హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cruel Father: రెండు నెలల పాప తనపోలికతో లేదట... కిరాతకానికి పాల్పడ్డ తండ్రి...

Cruel Father: రెండు నెలల పాప తనపోలికతో లేదట... కిరాతకానికి పాల్పడ్డ తండ్రి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Father Killed Daughtre: నమ్మకమే అందమైన జీవితానికి పునాది. కానీ ఓ భర్త.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితం పండంటి ఆడబిడ్డ పుట్టింది. బోసినవ్వులతో ఉన్న ఆ పాపను చూసిన అతడి మనసు మారలేదు.

  అనుమానం మనిషిని ఎంతటి నేరానికైనా ఉసిగొల్పుతుంది. భార్యభర్యల మధ్య ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకమే అందమైన జీవితానికి పునాది. కానీ ఓ భర్త.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితం పండంటి ఆడబిడ్డ పుట్టింది. బోసినవ్వులతో ఉన్న ఆ పాపను చూసిన అతడి మనసు మారలేదు. బిడ్డపుట్టిన తర్వాత కూడా భార్యపై అనుమానంతో రగిలిపోయాడు. ముక్కుపచ్చలారని పసిపాను కిరాతకంగా హత్య చేశాడు. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) చోటు చేసుకుంది. కల్యాణదుర్గం పట్టణానికి చెందిన మల్లికార్జన రెండు నెలల క్రితం పుట్టిన చిన్నారికి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆర్జీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాప ఏడుస్తుండటంతో ఎత్తుకొని ఆడిస్తూ బయటకు తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత తిరిగిరాలేదు. భర్త కోసం ఎదురుచూసిన భార్య చిట్టెమ్మ ఇద్దరూ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం మల్లికార్జునను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా షాకింగ్ నిజాలు వెల్లడించాడు. పాపను తానే చంపేసినట్లు విచారణలో తెలిపాడు. భార్యపై అనుమానం, పాప తనపోలికలతో లేదన్న భావనతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పాప నోటికి ప్లాస్టర్ వేసి, గోనే సంచిలో మూటగట్టి చెరువులో పడేసినట్లు మల్లికార్జున పోలీసులకు తెలిపాడు. పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించాడు.

  ఇది చదవండి: ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ కొనిస్తే ఇలా చేసిందేంటీ..! చేజేతులా లైఫ్ రిస్కులో పడేసుకున్నావుగా..!


  మరోవైపు రెండు నెలల చిన్నారి దూరమవడంతో తల్లిచిట్టెమ్మ కన్నీరుమున్నీరవుతోంది. అనుమానంతో రోజూ గొడవ పడుతున్న భర్త అంతటి ఘాతుకానికి ఒడిగతాడని భావించలేదని రోదిస్తోంది. మల్లికార్జునపై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. తన చిన్నారిని పొట్టనబెట్టుకున్న భర్తపై కటిన చర్యలు తీసుకోవాలని భార్య చిట్టెమ్మ డిమాండ్ చేస్తోంది.

  ఇది చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త హత్యకు సుపారీ.. పక్కా స్కెచ్ వేసినా దొరికిపోయింది...


  మరోవైపు హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్లో అదృశ్యమైన బాలుడు అన్వేష్ కథ విషాదాంతమైంది. ఆడుకునేందుకు ఇంటికి వెళ్లిన అనీష్ శవమై తేలాడు. ఇంటికి సమీపంలోని చెరువులో అనీష్ మృతదేహాన్ని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరగూడ సిరిమల్లె కాలనీకి చెందిన శంకర్, అపర్ణ దంపతుల తమ కుమారులతో కలిసి ఓ అపార్ట్ మెంట్లో ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకువెళ్లిన అన్వేష్ తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది.

  ఇది చదవండి: అమెరికా అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్... కొన్నాళ్ల తర్వాత మనోడికి చుక్కలు చూపించింది...


  అన్వేష్ ఎక్కడికైనా వెళ్లిపోయాడా.? లేదా కిడ్నాప్ చేశారా...? అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి ఆధారంగా బాబు వెళ్లిన దారిలో గాలించగా సమీంలోని చెరువులో మృతదేహం లభ్యమైంది. ఐతే బాబును ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయాడా..? లేక ఎవరైనా హత్య చేశారా..? అనే కోణంలో విచారిస్తున్నారు. ఐతే అన్వేష్ మృతిపై తమకు అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Crime news

  ఉత్తమ కథలు