హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Floods Effect in AP: వరద మిగిల్చిన కన్నీటి గాధ.. చెట్ల కిందే బతుకీడుస్తున్న బాధితులు

Floods Effect in AP: వరద మిగిల్చిన కన్నీటి గాధ.. చెట్ల కిందే బతుకీడుస్తున్న బాధితులు

చెట్టుకింద వరద బాధితుల నివాసం

చెట్టుకింద వరద బాధితుల నివాసం

భారీ వర్షాలు (AP Floods), వరదలకు దేవరాయలు ఏలిన రత్నాల సీమ అతలాకుతలమైంది. గత 30ఏళ్లలో కనీవినీ ఎరుగని విధంగా కురిసిన వర్షాలకు రాయలసీమలోని చిత్తూరు (Chittoor), కడప (Kadapa), అనంతపురం (Anantapuram)తో పాటు నెల్లూరు (Nellore) జిల్లాలు పూర్తిగా నీటమునిగాయి.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, Tirupathi, News18

భారీ వర్షాలు (AP Floods), వరదలకు దేవరాయలు ఏలిన రత్నాల సీమ అతలాకుతలమైంది. గత 30ఏళ్లలో కనీవినీ ఎరుగని విధంగా కురిసిన వర్షాలకు రాయలసీమలోని చిత్తూరు (Chittoor), కడప (Kadapa), అనంతపురం (Anantapuram) తో పాటుగా నెల్లూరు (Nellore) జిల్లాలు పూర్తిగా నీటమునిగాయి. కొన్నేళ్ళుగా ఎండిపోయిన వాగులు, వంకలు, చెరువులు, బావులు, ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడమే కాదు, జలప్రళయాన్నే సృష్టించాయి. ఊరూవాడా అనే తేడా లేకుండా వరదనీటిలో కొట్టుకుపోయాయి. వరద సృష్టించిన విలయానికి వేలాది మంది తమ ఇళ్లు కోల్పోయారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక దాదాపు వారం రోజులుగా బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించకపోవడంతో నిలువనీడ లేక అల్లాడిపోతున్నారు. వరద పరిస్థితుల్లో ఎవర్ని కదిలించినా కన్నీటి గాధలే వినిపిస్తున్నాయి. అలా ఇల్లు కోల్పోయిన ఓ కుటుంబం చెట్టునీడనే బ్రతుకీడుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. వరదల ధాటికి కడప జిల్లా పూర్తిగా జలమయమైంది. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో చెయ్యేరు నది గ్రామాలను ముంచెత్తింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు కొండలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ వారి ఇల్లు మాత్రం నీటమునిగిపోయాయి. మూడు రోజులుగా చెయ్యురు శాంతించడంతో ప్రజలు ఒక్కొక్కరుగా ఇళ్లకు చేరుతున్నారు. కూలిపోయిన తమ కలల సౌధాలను చూసి బోరున విలపిస్తున్నారు. లా చాలకుటుంబాలు ఆవాసం లేకుండా చెట్టు క్రిందనే జీవిస్తున్నాయి. కొన్ని వందల కుటుంబాలు ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో చెట్టుక్రిందనే నివాసం ఏర్పాటు చేసుకుంటూ దేవుడా మాకేంటి ఈ భాధ అంటూ కన్నీటి పర్యంతరం అవుతున్నారు.

ఇది చదవండి: ఏపీలో  టమాటా రేటు ఫిక్స్ చేసిన జగన్.. రైతు బజార్లో  కిలో ఎంతంటే..!


చెయ్యేరు నదికి అనుకోని ఉన్న గ్రామాల్లో తోగురు పేట ఒకటి. వరదనీటిలో ఇల్లన్నీ కొట్టుకుపోవడంతో గ్రామంలో 10 కుటుంబాలకు పైగా చెట్టుకిందే ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. అందులో సరోజనమ్మ కుటుంబం ఒకటి. చిన్నపిల్లలో ఆ కుటుంబం చెట్టునే ఇల్లుగా చేసుకుంది. అక్కడే వంటా వార్పూ చేసుకుంటూ.. రాత్రిళ్లు చలికి వణికిపోతూ జీవనం సాగిస్తోందా కుటుంబం.


ఇది చదవండి: ఇలాంటి వింత మరెక్కడా చూసి ఉండరు.. భూమి నుంచి పైకొచ్చిన వాటర్ ట్యాంక్..



వరద సృష్టించిన ప్రళయం గురించి సరోజనమ్మ మాట్లాడుతూ.." మాది చెయ్యురు చెరువుకు సమీపంలో ఉన్న తోగురు పేట. చాల ఏళ్ల నుంచి ఇక్కడే మేము జీవనం సాగిస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా మా ఊరిని వరద వరద ముంచెత్తింది. ఇసుకతో నిండిపోయిన గ్రామం.... పూర్తిగా ఇళ్లను ద్వాంసం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న ఊరిని విడిచి బయట ఊరికి వెళ్లలేము. ఆలా అని బిడ్డ పాపలతో ఇలానే చెట్టుక్రింద జీవించలేము. అధికారులు వచ్చి వెళ్తూనే ఉన్నారు. సమయానికి అన్నం అందించిన నిలువ నీడను మాత్రం లేదు. గుడారాలు వేసేయమని ప్రాధేయ పడిన ఎవరు పట్టించుకోవడం లేదు. చిన్న పిల్లలతో రాత్రి వేళల్లో బిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP Floods, Kadapa

ఉత్తమ కథలు