హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extramarital Affair: తండ్రి చేసే పాడుపనిని నిలదీసిన కొడుకు.. మారాల్సిందిపోయి ఇలా చేస్తాడనుకోలేదు..

Extramarital Affair: తండ్రి చేసే పాడుపనిని నిలదీసిన కొడుకు.. మారాల్సిందిపోయి ఇలా చేస్తాడనుకోలేదు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం (Anantapuram) నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇతనికి హుసేన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన హుస్సేన్ కు తండ్రి అంటే ప్రాణం. ఐతే బాషా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, Tirupathi, News18

  పిల్లల కోసం జీవితాన్నే దారబోస్తు ఉంటారు తండ్రులు. మాటల్లో కనిపించని నాన్న ప్రేమ చేతల్లో తెలిస్తూ ఉంటుంది. తాను కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్కరూపాయి తన పిల్లల భవిష్యత్తు కోసమే వెచ్చిస్తాడు. పిల్లలు తప్పు చేస్తే దండిస్తాడు. కాస్త ఎక్కువ కోపం వస్తే వారిని భయపెట్టడానికి రెండు దెబ్బలు వేస్తారు. ఐతే తండ్రి చేసిన తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశాడు ఓ తనయుడు. తప్పు చేస్తునావని హెచ్చరించాడు. ఇంట్లో ఎదిగిన కొడుకులను పెట్టుకొని బయట పాడుపనులు ఏంటని ప్రశ్నించాడు. కుమారుడిపై కోపంతో ఏ తండ్రి చేయని ఘాతుకానికి తెగబడ్డాడు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కన్నకొడుకుని క్షణికావేశంలో దారుణంగా హత్య చేశాడు. కొడుకు కళ్లెదుటే దహనమవుతున్నా కనికరం చూపని తండ్రికి చివరకు కటకటాల్లోకి వెళ్లాడు.

  వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇతనికి హుసేన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన హుస్సేన్ కు తండ్రి అంటే ప్రాణం. ఐతే బాషా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన హుస్సేన్.. తప్పుచేస్తున్నావంటూ తండ్రిని మందలించాడు. అయినా తండ్రిలో ఎలాంటి మార్పు రాలేదు. తన మాట వినలేదని బంధువులతో తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు. ఎన్ని చెప్పిన నాన్న మహబూబ్ భాషలో మార్పులు రావడం లేదని తన బాధను వెళ్లగక్కాడు.

  ఇది చదవండి: అత్తను అరెస్ట్ చేస్తేనే టవర్ దిగుతా.. అల్లుడు చేసిన పనికి పరుగులు పెట్టిన పోలీసులు..

  ఐతే తన కొడుకు బంధువులతో చెప్పుకొని బాధపడిన సంగతి మహబూబ్ బాషా చెవిలో పడింది. దీంతో కొడుకుపై కోపంతో ఊగిపోయాడు బాషా. తన గురించి బంధువులకు అలా ఎలా చెప్తాడని ఆగ్రహంతో ఇంటికొచ్చిన బాషా.. కొడుకుతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అప్పటికే కొడుకుపై ఆవేశంతో ఊగిపోతున్న బాషా.. హుస్సేన్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

  ఇది చదవండి: భర్తకు ఫోన్ చేసి నీ భార్యను పంపాలంటూ వేధింపులు.. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీన్ రివర్స్..

  కొడుకు మంటల్లో కాలిపోతుంటే తండ్రి మాత్రం నవ్వుతూ ఆనందించాడు. హుస్సేన్ కేకలు వేస్తూనే తండ్రిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతడికి స్వల్పగాయాలయ్యాయి. మరోవైపు హుస్సేన్ మాత్రం పూర్తిగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

  ఇది చదవండి: కట్టుకున్న భర్తే అంత మాట అనే సరికి తట్టుకోలేకపోయింది... ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది

  వివాహేతర సంబంధం కోసం కొడుకుని కిరాతకంగా చంపిన బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనే ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగింది. వయసొచ్చిన కూతురున్న ఓ నర్సు.. తనకంటే చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకుంది. తమ సుఖానికి కూతురు అడ్డొస్తుందని భావించి ప్రియుడితో కలిసి కూతుర్ని హత్య చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది.

  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Crime news, Extramarital affairs

  ఉత్తమ కథలు