Home /News /andhra-pradesh /

TIRUPATI FARMERS SHIFTED THEIR FAMILIES TO PADDY FIELDS TO GET AWAY FROM CORONA VIRUS IN CHIRROOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Andhra Pradesh: కరోనా రాకుండా రైతుల వినూత్న ప్రయోగం.. మాస్కులు, శానిటైజర్లతో పనిలేదు..

పొలాల్లో నివాసం ఏర్పరుచుకున్న రైతులు

పొలాల్లో నివాసం ఏర్పరుచుకున్న రైతులు

కరోనా (Corona Virus) నుంచి దూరంగా ఉండేందుకు చాలా మంది రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తున్నారు.

  కోవిడ్-19 పేరుచెపితేనే ప్రజల గుండెల్లో కలవరానికి గురిచేస్తోంది. చుట్టూ కేసులు నమోదు అవుతుండటంతో ఇంట్లో నుంచి బయటకు రాని వారికి కూడా కరోనా భయం వెంటాడుతోంది. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకుంటే చాలు దేవుడా అంటూ ప్రజలు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. సన్నిహితులతో పాటుగా బంధువుల్లోనూ కరోనా నిర్ధారణ కావడంతో అందరిమీద అనుమానమే. ఒకరు తుమ్మినా, మరొకరు దగ్గినా, ఇంకోరు గొంతు నొప్పి అంటే చాలు చాలామంది ఆమడ దూరం వెళ్తున్న పరిస్థితి. చివరకు కిరాణా కొట్టుకు వెళ్లిన అనుమానమే. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. కరోనాతో సహజీవనం చేయాలనీ కొందరు.....కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని మరి కొందరు చెపుతూనే ఉంటారు. ఈ వేదన, ఈ బాధను భరించేము అనుకున్నారు ఆ ఊరి రైతులు, తమ ఇళ్లు, వాకిళ్లు వదిలిపెట్టి కుటుంబంతో సహా ఊరిచివర పొలంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అసలైన సోషల్ డిస్టెన్స్ అని అంటున్నారు ఆ ఊరి రైతులు.

  వివరాల్లోకెళితే.., చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. జిల్లాలోని పెద్ద నగరాలు, పట్టణాలతో పాటు మారుమూల పల్లెల వరకు కరోనా చాపక్రింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఎటుచూసినా కరోనా కేసులతో జిల్లా అతలాకుతలం అవుతోంది. చిత్తూరు జిల్లా మొరం పంచాయితీ పరిధిలోని మొరం గ్రామంలో కరోనా నివారణకు కొన్ని రైతులు వినూత్న ప్రయోగం చేసారు. రెండవ వేవ్ మరింత వేగవంతంగా విజృంభిస్తు ప్రాణాంతకంగా మారింది. దీంతో తమను తాము కాపాడుకుంటూ కరోనా నుంచి తమ కుటుంబాన్ని కాపాడే విధంగా ఆ రైతు కుటుంబాలు చేస్తున్నారు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లో కుటుంబ సభ్యులతో కలసి తాత్కాలికంగా ఇంటిని నిర్మించుకున్నారు.

  ఇది చదవండి: తగ్గేదేలే.. అంటున్న రోజా... వారికి స్ట్రాంగ్ వార్నింగ్..


  పల్లెలోని బాబు, శంకర్ రెడ్డి, వరదరాజులు కుటుంబాలు పొలాల్లో షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. గత వరం రోజులుగా కుటుంబ సభ్యులతో కలసి అక్కడే ఉంటున్నారు. ఎటు చుసినా కరోనా తగ్గక పోవడంతో ఎలాగో పొలాల వద్దనే ఉన్నారు కాబట్టి.., పొలం పనులు కూడా తామే చేసుకుంటున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకునా రామాపురం, రంగినయన పల్లి, నక్కపల్లి గ్రామస్థులు కూడా తమ తమ పొల్లాలో కాపురాలను మార్చుకొని తమ పొలంలో తామే కూలీలుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారు.

  ఇది చదవండి: ఈ చిట్టితల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు... మాటలకందని విషాదం ఇది..


  గ్రామీణ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే కరోనా మార్గదర్శకాలపై సరైన అవగాహన లేకపోవడం, గ్రామాల్లో రచ్చబండల వంటి వాటిపై పిచ్చాపాటి మాట్లాడుకోవడం సర్వ సాధారణం. తెల్లవారితే పొలంపనులు, ఇతర పనులంటా పల్లె జనమంతా కలిసే ఉంటారు. ఒకటి రెండు రోజులకు మించి బయటికెళ్లకుండా ఉండలేదు. దీంతో ఆ రైతులు ఇలా పొలాలకు షిఫ్టై కరోనా నుంచి రక్షణ పొందుతున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Corona virus, Tirupati

  తదుపరి వార్తలు