హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rain Water Drinking: వర్షపు నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలున్నాయా..? దీర్ఘాయుష్షు సొంతమా..?

Rain Water Drinking: వర్షపు నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలున్నాయా..? దీర్ఘాయుష్షు సొంతమా..?

చిత్తూరు జిల్లాలో వర్షపునీరు తాగుతున్న కుటుంబం

చిత్తూరు జిల్లాలో వర్షపునీరు తాగుతున్న కుటుంబం

Drinking Water: తాగేనీరు విషయంలో దాదాపు 90శాతం మంది దుక్పథం మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా గుక్కెడు మంచినీళ్లు తాగాలంటే అది మినరల్ వాటరేనా అని అడిగిగానీ తాగరు. కానీ ఓ కుటుంబం మాత్రం బాటిల్ వాటర్ కాదు.. బోర్ వాటర్ కాదు.. వినూత్నంగా ఆలోచించింది.

ఇంకా చదవండి ...

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

ఈ ఆధునిక కాలంలో ఎటు చూసిన మారుతున్న సమాజానికి అముగుణంగా అందరూ తమని తాము మార్చుకుంటున్నారు. ఆదిమానవుల కాలం నుంచి నేటికీ మనిషిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కాలి నడక నుంచి విమానాల ప్రయాణాల వరకు ఎదిగాం. వీరితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతూవస్తున్నాయి. ముఖ్యంగా తాగేనీరు (Drinking Water) విషయంలో దాదాపు 90శాతం మంది దుక్పథం మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా గుక్కెడు మంచినీళ్లు తాగాలంటే అది మినరల్ వాటరేనా అని అడిగిగానీ తాగరు. పల్లెటూళ్ల నుంచి పట్టణాలు, నగరాల వరకూ ప్రస్తుతం మినరల్ వాటర్ (Mineral Water) హవా సాగుతోంది. ఈ రోజుల్లో మినరల్ వాటర్ ప్లాంట్ లేని ఊరులేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి సమాజంలో ఓ కుటుంబం మాత్రం మినరల్ వాటర్ ను దగ్గరకు రానియడం లేదు. అలా అని బోరు వాటర్ కూడా తాగడం లేదు. ఆకాశగంగే వారి దాహార్తిని తీర్చే నీటి చుక్క.

వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం పివిపురం బలిజపల్లిలో గుణశేఖర్ రెడ్డి కుటుంబం తాగునీటి విషయంలో వినూత్నంగా ఆలోచించింది. మినరల్ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచింది కాదు అని భావించిన గుణశేఖర్ ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆకాశం నుంచి జాలువారే ఆకాశ గంగను (Rain Water) ఒడిసి పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న రెండు ఇళ్లపై వర్షపు నీరు నిలిచేలా ఏర్పాటు చేసుకున్నాడు. వర్షం పడిన వెంటనే నీటిని పైపుల ద్వారా క్రిందికి వచ్చేలా అమర్చారు.


ఇది చదవండి: శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదం.. టీటీడీ కీలక నిర్ణయం


ఈ పైపులలోని నీరును మధ్యలో రైన్ టాప్ రూఫ్ వాటర్ ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసేలా ఏర్పాటు చేశారు. ఆలా పరిశుభ్రం చేసిన నీటిని పెద్ద ప్లాస్టిక్ క్యాన్లలో వదిలారు. ఆ క్యాన్లలో సహజసిద్దంగా దొరికే ఇసుక., గులకరాళ్లు, బొగ్గు, పచ్చి గడ్డి వలతో ఏర్పాటు చేసి లేయర్ల ద్వారా వచ్చిన స్వచ్ఛమైన నీటిని భూమి లోపల ఏర్పాటు చేసిన సంపులో వదులుతారు. ఇలా తాయారు చేసిన నీటిలో ఎన్నో రకాల మానవునికి కావాల్సిన సహజ ఖనిజాలు ఉంటాయని గుణశేఖర్ రెడ్డి అంటున్నారు. ఈ నీటినే నిత్యం వంటకు... త్రాగటానికి వినియోగిస్తామని తెలిపారు. ఈ నీరు అనారోగ్యాన్ని సైతం నయం చేస్తుందని ఆయన చెబుతున్నారు.

ఇది చదవండి: నాసిరకంగా నాడు-నేడు పనులు.. విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తున్న కాసుల కక్కుర్తి


వర్షపు నీరు ఫిల్టర్ చేసి నిర్వఉంచే పరికరాల ఏర్పాటుకు దాదాపు రెండు లక్షలు ఖర్చు చేసినట్లు అయన తెలిపారు. ఇప్పటి వరకు 70 వేల లీటర్ల నీటిని నిల్వ చేశామని.., మార్కెట్ వాల్యూ ప్రకారం దీని విలువ రూ.6లక్షల పైమాటే అంటున్నారు. మార్కెట్లో దొరికే మినరల్ వాటర్లో రసాయనాలు కలుపుతారని.. తాము నిల్వచేసే వర్షపునీటిలో ఎన్నో పోషక విలువులున్నాయని గుణశేఖర్ అంటున్నారు.

ఇది చదవండి: తోకపై నిల్చొని ఈలేస్తున్న కోబ్రాలు.. ఏపీలో అరుదైన జీవుల సంచారం.. ఎక్కడంటే..!


తమ కుటుంబమంతా ఈ నీటితో చేసిన ఆహారాన్నే తింటున్నామని.. ఈ నీటిని కుండలో ఉంచి తాగుతున్నట్లు గుణశేఖర్ తెలిపారు. ఈ నీరు తాగడం వలన తమ కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని... అంతా సంతోషంగా ఉన్నామని చెప్పారు. బంధువులు కూడా తమ ఇంటికి వచ్చి ఈ నీరు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, Drinking water, Health, Tirupati

ఉత్తమ కథలు