హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganesh Chaturthi 2022: ఏపీలో ఆకట్టుకుంటున్న వెరైటీ గణపయ్యలు.. ప్రత్యేక ఆకర్షణగా పైనాపిల్ వినాయకుడు

Ganesh Chaturthi 2022: ఏపీలో ఆకట్టుకుంటున్న వెరైటీ గణపయ్యలు.. ప్రత్యేక ఆకర్షణగా పైనాపిల్ వినాయకుడు

ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకులు

ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకులు

Ganesh Chaturthi 2022: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వీధి వీధినా వెలసిన గణపతి మండపాల దగ్గర సందడి కనిపిస్తోంది. ఈ సారి ఏర్పాటు చేసిన వెరైటీ గణపతి లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

GT Hemanth Kumar, Tirupathi, News18.Ganesh Chaturthi 2022:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వినాయక చవితి వేడుకలు (Vinayaka Chavathi Celebrations) రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండున్నరేళ్లు కరోనా వైరస్ (Corona Virus) కారణంగా ఈ వేడులను ఏకాంతంగా చేసుకున్న.. హిందువులు.. ఈ సారి తగ్గేదే లే అని ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.  దీంతో వీధి వీధికి వినాయక మండపాలు వెలిసాయి. చాలా చోట్ల వెరైటీ వినాయాకులను ఏర్పాటు చేశారు నిర్వాహకులు..  చిత్తూరు జిల్లా (Chittoor District) ల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Baskar Reddy)  సహకారంతో తుమ్మలగుంటలో రాయలసీమలోనే అతిపెద్ద వినాయకుణ్ణి ప్రతిష్టించారు. సుమారు 7 వేల పైనాపిల్స్ తో ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడ్ని తీర్చిదిద్దారు.
వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటలకు పైనాపిల్స్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.  ఏటా పర్యావరణ పరిరక్షణకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.  అలాగే గతేడాది  గాజులతో, అంతకుముందు ముత్యాలతో, ఆ ముందు ఏడాది కొబ్బరికాయలతో వినాయకుని ప్రతిరూపాన్ని అందంగా తీర్చిదిద్దారని వెల్లడించారు. 


ఈ ఏడాది కూడా ప్రజల్లో.. భక్తుల్లో పర్యావరణ పరిరక్షణ బాధ్యతను మరింత పెంపొందించేలా పైనపిల్స్ తో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  ఐదు రోజుల పాటు వినాయక ఉత్సవాలు వేడుకగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గత ఏడాది లా ఈ ఏడాది కూడా 516 కిలోల లడ్డూ ప్రసాదం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.  


నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో బాపూజీ వీధిలో వినాయక చవితి సందర్భంగా దాత పాదర్తి అమర్నాథ్ అనే భక్తుడు.. 62,000 వేలు గాజులతో విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజలు చేశారు. మరో విగ్రహ దాత మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, చిన్ని శ్రీనివాసులు చేతుల మీదుగా పూజలు చేసి గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వినాయకుని ఐదు రోజులు పాటు ఉంచి పూజలు చేసి ఆదివారం నిమజ్జనం చేయనున్నారు.
ఇదీ చదవండి : సొంత జిల్లాకు సీఎం జగన్ .. రేపటి నుంచి మూడు రోజుల పర్యటన.. పూర్తి వివారలు ఇవే
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో బాపూజీ వీధిలో వినాయక చవితి సందర్భంగా దాత పాదర్తి అమర్నాథ్ అనే భక్తుడు.. 62,000 వేలు గాజులతో విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజలు చేశారు. మరో విగ్రహ దాత మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, చిన్ని శ్రీనివాసులు చేతుల మీదుగా పూజలు చేసి గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వినాయకుని ఐదు రోజులు పాటు ఉంచి పూజలు చేసి ఆదివారం నిమజ్జనం చేయనున్నారు. 
శ్రీకాళహస్తి పట్టణంలోని రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ దగ్గర నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జ్ఞానబోధ గణపతి ప్రత్యేకంగా నిలుస్తోంది. ఓటర్ కాలువ దగ్గర కృష్ణ తత్వాన్ని చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేసిన కృష్ణగణపతి సెట్టింగ్ ప్రజల్ని ఆకట్టుకుంటుంది. పలువురు భక్తులు ఈ ప్రత్యేక గణపతుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఇదీ చదవండి : మెగా వినాయక సంబరాలు.. చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి..
తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ద‌గ్గ‌ర‌లో ఉన్న పిఠాపురంలో భ‌క్తుల ప్ర‌తీయేటా ప్ర‌త్యేకత చాటుతుంటారు. ఈ ఏడాది ఏకంగా 50 వేల యాపిల్ పండ్ల‌తో వినాయ‌క ఆల‌యాన్ని సిద్ధం చేశారు. పిఠాపురంలోని ప్ర‌ధాన కూడ‌లిగా చెప్పుకునే కోట గుమ్మం వ‌ద్ద ఉన్న జైగ‌ణేష్ ఆల‌యంలో విఘ్నేశ్వ‌రుడ్ని 50 వేల యాపిల్ పండ్ల‌తో అలంక‌రించారు. మొత్తం ఆల‌యాన్ని యాపిల్ పండ్ల‌తో ముంచెత్తారు.
ఇదీ చదవండి : మందులను దేవుడి ప్రసాదంలా సేవిస్తున్న బాలయ్య.. టీవీపై జోక్ వింటే పడి పడి నవ్వాల్సిందే
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభంగా సాగుతున్నాయి. చాలామందికి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో చాలామంది మట్టి వినాయకులను ప్రతిష్టించగా.. మరికొందరు వింత వింత ఆకారాలతో సహజ సిద్ధంగా ఉండే వినాయకుడ్ని విగ్రహాలను రూపొందించారు..

First published:

Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​, Ganesh Chaturthi​ 2022, Vinayaka Chavithi 2022

ఉత్తమ కథలు