సీనియర్ నటుడు మోహన్‌బాబు (Mohan babu)మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న మోహన్‌బాబు ప్రభుత్వాల్ని నడిపే పాలకులు, శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్న పోలీసు(Police) వ్యవస్థను ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్(IAS),ఐపీఎస్(IPS)లతో పాటు కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడితోనే ప్రభుత్వాల కింద పని చేయాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ఈ విషయాన్ని తాను స్వయంగా చూశానంటూ తన వాదనను బలంగా వినిపిస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. తిరుపతిTirupathiలో జరిగిన హీరో విశాల్(Vishal)లాఠీ( Lathi)అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అటెండ్ అయిన కలెక్షన్ కింగ్ ఈ కాంట్రవర్సీ డైలాగ్‌లు చెప్పడంతో అటు ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశమవుతున్నాయి.
మోహన్‌బాబు మాటల తూటాలు..
సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మోహన్‌బాబును ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చూస్తారు. ఏదైనా సినీ వేడుకలు, కార్యక్రమాల్లో ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేంద్రంగా మారుతారు.ఇప్పుడు కూడా మరో కొత్త కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కలెక్షన్ కింగ్. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడుతున్న పోలీసు వ్యవస్థను అగౌరవ పరిచే విధంగా కామెంట్స్ చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. సమాజంలో తమ కళ్ల ముందే ఎన్నో తప్పులు జరుగుతున్నా చూస్తూనే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని కామెంట్ చేశారు మోహన్‌బాబు. అంతే కాదు తాము కళ్లారా చూసింది తప్పు అని చెబితే ఎక్కడ ఉద్యోగాలు పోతాయో అనే భయంతోనే ఒత్తిడితో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఎంతో మంది సిన్సియర్ ఐపీఎస్, ఐఏఎస్‌లు ప్రభుత్వాల ఆదేశాల మేరకు అణిగిమణిగి పని చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేసారు కలెక్షన్ కింగ్.
వైరల్ అవుతున్న కామెంట్స్..
తిరుపతిలోని ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగిన హీరో విశాల్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరైన మంచు మోహన్‌బాబు స్టూడెంట్స్ ముందే ..ఈవిధంగా మాట్లాడటం ఏమిటనే చర్చ జరుగుతోంది. పోలీసు వ్యవస్థలో ధైర్యంగా పని చేసే వాళ్లు లేరని..చెప్పడమే మోహన్‌బాబు ఉద్దేశమా లేక ప్రభుత్వాలు నడుపుతున్న పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని చెప్పడానికే మోహన్‌బాబు ఈకామెంట్స్ చేశారా అనే ప్రశ్నలు సందిస్తున్నారు.
విశాల్‌కి పొగరు..
మొదట పోలీసులు, ప్రభుత్వాలను విమర్శిస్తూ కామెంట్స్ చేసిన మోహన్‌బాబు ఆ తర్వాత హీరో గురించి నాలుగు ముక్కలు మాట్లాడారు. తమిళ హీరో విశాల్ మంచి నటుడని కాకపోతే కొంచెం పొగరు ఉందని అన్నారు. మనిషికి పొగరు ఉండాలి కానీ ఎదుటివారికి హానీ చేసేలా ఉండకూడదన్నారు. విశాల్ నటించిన పందెం కోడి సినిమాలాగానే లాఠీ కూడా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు మోహన్‌బాబు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Mohan Babu