Home /News /andhra-pradesh /

Tragedy: కోటిన్నర అప్పుచేసి వెళ్లిపోయిన పెద్దకొడుకు.. అవమానం భరించలేని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇది..

Tragedy: కోటిన్నర అప్పుచేసి వెళ్లిపోయిన పెద్దకొడుకు.. అవమానం భరించలేని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇది..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Andhra Pradesh: అవసరానికి మించి అప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసిన ఓ యువకుడు ఇంటి నుంచి పారిపోవడంతో అవమానం భరించలేని ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది.

    ప్రతి మనిషికి డబ్బు చాలా అవసరం. అవసరానికి తగ్గట్లుగా సంపాదన ఉండాలి. అవసరానికి మించి సంపాదన ఉంటే అది పొదుపుగా మారాలి. అలా కాకుండా అవసరానికి మించి అప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసిన ఓ యువకుడు ఇంటి నుంచి పారిపోవడంతో అవమానం భరించలేని ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం వారిని కాటికి సాగనమంపేవారు కూడా కరువైన దుస్థితి నెలకొంది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామానికి చెందిన శంకరయ్య, గురమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సతీష్, చిన్న కుమారుడు వినయ్ తో కలిసి నివాసముంటున్నారు. ఐతే సతీష్ గ్రామస్థులు, తెలిసినవారు, బంధువుల వద్ద భారీగా అప్పులు చేశాడు. ఏకంగా రూ.కోటిన్నర అప్పు చేసి వాటిని తీర్చలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అప్పులిచ్చిన వారు శంకరయ్య ఇంటికి వచ్చి వారిని అసభ్య పదజాలంతో దూషింటడం, శాపనార్ధాలు పెట్టడం, అప్పులు తీర్చమని ఒత్తి చేస్తుండేవారు.

    కొడుకు చేసిన పనికి ఊళ్లో పరువు పోవడం, అప్పులు తీర్చేదారి కనిపించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. భార్యభర్తలు, చిన్నకుమారుడు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ముగ్గురూ చనిపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న పెద్దకుమారుడు సతీష్ కోసం ఆరా తీస్తున్నారు. అతడు ఎక్కడైనా ఉన్నాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు సంతోషంగా గడిపిన కుటుంబంలో అప్పులు తెచ్చిన తిప్పలు ముగ్గురు ప్రాణాలను బలిగొన్నాయి. నిన్నటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం విషాదాంతమవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

    ఇది చదవండి: ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలేసింది.. నాలుగేళ్ల సహజీవనానికి అనుకోని ముగింపు...



    మరో కుటుంబం...
    ఇటీవల ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఉరవకొండకు చెందిన మాధవయ్య కూరగాయల వ్యాపారి ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. ధర్మవరంలో చేనేత మగ్గంనేస్తూ జీవనం సాగిస్తున్న మాధవయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాధవయ్య భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందింది. భార్య వైద్యం కోసం అప్పులు చేయడం, నలుగురు పిల్లల పోషణ కష్టం కావడంతో ధర్మవరం నుంచి ఉరవకొండకు వచ్చేశాడు. అక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నాడు. ఐతే భార్య చనిపోవడం, ఆర్ధికంగా ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. రాయదుర్గం సమీపంలోని కనేకల్ చెరువులో నలుగురు పిల్లలతో కలిసి దూకేశాడు. గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Crime news, Family suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు