హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Farmers: నాలుగు నెలల కష్టం.. నాలుగు రోజుల్లో నాశనం.. వరద విలయానికి రైతన్న కుదేలు..

Farmers: నాలుగు నెలల కష్టం.. నాలుగు రోజుల్లో నాశనం.. వరద విలయానికి రైతన్న కుదేలు..

వర్షానికి నీట మునిగిన పంటలు

వర్షానికి నీట మునిగిన పంటలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంభవించిన ప్రకృతి ప్రళయానికి కొన్ని వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. ప్రతి ఏడాది నష్టాలు చవిచూసిన రైతులు (Farmers) ఈసారి దిగుబడులు భారీగా వస్తాయని భావించారు కానీ.. వరద విలయం రైతులకు కడగళ్లు మిగిల్చింది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, Tirupathi, News18

కన్న బిడ్డలైనా మోసం చేస్తాడేమోగాని నమ్ముకున్న భూమి ఎప్పటికి మోసం చేయదన్న మాట పెద్దలు చెప్తుంటారు. వారు నమ్ముకున్న భూమిలో వేసిన పంటను బిడ్డలా కాపాడుకుంటారు రైతులు. అవసరమైనప్పుడు ఎరువులు, పురుగు మందులు వేస్తూ దిగుడబులు పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఐతే అనుకోని విపత్తు రైతుల ఆశలపై నీళ్లు చల్లించింది. ప్రపంచం ఆకలి తీర్చే అన్నదాతకు పట్టెడన్నం దొరికే పరిస్థితి లేకుండా పోతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన ప్రకృతి ప్రళయానికి కొన్ని వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. ప్రతి ఏడాది నష్టాలు చవిచూసిన రైతులు ఈసారి దిగుబడులు భారీగా వస్తాయని భావించారు కానీ.. వరద విలయం రైతులకు కడగళ్లు మిగిల్చింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

చిత్తూరు జిల్లాలోని చాలా మండలాల్లో రైతులు అధికంగా టమాటా సాగు చేస్తుంటారు. మిగిలిన అన్ని మండలాల్లో చెరకు, వరి వంటి పంటలు పండిస్తుంటారు. ఈ ఏడాది రబీ సీజన్లో అధిక దిగుబడి సాధించాలని చాల మంది రైతుల కలను భారీ వర్షాలు కల్లలుగానే మిగిల్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల చిత్తూరు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. అనుకున్న అంచనాకంటే 10 రెట్లు అధిక వర్షపాతం నమోదు కావడంతో ఏళ్ళ తరబడి నిండని కళ్యాణి డ్యామ్., ఇతర రిజర్వాయర్లు, చెరువులు పొంగి పొర్లాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి గ్రామలను ముంచెత్తాయి. పంటపొలాలను సైతం నాశనం చేశాయి.

ఇది చదవండి: టీడీపీ-బీజేపీ పొత్తుకు వైసీపీనే దారులు వేస్తోందా..? ఆ వాఖ్యలకు అర్ధం ఇదేనా..?


చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 25000 ఎకరాలవిస్తీర్ణంలో వేసిన వరి, 6 వేల ఎకరాల్లో వేసిన టమోటా సాగు పూర్తిగా దెబ్బతిని రైతుకు తీరని శోకాన్ని మిగిల్చాయి. వరి పంటకు ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు వ్యాచించాల్సి ఉంటుంది. ఇక టామాటా పంటకు ఎకరానికి రూ.45 వేల వరకు వెచ్చించక తప్పదు. ఎరువురు, పురుగు మందులకు చేసే ఖర్చు అదనం.

ఇది చదవండి: తల్లిదండ్రులకు అలర్ట్.. అమ్మఒడిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. కారణం ఇదేనా..!



జిల్లాలోని 60% పంటలు నీట మునగగా... మిగిలిన 40% శాతం పంట పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎకరాకు 25 బస్తాలు దిగుబడి వచ్చే ప్రాతాల్లో సైతం 7 బస్తాల ఒడ్లు రావడం గమనార్హం. మాజీ సీఎం చంద్రబాబు సొంత ఊరిలో రైతులు ఈ ఏడాది భారీగా నష్టపోయారు. ఇక భీమవరంలోని ఇదే పరిస్థితి. నష్టాలకు తోడు తీర్చలేనికష్టాలు ఎదుర్కొంటున్నారు రైతులు. ఇలా పంట నష్టంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇది చదవండి: ఏపీకి కాబోయే సీఎస్ ఆమేనా..? సీఎం జగన్ మనసులో ఏముంది..?


కేంద్ర బృందం వచ్చినా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని రైతులు చెబుతున్నారు. 'తూతూ మంత్రంగా వచ్చి రాసుకుని వెళ్తున్నారు. కేంద్ర బృందం పర్యటించినా తమకు ఏమాత్రం‌ న్యాయం జరగలేదు. ప్రభుత్వమే మాలాంటి ఎంతోమంది రైతు సోదరులను ఆదుకోవాలి. అప్పులు చేసిన పంటలపై పెట్టుబడి‌ పెడుతున్నాము. ప్రభుత్వం ఆదుకోక పోతే మాకు ఆత్మహత్య శరణ్యం. ప్రభుత్వంకు రైతులు అంటే అంత చులకన అయ్యారా.... మాలాంటి రైతుల మొర ఆలకించడయ్యా.' అంటూ రైతులు వేడుకుంటున్నారు.

First published:

Tags: Agriculture, Andhra Pradesh, AP Floods