హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dollar Seshadri: శ్రీవారికి అత్యంత ప్రియమైన భక్తుడు.. తుదిశ్వాస వరకు స్వామి సన్నిధిలోనే..! డాలర్ శేషాద్రి ప్రస్థానం ఇదే..!

Dollar Seshadri: శ్రీవారికి అత్యంత ప్రియమైన భక్తుడు.. తుదిశ్వాస వరకు స్వామి సన్నిధిలోనే..! డాలర్ శేషాద్రి ప్రస్థానం ఇదే..!

డాలర్ శేషాద్రి (ఫైల్)

డాలర్ శేషాద్రి (ఫైల్)

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుని (Sri Venkateswara Swamy) సన్నిధానం అయిన తిరుమల శ్రీవారి ఆలయంలో (Tiruamala Temple) ఆయనంటే తెలియనివారుఉండరు. సామాన్యుల నుంచి విఐపిలు, వివిఐపిల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సన్నిహితులు ముద్దుగా పిలుచుకునే డాలర్ మామ. ఆయనే డాలర్ శేషాద్రి (Doller Seshadri).

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, Tirupathi, News18

  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుని (Sri Venkateswara Swamy) సన్నిధానం అయిన తిరుమల శ్రీవారి ఆలయంలో (Tiruamala Temple) ఆయనంటే తెలియనివారుఉండరు. సామాన్యుల నుంచి విఐపిలు, వివిఐపిల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సన్నిహితులు ముద్దుగా పిలుచుకునే డాలర్ మామ. ఆయనే డాలర్ శేషాద్రి (Dollar Seshadri). కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడైన శ్రీనివాసుడి సన్నిధిలో 1978లో గుమస్తాగా బాధ్యతలు స్వీకరించిన డాలర్ శేషాద్రి. 1979లో ఉత్తర పారపత్తేధార్ గా టీటీడీ (TTD) లో రెగ్యులర్ ఉద్యోగి అయ్యారు. ఆ తరువాత జూనియర్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది. 2006 జూలై లో పార్ పత్తేదార్ గా రిటైర్డ్ అయ్యారు. డాలర్ శేషాద్రి హఠాన్మరణం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

  శ్రీవారి పాదాలచెంత జననం

  1948 జులై 15న జన్మించిన డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. మెడలో పొడవైన డాల్లర్ ధరించి వుండడంతో.. ఆ పేరుతో డాలర్ శేషాద్రిగా ప్రసిద్దిగాంచారు. శేషాద్రి పూర్వీకులది తమిళనాడు రాష్ర్టంలోని కంచి...శేషాద్రి స్వామి తండ్రి గోవిందరాజ స్వామి ఆలయంలోని తిరుమల నంబి ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించే వారు.., తిరుపతిలోనే జన్మించిన శేషాద్రి... విద్యాభ్యాసాన్ని తిరుపతిలోనే పూర్తిచేశారు. అప్పట్లోనే పీజీ చేసిన ఆయన.., ఆ తరువాత చంద్రను వివాహామాడారు. ఐతే వీరు ఇరువురికి పిల్లలు లేరు. శేషాద్రికి ఇద్దరు అన్నలు,ఇద్దరు చెల్లెళ్లు వున్నారు.

  ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


  ఇదీ ప్రస్థానం..

  1978లో టీటీడీలో చేరిన శేషాద్రి.., 2006 జులై లో రిటైర్మెంటయ్యారు. పదవి విరమణ పొందినప్పటికీ శ్రీవారి ఆలయంలో ఆయనకున్న ఆపార అనుభవం దృష్ట్యా అప్పటి ధర్మకర్తల మండలి రెండేళ్ళ పాటు డాలర్ పదవి కాలాన్ని పొడిగించింది. ఈయనకు రాష్ట్ర స్ధాయిలోనే కాక దేశ వ్యాప్తంగా వున్న రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు, జడ్జిలు, ప్రముఖలందరితోనూ విసృత్త పరిచయాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో డాలర్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పటికీ కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి 2007లో డాలర్ శేశాద్రిని ఆలయ ఓ.యస్.డిగా నియమిస్తూ ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. ఆ తరువాత ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా పనిచేసిన ఆదికేశవులనాయుడు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి కూడా డాలర్ పదవి కాలాన్ని రెండేళ్ళ పాటు పొడిగించింది.

  ఇది చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎందుకంత ప్రాముఖ్యత... వందల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోదంటే..!


  15నెలలు స్వామి సేవకు దూరం

  2009లో డాలర్ కు ఊహించని దెబ్బ తగిలింది. తిరుపతికి చెందిన రైతు నాయకుడు టీటీడీలో 60ఏళ్ళకు పైబడిన వారిని కొనసాగించకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీని పై స్పందించిన హైకోర్టు టీటీడిలో 60ఏళ్ళకు పైబడి పనిచేస్తున్నవారందరిని ఇంటికి పంపించాలని టీటీడిని ఆదేశించింది. దీంతో శేషాద్రితో పాటు సుమారు 58మందిని టీటీడి విధుల నుంచి తప్పించింది. అయితే శేషాద్రి మాత్రం పట్టువిడవని విక్రమార్కుడిలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఈ కేసును హైకోర్టు పరధిలోని ఆంశం కాబట్టి అక్కడే పరిష్కరించుకోవాలని సూచించింది. హైకోర్టును ఆశ్రయించిన డాలర్ కు రాష్ట్ర హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో 2010 అక్టోబర్ 1న రాష్ట్ర హైకోర్టు శేషాద్రిని విధుల్లోకి తీసుకోవాలంటూ టీటీడిని ఆదేశించింది. కోర్టులో కేసు నడుస్తున సమయంలో ఆయన కోల్పోయిన పదవికాలాని తిరిగి ఇవ్వాలంటూ హైకోర్టు టీటీడిని ఆదేశించింది. ఇలా దాదాపు 10నెలల కాలం డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలకు దూరమయ్యారు. ఆ తరువాత వచ్చిన బాపిరాజు నేతృత్వంలోని పాలకమండలి కూడా రెండుసార్లు డాలర్ పదవికాలాన్ని పొడిగించగా ఆ తరువాత స్పెసిఫైడ్ ఆధారిటీ వున్న సమయంలో అప్పుడు ఈవోగా పని చేసిన ఎంజీ గోపాల్ తదుపరి ఉత్తర్వులు వెల్లువడే వరకు ఆయనకు పొడిగింపును ఇవ్వడంతో నేటికి కూడా డాలర్ శ్రీవారి ఆలయ ఓయస్డిగా విధుల్లో కొనసాగారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు ఎందుకంతటి ప్రాముఖ్యత..? ఈ పూజలో ఎన్ని ఘట్టాలుంటాయో తెలుసా..?


  శ్రీవారి అలంకరణలపై పూర్తి అవగాహన...

  1987లో శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్ధ రద్దయిన సమయంలో ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహాణలో టీటీడీకి ఎంతో సహాయం అందించిన వ్యక్తి డాలర్ శేషాద్రి. శ్రీవారి వాహనసేవలప్పుడు స్వామి వారిని ఏవిధంగా అలంకరించాలో కూడా అర్చకులకు చెప్పి స్వామి వారి వాహనాల అలంకరణకు పూర్తి స్ధాయిలో సహకరించేవారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పూజలకు సంభందించి చేస్తున్న మార్పులలో కూడా శేషాద్రి తన సహాయాని టీటీడికి అందిస్తున్నారు. ఇక ఆలయం లోపల.., ఆలయం వెలుపల స్వామి వారికి ఏ సేవ జరిగినా.., టీటీడీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అన్నింటిలో ముందు వుండి అన్ని తానై జరిపించే వారు. ఇలా శ్రీవారి ఆలయంలో డాలర్ శేషాద్రి తనకంటూ ఒక్క ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

  ఇది చదవండి: శ్రీవారిని మలయప్ప అని ఎందుకు పిలుస్తారు... పంచబేర ఆరాధన అంటే ఏంటి..?


  డాలర్ల వివాదం

  2006లో డాల్లర్ శేషాద్రిపై శ్రీవారి ఆలయంలో 300 బంగారు డాల్లర్లు మిస్సింగ్ అభియోగం మూపబడినప్పటికి విచారణలో శేషాద్రి సచ్చిలుడుగా బయటపడ్డారు. సామాన్యులు నుంచి వివిఐపిల వరకు సుపరిచితుడు శేషాద్రి.., సుప్రీంకోర్టు సిజే ఎన్వీ రమణతో శేషాద్రికి సన్నిహిత సంబంధాలున్నాయి. శ్రీవారి దర్శనార్ధం ఎన్వీ రమణ తిరుమలకు వచ్చిన ప్రతి సారి స్వయంగా శేషాద్రి ఇంటికి వెళ్ళి ఆయన యోగక్షేమాలను తెలుసుకునేవారు. ఇలా ఒక్క ఎన్వీ రమణతోనే కాక దేశంలోని పలువురితో శేషాద్రికి చాలా సన్నిహితులున్నారు.

  అనారోగ్యానికి గురైనా స్వామి సేవకే అంకితం

  స్వామి వారి సేవలో తరిస్తున్న శేషాద్రి... స్వామిసేవలో వున్నప్పుడే పలుసార్లు అనారోగ్యానికి గురయ్యారు. 2013లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్న శేషాద్రి.., 2016లో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ రెండు సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలోనే శేషాద్రి ఆస్వస్ధతకు గురైయ్యారు. ఇలా తన 42ఏళ్ళ సర్వీస్ లో దాదాపు 15నెలలు కాలం మినహా మిగతా సమయం అంతా శేషాద్రి స్వామి సేవలోనే తరించారు. చివరకి తన తుడి శ్వాస విడిచే సమయంలో కూడా శేషాద్రి స్వామి సేవలోనే వున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు