Home /News /andhra-pradesh /

TIRUPATI GANJA SMUGGLING IN CHITTOOR DISTRICT AS POLICE NEGLECTING THIS SERIOUS ISSUE FULL DETAILS HERE PRN TPT

Ganja Smuggling: ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో గంజాయి గ్యాంగ్ హల్ చల్.. ఇంత జరుగుతున్నా పోలీసులకు పట్టదా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గంజాయి అక్రమం రవాణా జోరుగా సాగుతోంది. ఎప్పటిమాదిరిగానే విశాఖపట్నం మన్యం (Visakhapatnam) , గోదావరి జిల్లాల్లో కాకుండా.. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి (Minister Narayana Swamy) సొంత జిల్లాలో గంజాయి మత్తుకు యువత చిత్తవుతున్నారు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గంజాయి అక్రమం రవాణా జోరుగా సాగుతోంది. ఎప్పటిమాదిరిగానే విశాఖపట్నం మన్యం (Visakhapatnam) , గోదావరి జిల్లాల్లో కాకుండా.. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి (Minister Narayana Swamy) సొంత జిల్లాలో గంజాయి మత్తుకు యువత చిత్తవుతున్నారు. ఎస్.ఆర్.పపురం మండలం, పాలసముద్రం మండలం, గుడిపాల మండలంలో గంజాయి అక్రమ రవాణ జోరుగా సాగుతోంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంమైన తొట్టికండ్రిక గ్రామానికి చేందిన కొందరు యువకులు యథేచ్ఛగా గంజాయి సేవిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా అంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. నిత్యం వేలాది మంది వ్యాపార నిమిత్తం రాకపోకలు రాగిస్తుంటారు..‌ అయితే ప్రస్తుతం చిత్తూరు జిల్లా గంజాయి అక్రమ రవాణాకు నిలయంగా మారుతుంది.

    ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన పాలసముద్రం మండలం మొదలుకొని గుడిపాల, ఎస్.ఆర్.పురం మండలం, గంగాధరనెల్లూరు మండలం, పుంగనూరు మండలం, పలమనేరు, కుప్పం, పుత్తూరు, ‌నగిరి ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండడంతో కొందరు రహస్య మార్గాల ద్వారా గంజాయిని జిల్లాకు తరలిస్తున్నారు. కొందరు స్మగ్లర్లను డీలర్లను ఏర్పాటు చేసుకొని మరీ గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు విక్రయిస్తున్నారు.

    ఇది చదవండి: కొడుకు చనిపోయిన రెండు రోజుల తర్వాత మొబైల్ కు షాకింగ్ మెసేజ్..


    దీంతో కొందరు విద్యార్ధులు గంజాయి మత్తులో పడుతుంటే మరికొందరు గంజాయిని ఫ్యాషన్ గా మార్చుకొని వీడియోలు తీసి సోషల్ మీడయాలో పోస్ట్ చేస్తున్నారు. గంజాయి సేవించిన కొందరు యువకులు విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారం వారం తమిళనాడు నుంచి వస్తున్న స్మగర్లను యువతకు గంజాయి విక్రయించి వెళ్తున్నారు. కొందరు బహిరంగంగా గంజాయి సేవిస్తూ వీడియోలను వైరల్ చేస్తున్నా పోలీసులు మాత్రం అటువైప చూడటంలేదు. దీంతో కొందరు అక్రమార్కులు పది గ్రామలు, యాభై గ్రాములు, వంద గ్రాముల ఫ్యాకెట్లను విక్రయిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.

    ఇది చదవండి: పిన్నిస్ ఉంటే చాలు..? ఎలాంటి బైక్ తాళమైన తుస్సే..? వీళ్లది మాములు టాలెంట్ కాదు..!


    గంజాయి అక్రమ రవాణాపై క్షేత్ర స్ధాయిలో నిఘా ఉంచాల్సిన పోలీసులు అధికారులే నిమ్మకు నీరెత్తునట్లు వ్యవహరిస్తూ ఉండడంతో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గంజాయి నిషేధం అనే మాట కేవలం పేపర్లకే పరిమితమవుతుంది తప్ప పోలీసులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.



    పదోవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్ధులు, ఉద్యోగులు వరకూ గంజాయి మత్తుకు బానిస మారుతున్నారు. ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణ స్వామి సొంత జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా ఏమాత్రం చర్యలు తీసుకోక పోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికార పార్టికి చేందిన కొందరు నాయకుల అండదండలతోనే గంజాయి అక్రమ రవాణా సాగుతుందనేది బహిరంగ రహస్యం. దీంతో అక్రమార్కులు గంజాయి అక్రమ రవాణా సాగిస్తుంటే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుని స్ధానికుల ఆరోపణ.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Ganja smuggling

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు