Elephant in Well: అసలే ఏనుగు (Elephant).. అందులోనూ భారీకాయం.. అంత భారీగా ఉన్న ఏనుగు బావిలో పడితే ఎలా వుంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా వుంది.. కానీ నిజంగానే జరిగింది. నీళ్లకోసం వచ్చి.. బావిలో పడ్డ ఏనుగు (Elephant in Well) అక్కడ నుంచి బయటకు రాలేకా రాంత్రంతా ఘీంకారాలు పెట్టింది. ఆ పొలాలకు దగ్గరలో ఉన్నవారు అంతా ఏం జరుగుతోందో తెలియక కంగారు పడ్డారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే.. చిత్తూరు జిల్లా (Chittoor District) బంగారుపాళ్యం మండలం మొగిలి పంచాయతీ గాండ్ల పల్లె గ్రామంలోని రైతు జగ్గయ్య నాయుడు బావిలో సోమవారం రాత్రి ఏనుగు పడిపోయింది. ఆ బావిలోంచి వస్తున్న గజరాజు ఘీంకారాలు విన్న రైతులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. అయితే ఆ ఏనుగును బయటకు తీయటానికి వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని.. రైతులు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది.. ఎందుకు అడ్డుకున్నారంటే.. నిత్యం గజరాజుల దాడులతో పంట పొలాలు నష్టపోతున్నామని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని, ఇప్పుడు బావిలో పడ్డ ఏనుగుని బయటకు తీయడానికి వచ్చారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు అధికారులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.
అయితే బావిలోంచి గజరాజుని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే గ్రామస్తులు బావిని JCB తో పూర్తిగా నాశనం చేస్తారని, అలా కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే మార్గంలో బయటకు లాగాలని వారించగా అధికారులు బావి యజమానికి సర్దిచెప్పారు. రైతులు సైతం మానత్వంతో ఆలోచించి అధికారులకు సహకరించారు.
అసలు అందులోకి ఎలా వచ్చింది అంటే.. అడవిలోని ఏనుగల గుంపు నుంచి తప్పిపోయి వచ్చిన ఏనుగు.. దాహంతో వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్న బావిలో నీరు తాగాలని ప్రయత్నించింది. ఆ చీకట్లో సరిగ్గా దరి కనిపించకపోవడంతో చికట్లో దారి కనిపించక.. నీరు తాగే ప్రయత్నంలో వెళ్లి బావిలో పడిపోయింది. పడిపోయిన తరువాత పైకి ఎక్కే మార్గం లేక రాత్రంతా అందులోనే ఉండిపోయింది.
ఇదీ చదవండి : కాంతారా గా మారిన తహసీల్దార్.. కారణం ఏంటో తెలుసా..?
అయితే అంతకుముందే ఆ ఏనుగు బీభత్సం చేసింది అంటున్నారు స్థానిక రైతులు. కౌండిన్య అభయారణ్యం నుంచి వ్యవసాయక్షేత్రాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు నుంచి తప్పి పోయిన ఆ ఏనుగు.. ఒంటరిగా దిక్కు తోచక స్థానికంగా హల్చల్ చేసింది అంటున్నారు. బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద, బండ్లదొడ్డి, శ్రీని జ్యూస్ ఫ్యాక్టరీ, జాయతీ రహదారిపై హల్చల్ చేసింది. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమను భయపెట్టిన ఏనుగు ఇదే.. అని బావిలో పడిపోయింది అని స్థానికులు చెబుతున్నారు.
ఎట్టేకులకు రైతులు కూడా సహకరించడంతో.. బావి నుంచి ఏనుగు బయటికి వచ్చేలా తవ్వకం చేపట్టారు. గ్రామస్తులు, రైతుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఏనుగును సేఫ్గా బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. అంతేకాదును ఏనుగు కోసం చాలా వరకు తవ్వేసిన బావి దారిని గోడను.. మళ్లీ బాగు చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Elephant, Farmers