Home /News /andhra-pradesh /

TIRUPATI FREEDOM FIGHTER AND EX MLA TC RAJAN CELEBRATING AZADI KA AMRITH MAHOTSAV AT THE AGE OF 105 IN CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Freedom fighter: ఈ దేశమే ఆయన ఇల్లు.. 105 ఏళ్ల వయసులోనూ దేశ సేవే.. స్ఫూర్తినిస్తున్న టీసీ రాజన్ జీవితం..

టీసీ రాజన్

టీసీ రాజన్

Tirupati: ఎందరో మహాను బావులలో తాను ఒక్కరు టిజి రాజన్. గాంధీ వేసిన బాటలోనూ... నేతాజీ నడిచిన అడుగు జాడల్లోనూ ఆయన ఉద్యమాన్ని చిత్తూరు జిల్లాలో ముఖ్య పాత్ర పోషించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Chittoor, India
  GT Hemanth Kumar, News18, Tirupati

  మనం నేడు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఎందరో మహానుభావుల రక్తపు దారాలతో తెచ్చిన స్వాతంత్రమే కారణం. నేతాజీ సుబాష్ చంద్రబోస్.. యుద్ధ మార్గం ద్వారా స్వాతంత్ర్యానికి కృషి చేస్తే.. అహింస మార్గం ద్వారా మహాత్మా గాంధీ.. ఉద్యమ కారులకు మార్గదర్శిగా నిలిచి స్వాతంత్ర్యాన్ని మనకు అందించారు. అలా మన దేశాన్నీ బ్రిటిష్ వారి పరిపాలన నుంచి.. తెల్లదొరల పీఠాన్ని కదిలించి 1947 ఆగష్టు 15వ తేదీ స్వతంత్ర భారత్ గా నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఇలా వచ్చిన స్వాతంత్య్రంలో చాలామంది యోధులు అమరులు అయ్యారు. మరి కొందరు ప్రజాసేవలో నిమగ్నమై చివరి దశలో తినేందుకు తిండి కూడా దొరకని దయనీయ స్థితిలో తనువు చాలించారు. బ్రిటిష్ వారి తూటాలా చెప్పుకు భయపడలేదు. ఊరూరా జండా ఎగురవేసి దేశ భక్తి చాటిన మహనీయుడు. ప్రజలు బాగుంటే చాలు.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆస్తులు నాకెందుకు అనుకున్న మహోన్నతమైన వ్యక్తి. స్వాతంత్ర సమరంలో పాల్గొని.. ఎమ్మెల్యేగా ప్రజల కష్టాలు తీర్చి.. స్వంత ఇల్లు లేకుండా.. కట్టుకోడానికి నాలుగు జతల బట్టలు కలిగిన వీరుడు చిత్తూరు జిల్లాలో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కాద. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటికీ మనమధ్యనే ఉన్న వీరుడు ఠానేదార్ చిన్న రాజన్ అలియాస్ టిజి రాజన్ పై న్యూస్18 స్పెషల్ స్టోరీ..

  ఎందరో మహాను బావులలో తాను ఒక్కరు టిజి రాజన్. గాంధీ వేసిన బాటలోనూ.. నేతాజీ నడిచిన అడుగు జాడల్లోనూ ఆయన ఉద్యమాన్ని చిత్తూరు జిల్లాలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రభుత్వ ఆస్తుల ద్వంసం కేసులో పలుమార్లు అభియోగాలు రావడంతో మూడునెలల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. అప్పటి ఎస్పీ సుబ్బరామన్ ఆయనను అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. అదే జైలులో ఉన్న మరికొందరు స్వతంత్ర సమరయోధులైన టికే నారాయణ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, రాచకొండ నరసింహులు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిలతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయంతో మరింత ఉత్సాహంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు టీసీ రాజన్. అప్పట్లో నరసింహారెడ్డి, సీతారామయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి వద్దనుకున్నారు. అంతేకాదు సర్కార్ ఇచ్చే తామ్రపత్రాన్ని కూడా తిరస్కరించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలకు పింఛను వద్దని వ్యతిరేకించారు. ప్రభుత్వం ఇచ్చే 15 ఎకరాల భూమి కూడా తీసుకోలేదు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇంటి స్థలమూ వద్దని ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారాయన. ఈ వయసులోనూ ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ 'రాజ'సం ఉట్టిపడుతుంది. భరతమాత ముద్దుబిడ్డగా ఆయన మనస్సు త్రివర్ణ శోభితం అవుతోంది

  ఇది చదవండి: రక్షా బంధన్ రోజు వృక్షా బంధన్.. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయత్నం


  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీసీ రాజన్ ఏమి ఆశించలేదు. నాలుగు జతల బట్టలు తప్ప ఎలాంటి ఆస్తులు లేని నిస్వార్ధ స్వాతంత్య్ర సమరయోధులు. పలమనేరు మాజీ ఎమ్మెల్యేగా టీసీ రాజన్ ఎన్నో సేవలు అందించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. ఆపై కొన్ని పార్టీలొచ్చాయి దేశంలో స్థాపించారు అప్పటి నాయకులు. 1956లో రాజాజీ స్వతంత్ర పార్టీని స్థాపిస్తే అందులో చిత్తూరు జిల్లా కార్యదర్శిగా టీసీ రాజన్ పనిచేసారు. 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెనాలిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా రంగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం చిత్తూరు ఎంపీగా ఉన్న అనంతశయనం అయ్యంగార్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ గవర్నర్ గా నియమించింది.

  ఇది చదవండి: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు


  దీంతో ఇక్కడి ఎంపీ స్థానానికి 1962లో ఎన్నిక వస్తే రంగాను స్వతంత్ర పార్టీ ఇక్కడ పోటీలో పెట్టింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథ రెడ్డిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఈ విజయానికి రాజన్ చేసిన కృషికి మెచ్చి, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ పలమనేరు అభ్యర్థిగా ఆయన్ను నిలబెట్టింది. ఈ ఎన్నికలో నేను 9వేల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నెలలో 15 రోజుల పాటు వాడవాడలా., ప్రతి గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించే విధంగా ఉద్యమాలు సైతం చేసారు. పాలార్ బేసిన్ స్కీమ్ మేరకు నదులపై చెక్ డ్యామ్ లను నిషేధించారు. దీనిపై రాజన్ పోరాటం సాగించారు. ఆ పోరాటం వల్లే రాష్ట్రంలో నదులపై చెక్ డ్యామ్లు నిర్మించారు.

  ఇది చదవండి: జనసేనలో చేరనున్న ప్రముఖ స్వామిజీ..? ఆ నియోజకవర్గంపై కన్ను..?


  అప్పట్లో రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. దీనిపై అసెంబ్లీలో చర్చించి అన్ని గ్రామాల్లోనూ వెలుగులు వచ్చేలా చేసారు రాజన్. జెండా పండగ వచ్చిందంటే ఊరు ముందు పచ్చతోరణాలను కట్టి జెండా ఎగురవేసే వాళ్లట. ఆ జెండా ఎగురవేయడం కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. జెండా ఎగురవేసి తరువాత నిర్వహించే సమావేశంలో గ్రామ పెద్దలు, స్వాతంత్య్రం కోసం పాటు పడిన వారు ప్రసంగిస్తుంటే వినేందుకు ఎగబడేవారు. అందరూ తెల్లటి దుస్తులను ధరించి కార్యక్రమానికి వచ్చేవారు. ఊరూరా జెండా పండుగ రోజు స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు.  104 వసంతాలు పూర్తి చేసుకొని మరో నెలలో 105వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు టీసీ రాజన్. ఆయన మాంసం అసలు ముట్టరు. పక్కా శాకాహారి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో తీసుకుంటూ ఉంటారు. ఇంత ఆరోగ్యంగా ఉండానంటే మా వంశంలోని జీన్స్ కారణమని రాజన్ చెప్తున్నారు. రాజన్ సోదరి 108 ఏళ్లు బతికిరాని.., ఆయన అన్నలు 98 ఏళ్లు జీవించారని తెలిపారు. దృఢంగా ఉండాలని ప్రత్యేకంగా. ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదుగాని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని పటేల్ లేఅవుట్, వర్తూర్లో కుమారుడి వద్ద ఉంటున్నట్లు పేర్కొన్నారు. మరి ఇల్లు., పొలం ఎందుకు తీసుకోలేదు అంటే "ఈ దేశమే నాది అయినప్పుడు ఇక ఇల్లెందుకు, పొలమెందుకు.. నేను దేశం కోసమే పుట్టాను. దేశం కోసమే పోరాడాను. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే నజరానాలపై మోజు పడలేదు. స్వాతంత్య్ర పోరాటంలో నన్ను అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినా వెనుకడుగు వేయలేదు. 55 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా సేవలందించా. అప్పట్లో స్వాతంత్య్ర సంబరాన్ని ఊరూరా ప్రజలే స్వచ్చందంగా జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకునేవారు. ఈ దేశం నా కోసం ఏం చేసిందని కాకుండా, నా దేశానికి నేనేం చేయగలనని మాత్రం ఆలోచించాను" అని తనలోని దేశభక్తిని చాటారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Azadi Ka Amrit Mahotsav, Chittoor, Freedom

  తదుపరి వార్తలు