హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Farmer: అయ్యో పాపం.. పొలం కోసం పోరాడుతూ తహసీల్దార్ ఆఫీసులోనే రైతు మరణం.. చంద్రబాబు ఏమన్నారంటే

Farmer: అయ్యో పాపం.. పొలం కోసం పోరాడుతూ తహసీల్దార్ ఆఫీసులోనే రైతు మరణం.. చంద్రబాబు ఏమన్నారంటే

రైతు మరణంపై చంద్రబాబు ఆవేదన

రైతు మరణంపై చంద్రబాబు ఆవేదన

Farmer: న్యాయం కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు.. 40 ఏళ్లుగా తాను పండించుకునే పొలాన్ని కబ్జా చేశారని.. అధికారులకు నిత్యం మొరపెట్టుకున్నాడు. అయితే ఎవరి మనసై కరగలేదు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా న్యాయం జరగలేదు. దీంతో ఆ రైతు గుండె ఆగింది..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Chittoor, India

  Farmer: తన పొలం కోసం పోరాడుతూ.. ఎప్పటికీ న్యాయం జరగక పోయేసరికి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి దుర్ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ని చిత్తూరు జిల్లా (Chittoor District) పెనుమూరు మండ‌లంలో చోటు చేసుకుంది. కబ్జాకు గురైన తన భూమి కోసం పోరాటం చేస్తున్న రైతు గుండె ఆగింది.  పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో (MRO Office) హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తన భూమిని ఆక్రమించుకున్నారంటూ అధికారుల ముందు వాపోతూ ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయంలోనే కుప్పకూలి మరణించాడు రైతు రత్నం. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని మరొకరు ఆక్రమించుకున్నారంటూ రెవెన్యూ అధికారులకు (Revenue) మొరపెట్టుకుంటున్నాడు. ఎన్నిరోజులు కాళ్లు అరిగేలా తిరిగినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించాడు రైతు రత్నం.

  రోజూ బతిమాలుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అయితే కార్యాలయం ఎదుట రైటు బైఠాయించడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందనే భయంతో.. తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది స్పందించారు. మాట్లాడాలి అంటూ పోలీసుల సాయంతో రైతుని ఆఫీసులోకి తీసుకెళ్లారు. దీంతో అధికారులకు మరోసారి తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేశారు. 

  భూ సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని రైతు రత్నం అధికారులను వేడుకుంటున్నాడు. అలా తన ఆవేదన చెప్పుకుంటున్న సమయంలోనే.. సడెన్ గా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అధికారులు ఒక్కసారి షాక్ తిన్నారు. అసలేం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అధికారులు రైతు దగ్గరికి వెళ్లారు. అతడిని లేపే ప్రయత్నం చేశారు. కానీ, అతడిలో చలనం లేదు. అప్పటికే రైతు రత్నం మరణించాడు. హుటాహుటిన వైద్యులను పిలిపించగా.. వారు వచ్చి.. ఆ రైతు రత్నం గుండెపోటు రావడంతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

  ఇదీ చదవండి : బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారు.. ముఖ్యమైన ఘ‌ట్టాలు ఏంటి.. ఎప్పుడు..? వాటి ప్రయోజనాలు ఇవే

  భూమికోసం పోరాడుతూ మరణించిన రైతు మృతిపై చంద్రబాబు స్పందించారు. అధికారుల చుట్టు న్యాయం కోసం రోజూ తిరుగుతున్నా.. అందరికీ అన్నం పెట్టే రైతుకు ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రామ‌కృష్ణాపురం పంచాయ‌తీ రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రైతు ర‌త్నం కబ్జాకు గురైన తన పొలం కోసం పోరాడుతూ, పెనమూరు తహశీల్దారు ఆఫీసులోనే ప్రాణాలు విడిచి పెట్టిన వార్త తన మనసును కలచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

  ఇదీ చదవండి : మీ అమ్మాయికి మంచి అమెరికా సంబంధం వచ్చిందని మురిసిపోతున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే


  రత్నం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు వైసీపీ నేతల స్వార్థానికి ఇంకెంత మంది సామాన్యులు బలికావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానం పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాక కూడా ప్రభుత్వం రైతుకు న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు చంద్రబాబు.

  ఇదీ చదవండి : వెంట వెంటనే రంగులు మారుతున్న బంగాళాఖాతం.. కారణమిదే అంటున్న సైంటిస్టులు

  అసలు ఏం జరిగింది అంటే..

  రామకృష్ణాపురం పంచాయితీ రాజ్ ఇండ్లు గ్రామానికి చెందిన రత్నం అనే రైతుకి ప్రభుత్వం 1974లో లీజుకి కొంత భూమి ఇచ్చింది. రైతుకి భూమి దక్కకూడని.. తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు తరచూ వివాదాం సృష్టించేందుకు ప్రయత్నించేవారు. దీంతో రత్నం 2009లో చిత్తూరు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సదరు భూమిని రత్నంకు కేటాయిస్తూ పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ రత్నం తన భూమికోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ఆ పోరాటంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Farmer, Land kabja issue, TDP

  ఉత్తమ కథలు