• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TIRUPATI FATHER BROUGHT FOOD FOR SON WHO IS IN COVID 19 WARD AND TESTED POSITIVE DIED AFTER 3 DAYS IN CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Andhra Pradesh: తండ్రిప్రేమంటే ఇదే... కొడుకు కోసం కొవిడ్ తో పోరాడి ఓడిన నాన్న..

Andhra Pradesh: తండ్రిప్రేమంటే ఇదే... కొడుకు కోసం కొవిడ్ తో పోరాడి ఓడిన నాన్న..

ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిది. కన్నబిడ్డల కోసం తమ ప్రాణాలను లెక్కచేయరు.

  • Share this:
    తమ పిల్లల కోసం జీవితాన్నే త్యాగం చేస్తాడు నాన్న. కోపంగా కళ్లెర్ర జేసినా పిల్లల బాగుకోసమే నిత్యం పరితస్తుంటాడు. చివరి నిమిషం వరకు తన ఆరోగ్యం పక్కనబెట్టి....పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అహర్నిశలు శ్రమిస్తుంటాడు నాన్న. తల్లి 9 మాసాలు తన గర్భంలో మోసి జన్మనిస్తే జీవితాంతం తమ హృదయంలో, తన ఆలోచనలో పిల్లలను మోస్తూ ఉంటాడు తండ్రి. తల్లి ప్రేమ బయటకు తెలిసినంత నాన్న ప్రేమ తెలియకపోయినా. ప్రతి అబ్బాయికి, అమ్మాయికి.., నాన్నే నిజమైన మొదటి హీరో. ఎంత కష్టం వచ్చినా, సమయం సరిపోకున్నా, సంతోషం దారికి రాకున్నా.., నీ వెంట నేనున్నానని భరోసా ఇచ్చే ఏకైక వ్యక్తి కూడా నాన్నే. తన శరీరంలో శక్తి ఉన్నన్ని రోజులు పిల్లల క్షేమంకోసం పరితపించి పోతుంటాడు. వృద్ధాప్యంలోనూ కొడుకుపై ఉన్న ప్రేమ, మమకారం అయన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో చోటు చేసుకుంది.

    తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఐరాల మండలానికి చెందిన 40 ఏళ్ళ ఓ వ్యక్తికి కుటుంబ సభ్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. అతనికి కరోనా నిర్ధారణ కావడంతో వెంటనే కుటుంబసభ్యులు వారం రోజుల క్రితం చిత్తూరు ప్రభుత్వాసుపత్రి లోని కొవిడ్ వార్డులో చేర్చారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో టిఫిన్, భోజనం నచ్చలేదన్న కుమారుడు తండ్రితో ఆవేదన వ్యక్తం చేసాడు. ఆసుపత్రిలో మంచి ఆహారం ఇవ్వడం లేదని వృద్ధుడైన (65) అతని తండ్రి ఇంట్లోనే పౌష్ఠిక విలువలు కలిగిన భోజనాన్ని తయారు చేయించి.., నేరుగా కొడుకు చికిత్స తీసుకుంటున్న కొవిడ్ వార్డు వద్దకే తీసుకెళ్లి ఇచ్చేవాడు. కుమారుడు భోజనం చేసే వరకు అక్కడే ఉంది తరువాత ఇంటికి వెనుదిరిగే వాడు.

    ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన బంధువులు… ఆపై బ్లాక్ మెయిలింగ్... చివరికి ఏం జరిగిందంటే...


    కన్నకొడుక్కి మంచి పౌష్ఠిక ఆహారం అంచనాలనే తాపత్రేయమే ఆ తండ్రి ప్రాణాలను కోల్పోయేలా చేసింది. డాక్టర్స్ డ్యూటీ నర్సులు ఎంత చెప్పిన వినని ఆ మొండితనం తన ప్రాణాలు పోగొట్టేలా చేసింది. కుమారుడికి వరుసగా నాలుగు రోజుల పాటు భోజనం అందించిన ఆ తండ్రికి రెండు రోజులు జ్వరం వస్తున్నట్టు అనిపించడంతో సదరు వ్యక్తి కూడా కొవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ గా నిర్ధరణ కావడంతో చిత్తూరు కొవిడ్ ఆసుపత్రిలోనే తాను అడ్మిట్ అయ్యాడు. మూడు రోజుల పాటు వైద్యులు చికిత్స తీసుకుంటున్న క్రమంలో పరిస్థితి విషమించింది. ఐసీయూలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయుకండా తన కుమారుడి ప్రాణాన్ని నిలబెట్టిన ఆ తండ్రి సఫలమైనా.. తాను మాత్రం కొవిడ్ మహమ్మారికి బలయ్యాడు. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమకన్నా మరేదీ గొప్పకాదని మరోసారి రుజవైంది.
    Published by:Purna Chandra
    First published: