Extramarital Affair: భర్తతో మేనకోడలు.. భార్యతో మేనమామ ఎఫైర్.. వ్యవహారం బయటపడటంతో ఇద్దరూ కలిసి..

ప్రతీకాత్మక చిత్రం

Affair: ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. తాత్కాలిక సుఖాల కోసం కొందరు ఎంతటి నేరానికైనా పాల్పడేందుకు వెనుకాడటం లేదు.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. తాత్కాలిక సుఖాల కోసం కొందరు ఎంతటి నేరానికైనా పాల్పడేందుకు వెనుకాడటం లేదు. అగ్నిసాక్షిగా కలిసిన పవిత్ర బంధాన్ని కాలరాస్తున్నవారు అడ్డొచ్చిన వారిని హతమార్చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కొన్ని మిస్సింగ్ కేసులు మర్డర్ కేసులుగా మారుతున్నాయి. అలాంటి మర్డర్ కేసుల్లో 10కి ఆరు కేసులు వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే జరుగుతున్నాయి. అలా అదృశ్యమైన ఓ వ్యక్తి కేసును పోలీసులు దర్యాప్తు చేయగా.. చివరికి అది హత్య కేసుగా తేలింది. ఆ హత్యకు గల కారణాలను విచారించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. మర్డర్ కు దారితీసిన పరిస్థితులు.. తప్పించుకునేందుకు హంతకులు వేసిన స్కెచ్ తెలిసి విస్తుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంపురం జిల్లా పామిడి మండలం ఎదురూరికి చెందిన పెద్దయ్య(35) ఈనెల 11వ తేదీ నుంచి కనింపించకుండా పోయాడు. అతడి తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా... సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  విచారణలో భాగంగా పెద్దయ్య బ్యాక్ గ్రౌండ్ ఇతర అంశాలు ఆరా తీయగా వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడు హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఎదురూరుకు చెందిన సుంకమ్మ అలియాస్ సుజాతకు కొన్నేళ్ల క్రితం రమేష్ అనే వ్యక్తితో పెళ్లైంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన పెద్దయ్యతో వివాహేతర సంబంధం ఉంది. ఐతే సుంకమ్మ మేనమామ అయిన శంకరయ్యకు.. పెద్దయ్య భార్య బాలక్కతో అఫైర్ ఉంది. ఐతే తన భార్యతో శంకరయ్యకు వివాహేతర సంబంధమున్న విషయం పెద్దయ్యకు తెలిసిపోయింది. దీంతో తనను చంపేస్తాడేమోనని భయపడ్డ శంకరయ్య.. తన పెద్దయ్య హత్యకు స్కెచ్ వేశాడు.

  ఇది చదవండి: అతడికి 21, ఆమెకు 17.. ఇద్దరిలో ఒకరిది వన్ సైడ్ లవ్.. చివరకు ఎంపీ వద్దకు చేరిన పంచాయతీ..


  వెంటనే పెద్దయ్యతో అక్రమ సంబంధమున్న తన మేనకోడలు సుంకమ్మను సాయమడిగాడు. ఇద్దరూ కలిసి పెద్దయ్యను హత్య చేసేందుకు ముహూర్తం పెట్టారు. శంకరయ్య తన మేనకోడలు సహాయంతో పెద్దయ్యాను 11వ తేదీ రాత్రి 10.30కి పత్తికొండ వద్దకు పిలిపించాడు. అక్కడ అప్పటికే తన అల్లుడు శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి పత్తికొండ గురుకుల పాఠశాల సమీపంలో పెద్దయ్యాను హత్య చేశారు.

  ఇది చదవండి: ఫుల్లుగా తాగి తన్నుకున్న మహిళలు... నడిరోడ్డుపై వీరంగం.. ఎక్కడంటే..!


  హత్య విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా.. హైవేపై డెడ్ బాడీని తీసుకెళ్లి.. తెలంగాణ రాష్ట్రం పరిధిలోని బీచుపల్లి సమీపంలో కృష్ణానదిలో పడేశారు. పెద్దయ్య కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఐతే వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు చేయగా.. సుంకమ్మ, ఆమె మేనమామ శంకరయ్య హస్తమున్నట్లు వెల్లడైంది. శంకరయ్యతో పాటు సుంకమ్మ, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డిలను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
  Published by:Purna Chandra
  First published: