హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రైల్వే జాబ్ లో చేరేందుకు ఆపాయింట్ మెంట్ లెటర్ తీసుకెళ్లిన కుర్రాడు.. కానీ అక్కడికెళ్లాక అంతా షాక్..

రైల్వే జాబ్ లో చేరేందుకు ఆపాయింట్ మెంట్ లెటర్ తీసుకెళ్లిన కుర్రాడు.. కానీ అక్కడికెళ్లాక అంతా షాక్..

ఇల్లుగడవాలంటే చదువుకున్నవాళ్లకి, చదువుకోని వాళ్లకి స్థాయిని బట్టి జాబ్ చాలా ఇంపార్టెంట్. అదీ ప్రభుత్వ ఉద్యోగం అంటే దానికి మరింత పోటీ.

ఇల్లుగడవాలంటే చదువుకున్నవాళ్లకి, చదువుకోని వాళ్లకి స్థాయిని బట్టి జాబ్ చాలా ఇంపార్టెంట్. అదీ ప్రభుత్వ ఉద్యోగం అంటే దానికి మరింత పోటీ.

ఇల్లుగడవాలంటే చదువుకున్నవాళ్లకి, చదువుకోని వాళ్లకి స్థాయిని బట్టి జాబ్ చాలా ఇంపార్టెంట్. అదీ ప్రభుత్వ ఉద్యోగం అంటే దానికి మరింత పోటీ.

  ఉద్యోగం. ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఇల్లుగడవాలంటే చదువుకున్నవాళ్లకి, చదువుకోని వాళ్లకి స్థాయిని బట్టి జాబ్ చాలా ఇంపార్టెంట్. అదీ ప్రభుత్వ ఉద్యోగం అంటే దానికి మరింత పోటీ. వంద ఉద్యోగాలున్నా..లక్షల మంది అప్లై చేస్తుంటారు. ఆ బలహీనతను క్యాష్ చేసుకునేందు కొన్ని ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. మాయగాళ్ల వలలోపడిన యువత భారీగా డబ్బులిచ్చి నష్టపోతోంది. అసలు జాబ్ వస్తుందా రాదా అని ఆలోచించకుండా గుడ్డిగా ఎంతడగితే అంత ముట్టజెప్పేస్తున్నారు. తాజాగా రైల్వే ఉద్యోగాలంటూ ఓ ముఠా నిరుద్యోగులను వలలో వేసుకుంది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.32 లక్షల చొప్పున దండుకుంది. సాధారణంగా రైల్వే శాఖ నిర్వహించే ఆర్ఆర్బి, ఆర్ఆర్సి పరీక్షల సమయంలోనే ఇలాంటి ముఠాలు ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రైల్వేలో ఏ ఉద్యోగ ప్రకటన లేక పోయినా పక్కా ప్రణాళికతో నిరుద్యోగులను మోసం చేసారు మాయగాళ్లు.

  తిరుపతిలోని డీఆర్ఎం కార్యాలయంలోని ఓ పర్సనల్ శాఖ ఉన్నత ఉద్యోగి సంతకాన్ని సైతం ఫోర్జరీచేసి, నకిలీ రబ్బరు స్టాంపులను ఉపయోగించిన కేటుగాళ్లు పక్కా స్కెచ్ తో మోసానికి పాల్పడ్డారు. ముఖ్యంగా వీరి టార్గెట్ అంతా కేవలం డబ్బుపైనే ఉంటుంది. భారీ మొత్తంలో డబ్బులు కాజేయడానికి ముఠా సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పక్కా ప్రణాళిక రూపొందించి నిరుద్యోగులను టార్గెట్ చేశారు. అయితే వీరి వలలో ఎంతమంది పడ్డారో తెలియదు కానీ.. ఇప్పటివరకు 12 మంది నుంచి డబ్బు వసూలు చేసినట్లు ప్రాధమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: ఇరగదీసిన నెల్లూరు కుర్రాళ్లు.. వకీల్ సాబ్ ని దించేశారుగా..!


  రైల్వే ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షల్లో పాసైన అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికైతే రైల్వే బోర్డు నుంచి నియామకపు ఉత్తర్వు వస్తుంది. రైల్వే బోర్డు ఉత్తర్వు మేరకు పర్సనల్ శాఖకు చెందిన సీనియర్ డీసీఎం నుంచి మెడికల్ ఫిట్ నెస్ పరీక్షకు హాజరు కావాలంటూ ఆదేశాలు వస్తుంది. ఈ మేరకు రైల్వే బోర్డు అపాయింట్ మెంట్ లెటర్, పర్సనల్ శాఖ ఇచ్చిన ఉత్తర్వు కాపీని తీసుకుని రైల్వే ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్యులు నిర్వహించే శారీరక దృఢ పరీక్ష, ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకుని పర్సనల్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. నకిలీ ఉద్యోగ నియామకం పొందిన రవికుమార్ కు ఇచ్చిన ఫోర్జరీ లెటర్లను చూసిన రైల్వే ఆసుపత్రి వర్గాలు అతడికి మెడికల్ ఫిటె నెస్ సర్టిఫికెట్ జారీచేశాయి. అలా ఈ నకిలీ ఉద్యోగాల రాకెట్ రైల్వేశాఖ అధికారులను బురిడీ కొట్టించింది.

  ఇది చదవండి: అక్కరకురాని ఆరోగ్యశ్రీ... కాసుల కోసం పట్టించుకోని ప్రైవేట్ ఆస్పత్రులు...


  ఈ నకిలీ ఉద్యోగాల రాకెట్ వెనుక ఎవరి హస్తముందో, ఇంకా ఎంతమంది వీరి వలలో పడి మోసపోయారో తెలియక బాధితుడు, రైల్వే శాఖాధికారులు గుంతకల్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఈ నకిలీ ఉద్యోగాల రాకెట్ వెనుక రైల్వే డీఆర్ఎం కార్యాలయ సిబ్బందికిగానీ, సన్నిహితంగా ఉండేవారికి గానీ ఏమైనా సంబంధాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారణ సాగుతోంది. డబ్బును వసూలు చేసిన విజయ్ కరోనాతో మృతిచెందిన విషయం వాస్తవమేనా? ఈ రాకెట్ కు సహకరించినవారెవరు? అనే విషయాలు తేలాల్సిఉంది. పట్టణంలోని ఓ మీసేవ కేంద్రంలో పనిచేసే వ్యక్తిపై పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: ఈపీఎఫ్ చెల్లించనందుకు రూ.16 కోట్ల జరిమానా... ప్రభుత్వమైనా వదిలేది లేదు.. ఎక్కడో తెలుసా.


  మోసపోయిన వారందరు తమిళ తంబీలే..

  చెన్నై నగరానికి చెందిన పన్నెండు మంది ఈ నకిలీ ఉద్యోగాల ముఠా వలలో పడినట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనా వేశారు. శనివారం చెన్నైకి చెందిన పీ రవికుమార్ అనే యువకుడు తనకు కమర్షియల్ శాఖలో సీనియర్ క్లర్కుగా ఉద్యోగం వచ్చిందంటూ జాయిన్ కావడానికి డీఆర్ఎం కార్యాలయానికి వచ్చాడు. అతడి వద్ద ఎస్ఆర్, అపాయింట్ మెంట్ లెటర్, మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉండటంతో పర్సనల్ శాఖ కార్యాలయంలో పరిశీలించగా అది నకిలీదని తెలిసింది.

  రైల్వే డివిజన్ లోని తిరుపతిలో కమర్షియల్ విభాగంలో ఉద్యోగ నియామకం పొందినట్లుగా డీపీఓ హక్ పేరిట ఉన్న ఆ లెటర్ పరిశీలించిన పర్సనల్ శాఖాధికారులు అది నకిలీ సంతకమని, రబ్బరు స్టాంపులు కూడా నకిలీవేనని నిర్ధారించారు. దీంతో రైల్వే సెక్యూరిటీ కమాండెంటు అక్కడకు వచ్చి రవికుమార్ ను ప్రశ్నించారు. తాను గుంతకల్లుకు చెందిన విజయ్ స్టాన్లీకి రూ. 32 లక్షలు ఉద్యోగం కోసం ముట్టజెప్పానని తెలిపారు. తన వద్ద ఉన్న స్టాన్లీ ఫోన్ నెంబరుకు కాల్చేయగా ఫోన్ ఎత్తినవారు అతడు కరోనాతో మరణించాడని తెలిపారు. దీంతో బాధితుడు గుండె బద్దలైయింది. తనతోపాటు మరో 12 మంది ఒక బ్యాచ్ గా ఉద్యోగానికి ఎంపికయ్యామని, వారు కూడా ఒక్కొక్కరు రూ.32 లక్షలు ఇచ్చారని తెలిపాడు. మిగతావారు ఇంకా జాయినింగ్ కు రాలేదని తెలిసింది.

  First published:

  Tags: Andhra Pradesh, Cheating, JOBS, Railways, Tirupati

  ఉత్తమ కథలు