంతో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది. అదే ప్రాంతంలో కండోమ్ లు కూడా కనిపించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

GT Hemanth Kumar, Tirupathi, News18

భవితకు బాటలు దిద్దుకోవాల్సిన వయస్సు వారిది. నిత్యం విద్యను అభ్యసించేందుకు తల్లితండ్రులు తమ పిల్లలను యూనివర్సిటీ లోని హాస్టల్ లో చేరుస్తుంటారు. ఇంటి వద్దకన్నా కాలేజీ హాస్టల్ లో ఉంటె పిల్లల భవిషత్ ప్రకాశవంతంగా ఉంటుందని భావిస్తారు. అయితే అదే పిల్లలు తప్పటడుగులు వేస్తే.. వారి జీవితాన్ని నాశనం అవుతాయి. ఆధ్యాత్మిక నగరి తిరుపతి (Tirupathi)లోని ప్రతిష్టాత్మకమైన ఎస్వీ యూనివర్సిటీ (Sri Venkateswara University) గంజాయికి నిలయంగా మారి.... మత్తుకు యువత బానిస అవుతున్నారు. విద్యార్థులు నిత్యం గంజాయి మత్తులో తూలుతూ ఉన్నారు. ధమ్మారో.. ధమ్... అంటూ మత్తులో ఊగుతూ గంజాయిని గుప్పుమంటూ గాల్లో వదిలేస్తున్నారు. వ్యసనాలకు నిలయంగా, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఎస్వీయూ మారింది. ఉత్తమ విశ్వవిద్యాలయం గా పేరొందిన ఎస్వీయూ నేడు గంజాయి, వంటి మత్తు పదార్థాలకు నిలయంగా మారింది.

ఎస్వీ యూనివర్సిటీకి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉన్న అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకున్నారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన యూనివర్సిటీ ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థుల రీసర్చ్ కు నిలయమైన యూనివర్సిటీని గంజాయి వాడుక కేంద్రంగా మార్చేస్తున్నారు. నిత్యం మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నిఘాలో మాత్రం తిరుపతి భద్రత వ్యవస్థ చర్యలు శూన్యంగా కనిపిస్తోంది.

ఇది చదవండి: వామ్మో ఆ ఘరానా కపుల్ మామూలోళ్లు కాదు... పేరు మార్చి రూ.32లక్షలు దోచేశారు...



ఆదివారం యూనివర్సిటీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ కనిపించారు. వారిలో ఓ యువతి కూడా ఉండటంతో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది. అదే ప్రాంతంలో కండోమ్ లు కూడా కనిపించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఐతే విద్యార్థులకు గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతోంది. ఎవరు ఇక్కడి వరకు తీసుకొస్తున్నారనేది అనుమానంగా మారింది. సాధారణంగా గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏయే మార్గాల ద్వారా గంజాయి రవాణా అవుతోందనే కోణంలో పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది.

ఇది చదవండి: కాసేపట్లో పెళ్లి.. వధువు జంప్.. పోలీస్ స్టేషన్ కు మారిన సీన్.. అసలేం జరిగిందంటే..!



ఎస్వీ యూనివర్సిటీ లోని ఆడిటోరియం వెనుక భాగంలో అసంపూర్ణంగా నిర్మించిన ఉన్న ఓ బ్లాక్ నిరుపయోగంగా ఉంది. ఇప్పటికే చాల మంది విద్యార్థులు ఇక్కడ కాలక్షేపం కోసం అక్కడకు వెళ్తుంటారు. ఈ భవనాన్ని కొందరు గంజాయి, మద్యం సేవించేందుకు అడ్డగా మార్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక్కడే విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు మత్తుకు బానిసై నిత్యం ఇక్కడే గంజాయి ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే గడిపేస్తున్నారు.


ఇది చదవండి: ఈసీజీ కోసం వెళ్తే దుస్తులు విప్పమన్నాడు.. గుంటూరు జీజీహెచ్ లో దారుణం...



శని, ఆదివారాల్లో ఇలాంటి వారంతా ఇక్కడే తిష్టవేస్తుంటారు. గోడల చాటున, పిల్లర్ల మాటున కూర్చొని గంజాయిని గుప్పు మంటూ లాగేస్తున్నారు. మైకంలో ఎం చేస్తున్నామో తెలియని యువత అదే ప్రాంతంలోనే ఎదేచ్చగా లైంగిక అవసరాలు తీర్చుకుంటున్నారు. యూనివర్సిటీ పరిపాలన భవనానికి రెండు వందల అడుగుల దూరంలో ఇంత జరుగుతున్న యాజమాన్యం అంటీఅంటనట్లు వ్యవహరిస్తోంది. మీడియాలో వచ్చిన కథనాల మేరకు అప్పుడప్పుడు బ్లూకోట్ పోలీసులను పంపి చేతులు దులుపుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Ganja case, Tirupati

ఉత్తమ కథలు