ఏపీలోని చిత్తూరు జిల్లా (Chittoor District) చంద్రగిరి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఐతేపల్లి వద్ద స్విఫ్ట్ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఏడాది చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని పోలీసులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ముగ్గురులో ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరోవైపు ప్రమాదం కారణంగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. బాధితులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది. కాణిపాకం నుంచి స్వస్థలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ కు అతివేగమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Road accident