హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. డాక్టర్ సజీవదహనం.. ఇద్దరు పిల్లలు మృతి.. కారణం ఏంటంటే?

Breaking News: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. డాక్టర్ సజీవదహనం.. ఇద్దరు పిల్లలు మృతి.. కారణం ఏంటంటే?

అగ్ని ప్రమాదంలో మరణించిన ఇద్దరు చిన్నారులు

అగ్ని ప్రమాదంలో మరణించిన ఇద్దరు చిన్నారులు

Breaking News: తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.. అందులో డాక్టర్ సజీవ దహనం కాగా.. ఇద్దరు చిన్నారులు మరణించారు. మాదానికి కారణం ఏంటంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India

  Breaking News: తిరుపతి జిల్లా (Tirupati District)లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) కలకలం రేపింది. ఈ ప్రమాదం ఇప్పటికే ముగ్గురు మరణించారని తెలుస్తోంది. రేణిగుంట (Renigunta) లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంటలోని టౌన్, భగత్ సింగ్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ (Kartikeya Hospital) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అధికారులకు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలం దగ్గరకు హుటాహుటిన వద్దకు చరుకున్నారు. అప్పటికే భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో వెంటనే అలర్ట్ అయ్యి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇద్దరి ప్రాణాలను ఫైర్ సిబ్బంది కాపాడగా..  ముగ్గురు సజీవదహనం అవ్వడంతో విషాదం నెలకొంది.

  ఆసుపత్రిలో భారీ ఎత్తున్నా ఫర్నిచర్స్.. ఎలక్ట్రానిక్ పరికరాలు.. పిఒపి డిజైన్.. అట్టపెట్టెలు ఉండటంతో మరింత వేగంగా మంటలు వ్యాప్తి చెందాయి. హాస్పిటల్ పై బాగంలో నివాసం ఉంటున్నారు డాక్టర్ కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన సమయంలో ఘడ నిద్రలో ఉన్నట్టు సమాచారం. దీంతో డాక్టర్ రవి శంకర్, డాక్టర్ అనంతలక్ష్మి, రవిశంకర్ అమ్మ రామసుబ్బమ్మ, ఆరేళ్ల కూతురు కార్తీక, 11 ఏళ్ల కుమారుడు సిద్దార్థ రెడ్డి ఆ మంటల్లో చిక్కుకున్నారు. 

  ఇంట్లోని పవర్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక సిబ్బంది ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.  గాడ నిధ్రలో ఉన్న డాక్టర్ రవి శంకర్ ఈ మంటలకు అక్కడికక్కడే ఆహుతి అయ్యారని తెలుస్తోంది. అయితే మంటల కారణంగా వచ్చిన పొగలతో  చిన్నారులు కార్తిక.. సిద్దార్థ రెడ్డి ఊపిరి ఆడక తుది శ్వాస విడిచారు. రవి శంకర్ రెడ్డి భార్య డాక్టర్ అనంతలక్ష్మి., తల్లి రామసుబమ్మ ప్రాణాలతో బయటపడ్డారు. కుటుంబంలో మగ్గురూ మరణించడంతో పెను విసాదం నెలకొంది.

  ఇదీ చదవండి : అబ్బాయి నీరు.. బాబాయ్ ఫైర్.. ఎన్టీఆర్ , బాలయ్య ట్వీట్ల వెనుక లెక్క ఏంటి..?

  తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రిలో డాక్టర్ ప్రాక్టీషనర్ ఉన్న రవి శంకర్ రెడ్డి కొన్నాళ్ల క్రితమే ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. అయితే ముందుగానే ఆసుపత్రిపైన ఇల్లు నిర్మించుకున్నారు. ఇంకా ఆసుపత్రి మాత్రం ప్రారంభం కాలేదు.. కానీ ఆ కుటుంబం ఆస్పత్రిపై ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. దీంతో ఈ ప్రమాదం ముగ్గురు సజీవ దహనం అయ్యారు.

  ఇదీ చదవండి : బాలకృష్ణ ట్వీట్ పై దుమారం.. మంత్రుల ఎదురుదాడి.. నందమూరి కుటుంబం ఒక్కటయ్యేనా?

  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. మంటలు భారీ స్థాయిలో ఎగసి పడటంతో కొంత ఆలస్యంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.. ఇంట్లో ఉన్న ఐదు మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఇద్దరిని మాత్రమే ప్రాణాలతో రక్షించగలిగారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Fire Accident, Tirupati

  ఉత్తమ కథలు