Srikalahasti: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accidents) భయపెడుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీకాళహస్తి (Srikalahasti) ఆలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో ఒక్కసారిగా అపశ్రుతి చోటు చేసుకుంది. చొక్కాని దీపోత్సవంలో మంటలు చెలరేగాయి. అవి భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు భయంతో పరుగులు తీశారు. ఊహించని భారీగా భక్తులు తరలిరావడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు ఆలయ సిబ్బంది, ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ఓ మహిళా సెక్యూరిటీ గార్డుకు చెయ్యి విరిగింది. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సాధారణంగా ఏటా పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భారీ దీపోత్సవం ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయ పరిసరాల్లోనే దాదాపు ఒక 20 అడుగుల ఎత్తులో ఒక దీపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీపోత్సవం నిర్వహించారు. దీంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.
ప్రతి ఏటా ఈ దీపోత్సవానికి వందలాది మంది భక్తులు హాజరవుతూనే ఉంటారు. అయితే గత రెండేన్నరేళ్లుగా కరోనా కారణంగా భక్తులు దూరంగా ఉన్నారు. అందుకే ఈ సారి ఊహించని రీతలో భారీగానే భక్తులు వచ్చారు. దానిక తగ్గ ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహాకులు ఫెయిలయ్యారు. అందుకే భారీగా మంటలు ఎగిసిపడతాయని తెలిసినా.. భక్తులను కంట్రోల్ చేయడంలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. ఒక్కసారి మంటలు ఎగిసిపడడంతో.. భయపడ్డ భక్తులు భయపడి ఒక్కసారిగా పరుగు అందుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆమెను వీల్ చైర్ లో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి : నేడు.. రేపు ప్రత్యేక పూజలు.. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే ధనవంతులవ్వడం ఖాయం..
నిజానికి.. ఇలాంటి భారీ చొక్కాన్ని దీపోత్సవాన్ని చుట్టూ ఎవరూ భక్తులు లేకుండా, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ వేడుక నిర్వహించాల్సింది. అయితే, ఆలయ సిబ్బంది కాస్త నిర్లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, ఊహించిన దానికన్నా అధికంగా భక్తులు రావడం, అదే విధంగా ఎగసిపడ్డ మంటలు.. దీంతో మంటలు చెలరేగి భక్తుల మీద పడ్డాయి. భయాందోళన చెందిన భక్తులు చెల్లాచెదురయ్యారు. పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకోవడం, పలువురికి గాయాలవడం జరిగింది.
ఇదీ చదవండి : జగన్-చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత కీలక పరిణామాలు..? ఎన్నికల తేదీపై క్లారిటీ వచ్చినట్టేనా..?
మరోవైపు భక్తులు సైతం దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నా.. ఎలాంటి ప్రమాదం జరగలేదని.. కానీ ఈ సారి ఈ ప్రమాదం జరిగింది అంటే.. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని భయపడుతున్నారు. అలాగే ఆలయంలో సిబ్బంది చేస్తున్న అపచారాల కారణంగా ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Fire Accident, Srikalahasti