• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TIRUPATI FROM PHYSIOTHERAPIST TO MEMBER OF PARLIAMENT HERE IS THE PROFILE OF TIRUPATI BY POLL WINNER MADDILA GURUMOORTHY PRN

Tirupati Winner Gurumurthy: ఫిజియోథెరపిస్ట్ నుంచి ఎంపీగా... గురుమూర్తి ప్రస్థానం ఇదే..

Tirupati Winner Gurumurthy: ఫిజియోథెరపిస్ట్ నుంచి ఎంపీగా... గురుమూర్తి ప్రస్థానం ఇదే..

తిరుపతి ఎంపీ గురుమూర్తి (ఫైల్)

సాధారణ ఫిజియోథెరపిస్టుగా ఉన్న గురుమూర్తి.. పాదయాత్రలో వైఎస్ జగన్ వెంటే నడిచారు.

  • Share this:
    తిరుపతి ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైస్ఆర్సీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. గురుమూర్తిని అభర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఎన్నికల్లో విజయం సాధించేవరకు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గెలుపే విజయం సాధించేలా ప్రోత్సహించారు. గురుమూర్తి బయోడేటాను పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా శ్రీకాహళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడు మండలం మున్నసముద్రం గ్రామానికి చెందిన మద్దిల మునికృష్ణయ్య కుమారుడు గురుమూర్తి. 1985 జూలై 22న జన్మించారు. వ్యవసాయకుటుంబానికి చెందిన ఆయన.. స్విమ్స్ లో ఫిజియోథెరపీని అభ్యసించారు. ఆయనకు భార్య నవ్య కిరణ్, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాధారణ ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి సీఎం జగన్ వెంట సామాన్య కార్యకర్తగా పని చేస్తూ వస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ కెరీర్‌నే వదులుకుని వైఎస్ ఫ్యామిలీ వెంటనిలిచారు. ఆ విధేయతే ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చేలా చేసింది.

    సౌమ్యుడిగా పేరుపొందిన గురుమార్తి... పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. ఈ క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆ సమయంలో ఆమె వెంటే నిలిచారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టగా, వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా గురుమూర్తి ఆయన వెంటే రాష్ట్రమంతా తిరిగారు. అలాగే 2017 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా ఆయన వెంటే నడిచారు. పాదయాత్ర ఆసాంతం జగన్ వెంటే ఉన్న గురుమూర్తి.. ఫిజియోథెరపీ చేశారు.

    ఇది చదవండి: తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ గెలుపు.. 2019 రికార్డ్ బ్రేక్


    అప్పటినుంచి సీఎం జగన్ కు విధేయుడిగా ఉన్న గురుమూర్తికి.. తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారం ముగిసేవరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్యనేతలు తిరుపతిలోనే మకాం వేసి గురుమూర్తికి మద్దతుగా ప్రచారం చేశారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న గురుమూర్తి.. కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్లు అయిన పనబాక లక్ష్మి, చింతామోహన్ వంటి సీనియర్లతో పాటు రత్నప్రభ లాంటి మాజీ ఐఏఎస్ ను ఓడించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు