ఏపీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిత్తూరు మోర్ధానపల్లి అమరరాజా గ్రోత్ కారిడార్ లో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ట్యూబులర్ బ్యాటరీ తయారీ విభాగంలో మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాపించాయి. సంఘటనా స్దలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలతో అర్ధరాత్రి వరకు అతి కష్టం మీద మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మంటలు రాత్రి భోజన విరామంలో జరిగాయి. ఆ సమయంలో సిబ్బంది అంతా క్యాంటీన్ లో ఉండటంతో సిబ్బందికి ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీస్ అధికారులు, ఘటనపై అగ్నిమాపక అధికారులు విచారణ జరుపుతున్నారు. అగ్నిప్రమాదంలో వల్ల ఏర్పడ్డ ఆస్తి నష్టం పై అంచనా వేస్తున్నారు అమర రాజా సంస్ద అధికారులు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలేంటి ? అసలు ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chittoor, Local News