GT Hemanth Kumar, Tirupathi, News18
Beautiful Tirumala: హిమాలయ పర్వతాలను తలపించే విధంగా ఏడుకొండలను మంచు కప్పేసింది.. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా చల్లటి గాలులు ఓవైపు.. మరోవైపు పచ్చటి చెట్లు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.. మాండూస్ తుఫాను (Mandous) కారణంగా గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి తెల్లటి పొగమంచు తిరుమల (tirumala) గిరులను మింగినట్లు తలపిస్తుంది.. ప్రకృతి రామనీయతకు పుట్టినిల్లైన సప్తగిరులు తిరుమల యాత్రకు వచ్చే భక్తుల శ్రీ వేంకటేశ్వరస్వామి (Sri Venkateswara Swamy) వారి కటాక్షంతో పాటుగా మరచిపోలేని అనుభూతిని నింపుతోంది. శేషాద్రి నిలయుడి సన్నిధిలో ప్రకృతి సోయగాలు ఎంతగానో కనువిందు చేస్తున్నాయి.
కలియుగ వైకుంఠ వాసి శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైయున్న తిరుమల (Tirumala) పుణ్యక్షేత్రం మధురమైన ప్రకృతి అందాలకు నెలవు.. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం సమయాల్లో ఏడుకొండలను మంచు దుప్పటి కమ్మేస్తోంది. అద్భుత దృశ్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
గత మూడు రోజులుగా మాండూస్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలో చలి తీవ్రత అధికంగా పెరిగింది.. దీంతో తిరుమల ఘాట్ రోడ్డుతో పాటుగా, తిరుమల గిరులు మొత్తం మంచుతో కప్పుకున్నాయి.. వైకుంఠంను తలపించేలా మంచు పొగ తిరుమలను వ్యాపించి ఉండడంను చూసి యాత్రికులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి : వారందిరికీ శుభవార్త చెప్పిన సీఎం జగన్ .. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
మంచుతో మోఘాలు స్వయంగా భువిపై దిగి వచ్చినట్లు కనిపించే సరికొత్త వాతావరణం శ్రీనివాసుడి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో భక్తులకు నూతన అనుభూతులు కలిగిస్తున్నాయి. అలిపిరి మార్గం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు దట్టమైన పొగమంచు కమ్ముకున్నాయి. కష్టాలను తొలగించే పెరిమాళ్ దర్శనంతో పాటుగా తిరుమల ప్రకృతి సోయగాలను చూసి భక్తులు ఎంతగానో మురిసి పోతున్నారు.
ఇదీ చదవండి : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి గంటా.. ఏం చెప్పారంటే..?
సాధారణంగానే శ్రీవారి భక్తుల మనస్సును ఆకర్షించే తిరుమల ఉద్యానవనాలను పొగ మంచు కప్పేయడంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. శేషాచల కొండలు మంచు పొగ కమ్మేయడంతో భక్తులకు కనువిందుతో పాటుగా ఇబ్బందులను తెచ్చి పెడుతోంది.తుంది.. మంచు పొగ కారణంగా ఎదురుగా వచ్చే మనుషులే కాదు, వాహనాలు సైతం కనిపించని పరిస్ధితి నెలకొంది.. దీంతో యాత్రికులకు అవస్ధలు తప్పడం లేదు.
ముఖ్యంగా ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు మంచుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు వెళ్లే వాహనాలు కనపడక ప్రయాణం కష్టతరంగా మారింది.. ఇక అలిపిరి నడకమార్గం గుండా తిరుమలకు వెళ్ళే భక్తులు మాత్రం మంచు పొగను ఆస్వాదిస్తున్నారు. తిరుమల అందాలను తమ మొబైల్ ఫోన్స్ లో చిత్రాలను భధ్ర పరిచుకోవడమే కాకుండా సెల్ఫీలు దిగి తీపి గుర్తులుగా దాచుకుంటుంటే.. వసతి గదులు దొరకని భక్తులు మాత్రం బయట సేదతీర లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు.. మరోవైపు చలి తీవ్రత అధికంగా ఉండడంతో వృద్దులు, చంటి పిల్లలు చలికి తట్టుకోలే పోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala Temple, Tirumala tirupati devasthanam