Home /News /andhra-pradesh /

Shocking: కూతురి పెళ్లికి అన్ని ఏర్పాటు చేసిన తండ్రి.. కానీ ఆమె ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు..

Shocking: కూతురి పెళ్లికి అన్ని ఏర్పాటు చేసిన తండ్రి.. కానీ ఆమె ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి కర్ణాటకకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మరికొన్ని రోజుల్లో పెళ్లనగా పెళ్లికూతురు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

  ప్రతి తండ్రి తమ కూతురికి వయసొచ్చిన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని భావిస్తాడు. కుమార్తె సుఖంగా ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదని అనుకుంటాడు. అందుకు తగ్గట్లుగానే అన్నీ ఆలోచించిన పెళ్లి జరిపిస్తారు. అలా ఓ తండ్రి తన కుమార్తెకు ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత ఓఅబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశాడు. కూతురు ఎంతో సుఖపడుతుందని కలలుగన్నాడు. కానీ ఆమె తన ఆశలు వమ్ముచేస్తూ ఓ వ్యక్తితో వెళ్లిపోయింది. పెళ్లికి వారం ముందు కనిపించకుండా పోయింది. కుమార్తె మిగిల్చిన శోకాన్ని తట్టుకోలేక ఆ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి కర్ణాటకకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఈనెల 12, 13వ తేదీల్లో ముహూర్తం కూడా పెట్టుకున్నారు. శుభలేఖలు పంచడం, షాపింగ్ వంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు.

  ఐతే సదరు యువతి అప్పటికే ఓ యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరి కుల, మతాలు వేరు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని భావించిన యువతి.. ఎవరికీ చెప్పకుండా తాను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయింది. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కుమార్తె చేసిన పనికి అవనమాభారంతో కుంగిపోయిన ఆమె తండ్రి.. పరుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యుల వెంటనే ఆయన్ను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

  ఇది చదవండి: సైబర్ క్రైమ్ లో ట్రైనింగ్.. ప్రాక్టికల్స్ పేరుతో జనానికి టోకరా.. వీళ్లది మామూలు బుర్రకాదు..!


  గత నెలలో మదనపల్లెలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మదనపల్లెకు చెందిన నవీన్ అనే యువకుడితో పెద్దలు పెళ్లి కుదుర్చారు. పెళ్లికి ముందే రెండు కుటుంబాలు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చడంతో నిశ్చార్థం చేసి ఈనెల 14న తెల్లవారుజామున పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. శనివారం రాత్రి మదనపల్లె పట్టణంలోని సంగం కల్యాణ మండపంలో వధూవరులిద్దరికీ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు.

  ఇది చదవండి: ఒకేసారి ఇద్దరితో మహిళ ఎఫైర్... ఓ రోజు ఆ ఇద్దరూ ఎదురుపడ్డారు.. తర్వాత ఏం జరిగిందంటే..!


  రిసెప్షన్ ముగిసిన తర్వాత తన రూమ్లోకి వెళ్లి నిద్రపోయిన పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. దీంతో వరుడుతో పాటు అతడి బంధువులు షాక్ కు గురయ్యారు. తమకు అవమానంగా భావించిన అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే అమ్మాయి పారిపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కాలేజీలో చదువుతున్న సమయంలోనే సోనిక చరణ్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు సమాచారం. వీరి ప్రేమాయణం సంగతి తెలిసే తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. ఈ పెళ్లి ఇష్టం లేకనే ముహూర్తం వరకు మౌనంగా ఉన్న సోనిక.. పెళ్లికి మండపం నుంచి వెళ్లిపోయింది. పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి 2గంటల ముందే తాను ప్రేమించిన చరణ్ అనే యువకుడ్ని పెళ్లి చేసుకుంది. అనంతరం ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరింది.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Love marriage

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు