Calf Birthday: గోమాతంటే ఆ రైతుకు ఎంతప్రేమో.. ఆవుదూడకు ఘనంగా బర్త్ డే వేడుకలు..

కడప జిల్లాలో ఘనంగా ఆవుదూడ జన్మదిన వేడుకలు

Andhra Pradesh: పిల్లల పెళ్లిళ్లు, సీమంతాలు, ఇతర ఫంక్షన్లను ధూమ్ ధామ్ గా నిర్వహిస్తారు. పుట్టినరోజు వేడుకలు కూడా అంబరాన్నంటేలా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

 • Share this:
  ఇంట్లో ఎవరైనా చిన్నారి జన్మిస్తే వారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతారు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కలవారిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇస్తారు. ఇక ఇతర శుభ కార్యాలు కూడా ఘనంగా చేస్తారు. ఇక పిల్లల పెళ్లిళ్లు, సీమంతాలు, ఇతర ఫంక్షన్లను ధూమ్ ధామ్ గా నిర్వహిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ ప్రాంతంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఆ కుటుంబం చేసిన పనికి స్థానికులు నోరెళ్లబెట్టారు. సాధారణంగా గోమాతను భారతీయులు దేవతగా భావిస్తారు. గోవు వచ్చిందంటే దేవత ఇంటికి వచ్చినట్లే భావిస్తారు. అందుకే ఇంట్లోని ఆవును జాగ్రత్తకగా చూసుకుంటారు. గోమాతకు సీమంతం చేయటం మనం చాలా సందర్భాల్లో చూశాం..కానీ గోమాతకు పుట్టిన బిడ్డకు పుట్టిన రోజు వేడుకలు  (Cow Birthday Celebrations) చేయటం ఎక్కడైనా చూశారా..? లేదు కాదా..!

  కడప జిల్లా (Kadapa District)లో ఓ రైతు మాత్రం తన ఇంట పుట్టిన ఆవుదూడకు ఘనంగా జన్మదిన వేడుకలు జరిపించాడు. గ్రామస్తులందరిని పిలిచి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాడు. కడప జిల్లాలోని సుండుపల్లె మండలం ఈడిగెపల్లెకు చెందిన రైతు శంకర్ కు గోమాతంటే అమితమైన భక్తి. భక్తితో పాటు సొంత మనిషిలా చూసుకునే అభిమానం. ఈ రైతు శంకర్ కు ఓ గోవు ఉంది. ఈ గోవుకు యేడాది క్రితం ఓ ఆవుదూడ జన్మించింది. అంతే తన ఇంట్లో లక్ష్మీదేవి జన్మించిందంని సంబరపడిపోయాడు. అప్పటి నుంచి దూడను కన్నబిడ్డలా సాకాడు.

  ఇది చదవండి: భర్తపై వీళ్లకు ఎంతప్రేమో చూడండి..! వాళ్ల ప్రేమకు చిహ్నం ఇదే..!

  సరిగ్గా యేడాది అనంతరం రైతు శంకర్ ఆ ఆవుదూడకు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించాడు. తమ స్వగృహం నుండి మేళ తాళాలతొ గ్రామంలోని కొత్త పురమ్మ ఆలయం వద్దకు గోమాతను తీసుకెళ్లి... అమ్మవారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గోవు ముందు రైతు శంకర్ ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి గోవు కు తినిపించారు. అనంతరం గ్రామస్తులందరికి కేక్ పంచి సంబరాలు జరుపుకున్నాడు.

  ఇది చదవండి: ఏపీలో రిలయన్స్ జియో విస్తృత సేవలు.., గిరిజన గ్రామాల్లోనూ 4జీ నెట్ వర్క్..


  వాస్తవానికి ప్రస్తుతం మారుతున్న సమాజంలో తమ పిల్లల పుట్టుని రోజు వేడుకలు ఘనంగా జరుపుకొవడమే మనం చూశాం. కానీ శంకర్ మాత్రం ఓ గోవుకు తన సొంతబిడ్డకు చేసినట్లు వేడుకలు నిర్వహించడం చూసి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. సాదారణంగా అందరూ అవుపాలు తాగుతారు. మహా అయితే పూజిస్తారు. కానీ శంకర్ మాత్రం గ్రామస్తుల నడుమ ఇలా జన్మదిన వేడుకలు జరిపించడం అందరికి కొత్త వింతగా అనిపించింది. రైతు శంకర్ చేసిన ఈ పనికి గ్రామ ప్రజలు మెచ్చుకోవడంతో పాటు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కుటుంభ సబ్యులు, గ్రామ నాయకులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

  ఇది చదవండి: దేవుడి వరమంటే ఇదేనేమో..! బిడ్డలు దూరమైన రోజే కవలలు జననం..  ఇదిలా ఉంటే గతంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన జ్ఞానసూర్యప్రకాశరావు అనే వ్యక్తి తాను ప్రాణప్రదంగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో తల్లడిల్లిపోయాడు. ప్రతి ఏడాది ఆ శునకానికి వర్ధంతి నిర్వహించేవాడు. ఇటీవల ఐదో వర్ధంతి సందర్భంగా తన పెంపుడు కుక్క అయిన శునరాజుకు కాంస్య విగ్రహం చేయించి పెద్ద వేడుక చేశాడు.
  Published by:Purna Chandra
  First published: