Farmer Idea: ప్రపంచానికి ఆహారాన్ని అందించే అన్నదాతకు అడుగడుగునా ఆటంకాలు తప్పడం లేదు. ఎన్నో కష్ఠాలు.. విత్తు నాటిన నాటి నుంచి.. పంట చేతికి వచ్చే వరకు.. ఆ పాటను కాపాడుకోవడం తలకు మించిన పని అవుతోంది. వర్షాభావ పరిస్థితులు.. తుఫానులు తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తాయి. ఆ బెడద లేకుంటే..? పంట ఎదుగుదల సమయంలో సూక్ష్మ క్రీములు బెడద.. పంట ఫలాలు అందుకొనే కొన్ని రోజుల ముందు నుంచే జంతువుల గండంను తప్పించేందుకు అన్నదాత చేయని ప్రయత్నం ఉండదు. నాణ్యమైన పంట కోసం సేంద్రియ మందుల పిచికారీ నుంచి.. జంతువులను తరిమే వరకు ఎన్నో గండాలు ఎదుర్కొంటారు. అసలే వేసవి కాలం.. మామిడి పళ్లకు ఎక్కడలేని డిమాండ్. ఫల్ రాజా దిగుబడి కాలం రానే వచ్చెసింది. చేతికి వచ్చిన పంటను కోతులు మామిడి తోటలో స్వైర విహారం చేస్తూ నాశనంచేస్తున్నాయి. దీన్ని గుర్తించిన రైతు వినూత్న ఆలోచనకు తేరా తీసాడు. ఆ ఐడియా ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
మొన్నటి వరకు కోతులు.. రైతును భయపడేలా చేసేవి.. ఇప్పుడు ఆ రైతును చూసి.. కోతులు పరుగులు పెడుతున్నాయి. ఇంతకీ ఏం చేశాడో తెలుసా..? గతంలో పక్షులు., వివిధ జంతువుల బెడద తప్పించేందుకు హీరోయిన్స్ ఫోటోలు పెట్టారు పలు చోట్లు.. ఈ సారి అందుకు భిన్నంగా ఆలోచించాడు రైతు.. కోతుల బెడద వదిలించుకోవడానికి అవి భయపడే రూపాన్ని.. తెచ్చుకున్నాడు..
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలోని రంగినాయునిపల్లిలో సుబ్రమణ్యం నాయుడు నివాసం ఉంటున్నాడు. అతడికి 20 ఎకరాల్లో మామిడి తోపును విస్తరించారు. అసలే ఇప్పుడు మామిడి పండ్ల సీజన్. మామిడి ప్రియులకు నోరూరించే కాలం. మరో రెండు వారలు ఆగితే భారీగా దిగుబడి సుబ్రమణ్యం నాయుడికి రానుంది. పంట చేతికి వచ్చే సమయంలో కోతులు మామిడి తోపుపై కోతులు బీభత్సం సృష్టించాయి. చేతికి వస్తున్న మామిడి పళ్ళను కొరికి నేలపై విసిరి కొడుతున్నాయి.
వానరాల నుంచి పండ్లను కాపాడుకునేందుకు ఆ రైతు వినూత్న ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు. పంటను ఎలా కాపాడుకోవాలనుకునే క్రమంలో కర్ణాటకలోని ముళబాగిలు ప్రాంతంలో వానరాలు భయపడే బొమ్మలను విక్రయిస్తున్నారని తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్ళి 500 రూపాయలు పెట్టి భయంకరమైన, వికృతమైన తల ఆకారాన్ని తెచ్చుకున్నాడు. దాన్ని రైతు తలకు బిగించుకొని మామిడితోటలో శబ్దం చేస్తూ కోతుల దగ్గరకు కెళితే అవి భయపడి పారిపోతున్నాయి.
ఆ వికృతమైన తలవైపునకు కోతులు అసలు చూడడం లేదని రైతు చెబుతున్నాడు. కోతులను తరిమేస్తున్న ఈ బొమ్మను చూసేందుకు చుట్టుపక్క రైతులు కూడా ఆసక్తిగా వస్తున్నారు. ఈవిధంగా తన 20 ఎకరాల మామిడి తోటలో అకాల వర్షాలు కారణంగా 80% పంట నష్టం వచ్చిందన్నారు సుబ్రహ్మణ్యం నాయుడు. మిగిలిన 20 శాతం పంటను కాపాడుకునే ఈ ప్రయత్నం చేసాను అని రైతు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Farmer