హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికెళ్లిన ప్రియుడు.. ఇద్దరినీ అలా చూసిన అమ్మాయి తండ్రి ఏం చేశాడంటే..

అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికెళ్లిన ప్రియుడు.. ఇద్దరినీ అలా చూసిన అమ్మాయి తండ్రి ఏం చేశాడంటే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అర్ధరాత్రి ప్రియురాలు ఫోన్ చేయడంతో అతడు ఆమె ఇంటి వద్ద వాలిపోయాడు. ఇద్దరూ గదిలో ఉండగా ఆమె తండ్రి వచ్చి తలుపుకొట్టాడు.

  GT Hemanth Kumar, Tirupati Correspondent, News18

  వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అతడికి 22, ఆమెకు ఇంకా మైనార్టీ తీరలేదు. కానీ ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం బాగా ముదిరింది. ప్రియుడ్ని విడిచి ఉండలేని ఆమె.. ఇంట్లో ఎవరూలేని సమయంలో అతడ్ని ఇంటికి పిలించింది. దీంతో ప్రియుడు.. ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. అంతలోనే అమ్మాయి తండ్రి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్ (22), అదే గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇరువురి మధ్య ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది. ఎవరికీ తెలియకుండా చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నంత కాలం వీరి ప్రేమ కథ సజావుగా సాగింది. ఐతే ఈనెల 22న అర్ధరాత్రి గదిలో ఒక్కటే నిద్రిస్తున్న యువతి.., చూసి ప్రియుడిని ఇంటికి రమ్మని తన తండ్రి మొబైల్ నుంచే కాల్ చేసింది. రాత్రిపూట ప్రియురాలు ఫోన్ చేయడంతో ధనశేఖర్ అక్కడ వాలిపోయాడు. ఇద్దరూ గదిలో ఉండగా అమ్మాయి తండ్రి బాబు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు.

  కుమార్తె నిద్రిస్తున్న గదిలో మగ గొంతు వినపడటంతో బాబు తలుపులు కొట్టాడు. తలుపు తీసిన కూతురితో పాటు ప్రియుడు ధనశేఖర్ ను చుసిన మైనర్ బాలిక తండ్రి బాబు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యాడు. బాలికను మందలించి తల్లి నిద్రిస్తున్న గదిలోకి పంపాడు. ధనశేఖర్ తో మాట్లాడాలని బయటకు తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఏమీ ఎరగనట్టు బాబు ఇంటికి చేరుకున్నాడు. ధనశేఖర్ మాత్రం ఇంటికి వెళ్ళలేదు.

  ఇది చదవండి: ఏటీఎంకు వెళ్లినప్పుడు ఇలా అస్సలు చేయకండి... లేదంటే మీ క్యాష్ గోవిందా...


  మరోవైపు ధనశేఖర్ గత కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పలమనేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ధనశేఖర్ ఫోన్ కాల్ డేటా పరిశీలించగా.. చివరిసారిగా ప్రియురాలి తండ్రి బాబు నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం చెప్పాడు.

  ఇది చదవండి: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. కానీ మరో హెచ్చరిక


  ఆ రాత్రి ఏం జరిగిందంటే..!

  22వ తేదీ రాత్రి బాబు ఇంటికి వచ్చే సమయానికి.., గదిలో తన కూతురితో ధనశేఖర్ ను చూశాడు. మాట్లాడాలంటూ ఊరి చివరకు తీసుకెళ్లి బలమైన కర్రతో అతడి తలపై మోది హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేశాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం నీటిలో తేలడంతో దానిని తీసుకెళ్లి కత్తితో ముక్కలుముక్కలుగా నరికి పొలంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు తెలిపారు. తన కుమార్తెను ప్రేమించినందుకే ఇలా చేశానని నేరం ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. మరోవైపు ధనశేఖర్ హత్యలో ప్రియురాలి కుటుంబ సభ్యుల పాత్రపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  ఇది చదవండి: లక్ అంటే ఈ రైతుదే.., పొలంలో కోటిరూపాయల వజ్రం

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime, Honor Killing, Murder

  ఉత్తమ కథలు