హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Father and Son: ఆస్తిలో వాటా అడిగిన కొడుకు.. ఆ తండ్రి అంత పనిచేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు..!

Father and Son: ఆస్తిలో వాటా అడిగిన కొడుకు.. ఆ తండ్రి అంత పనిచేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు..!

హత్యకు గురైన గిరిబాబు (ఫైల్)

హత్యకు గురైన గిరిబాబు (ఫైల్)

Andhra Pradesh: భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమెను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఇటీవల మొదటి భార్య కుమారుడు గిరిబాబు.. తండ్రి జయరామ్ వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు.

  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  పసితనం‌ నుండి తల్లిదండ్రులు ఎంతో గారాభం చేస్తూ తమ‌ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఒక్క‌క్షణం వారు కనపడక పోయినా అల్లాడి పోతుంటారు. తమ గారాలపట్టికి ఏమైందో ఏమో అని భయపడి పోతుంటారు. అడిగిందే తడువుగా ఏదంటే అది క్షణాల్లో వారిముందు ఉంచుతారు ఆ తల్లిదండ్రులు. కన్నబిడ్డలు ఎంత చెడ్డదారిలో వెళ్లినా వారిమీద ప్రేమను కురిపిస్తారు. అలాంటి సమాజంలో కన్నకొడకునే సుపారీ ఇచ్చిమరీ హత్య చేయించాడో తండ్రి. ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. ముమ్మాటికీ నిజం. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కే.వీ పల్లె మండల‌ కేంద్రానికి చెందిన జయరామ్ కు కొన్నేళ్ల క్రితం మహిళతో వివాహమైంది. వీరికి జయరామ్ అనే కుమారుడున్నాడు. ఐతే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమెను వదిలేసి రెండో వివాహం చేసుకున్నాడు. ఐతే మొదటిభార్య కుటుంబానికి కావాల్సినవన్నీ జయరామ్ చూసుకుంటున్నాడు. ఐతే ఇటీవల మొదటి భార్య కుమారుడు గిరిబాబు.. తండ్రి జయరామ్ వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు.

  ఐతే డబ్బు ఇచ్చేందుకు జయరామ్ నిరాకరించడంతో వాగ్వాదానికి దిగాడు. తాను అడిగిన డబ్బు ఇవ్వలేని పక్షంలో ఆస్తిలో వాటా ఇవ్వాలని గొడవ పడ్డాడు. ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నడిచింది. పెద్దలు సర్దిచెప్పినా తండ్రీకొడుకుల మధ్య గొడవలు సద్దుమణగలేదు. ప్రతిరోజూ ఇంటికి వస్తున్న గిరిబాబు ఆస్తిని పంచాలని ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అతడ్ని చంపాలని జయరామ్ స్కెచ్ వేశాడు. అనుకున్నవిధంగా ముగ్గురు వ్యక్తుల ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.9లక్షలు సుపారీ ఇచ్చేందుకు అంగీకరించాడు.

  ఇది చదవండి: సత్యం స్కెచ్.. సీతయ్య యాక్షన్.. రాహుల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..


  ఈ క్రమంలో ఈనెల 16వ తేదీన రెడ్డివారిపల్లె వద్ద గిరిబాబును కత్తితో నరికి చంపారు. ఆ సమాచారాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే జయరామ్ కేవీపల్లె పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కుమారుడ్ని ఎవరో హత్య చేశారంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. తండ్రి జయరామ్ కిరాయి హంతకులతో గిరిబాబును హత్య చేయించినట్లు వెల్లడైంది. కొడుకును హత్యచేయించిన విషయంతెలిసిపోవడంతో జయరామ్ పారిపోవడానికి యత్నించగా పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకున్నారు. జయరామ్ ఇచ్చిన సమాచారంతో హంతకులు మల్లికార్జున, చంద్రశేకర్, సురేష్ ను రెడ్డిపారిపాలెం క్రాస్ వద్ద బస్ షెల్టర్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండువేల రూపాయల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండుకు తరలించారు. మరోవైపు భర్తే కొడుకును హత్య చేయించడంతో గిరిబాబు తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Crime news, Son killed by father

  ఉత్తమ కథలు