హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: పచ్చగా ఉండే పల్లెల్లో రక్త చరిత్ర రాస్తున్నదెవరు..? అసలేం జరుగుతోంది..?

Andhra Pradesh: పచ్చగా ఉండే పల్లెల్లో రక్త చరిత్ర రాస్తున్నదెవరు..? అసలేం జరుగుతోంది..?

అనంతపురం జిల్లా ఆరవీడు గ్రామం

అనంతపురం జిల్లా ఆరవీడు గ్రామం

ఆ ప్రాంతమంతా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాల క్రితం ఎలా ఉన్నా.. ఇటీవల కాలంలో మాత్రం ఎలాంటి గొడవలు, వివాదాలు చోటు చేసుకోలేదు. కానీ..,

GT Hemanth Kumar, Tirupati Correspondent, News18

ఆ ప్రాంతమంతా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాల క్రితం ఎలా ఉన్నా.. ఇటీవల కాలంలో మాత్రం ఎలాంటి గొడవలు, వివాదాలు చోటు చేసుకోలేదు. కానీ ఒక్కసారిగా పాతకక్షలు భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలం ఆరవీడు మొన్నటి వరకు ప్రశాంతంగా ఉండేది. పచ్చని పల్లెలో వ్యవసాయం చేసుకొనే రైతులు... తమ పిల్లల్ని పై చదువులు చదివించుకుంటూ ఆరుగాలం వ్యవసాయం చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఓ హత్య జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హత్య కేసు నమోదు కాలేదు. ఇక్కడ 50 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. చిన్న గ్రామం కావడంతో ఎలాంటి ఘర్షణలకు, గొడవలకు దూరంగా ఉంటూ.. కలసి మెలసి ఉంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామానికి ఎలాంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లేదు. అల అని..ఒకరిమధ్య మరొకరికి విబేధాలు లేవు. ఒక్క భూ వివాదం....సినిమాలను తలపించేలా కత్తులతో దాడి. హత్యా చేశారనే ఆరోపణలు ఉన్న.....ప్రత్యర్థుల ఇంటికి నిప్పంటించిన బాధితులు. ఇవ్వని రెవెన్యూ, పోలీసుల వైపల్యంతోనే ఈ ఘటన జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఆరవీడులో మామ అల్లుళ్ల హత్యా తీవ్ర కలకలం సృష్టించాయి. భూ వివాదం కారణంగా మామ రాజగోపాల్, అల్లుడు నారాయణప్పను ఈ నెల 19న దారుణంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు ప్రత్యర్ధులు. దింతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు కలసి తమ ప్రత్యర్థుల ఇళ్ల పై దాడికి పక్క స్కెచ్ వేశారు. అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. గ్రామంలో పోలీసుల పహారా ఉన్నా బేఖాతర్ చేశారు. అడ్డుకొనే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా.. ఏకకాలంలో ప్రత్యర్థుల ఇళ్లపై దాడికి దిగారు. ప్రత్యర్థుల ఇల్లు తోటలను అగ్నికి ఆహుతి చేసారు. కత్తులతో వారి అరటి తోటలని, చీని పంటని కత్తులతో నరికివేశారు. పంటలకు వేసిన డ్రిప్ పైపులను పూర్తిగా నాశనం చేసారు. వీరి దాడిలో ప్రత్యర్థుల 9 ఇళ్లలో 5 ఇల్లులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇక మూడు ఇల్లులు పాక్షికంగా పైకప్పు దెబ్బతిన్నాయి. నిందితులు పండించిన వరి కుప్పలపై నిప్పులు అంటించే ప్రయత్నం చేశారు.

ఇది చదవండి: తాడేపల్లి కేసులో పోలీసుల పురోగతి... ఆ మృగాళ్లు వీళ్లే...


తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ముందస్తు చర్యలో భాగంగా ప్రతీకార చర్యలు నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. డిఎస్పీ చైతన్యతో పాటుగా రురల్ సిఐ మల్లికార్జున్, ఇద్దరు ఎస్సైలతో పాటుగా...25 మంది కానిస్టేబులతో భారీ బందోబస్తు ఏర్పు చేశారు. అయితే అర్ధరాత్రి డిఎస్పీ, సిఐలు గ్రామాన్ని విడిచి పెట్రోలింగ్ నిమిత్తం బయటకు వెళ్లారు. మిగిలిన వారు బందోబస్తులో ఉన్నా.., ప్రతీకార దాడులు మాత్రం ఆగలేదు. ఒక్కో ఇంటికి ఇద్దరు రక్షక భటులు, ప్రతి 4 ఇళ్లకు ఒక ఎస్సై గస్తీ కాస్తున్నారు. అయినా అంతపెద్ద విధ్వంసాన్ని నిలువరించలేకపోయారు. డ్యూటీ వదిలి వారికి బసకు ఇచ్చిన ఇంటిలో నిద్రించారనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. యల్లనూరు మండలంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి ప్రతీకార దాడులు జరుగుతాయన్న నానుడికి నిన్న జరిగిన ఘటనే నిదర్శనం. జంటహత్యలు జరగడంతో ఫ్యాక్షన్ సినిమాల్లోని సీన్లు తలపిస్తున్నాయంటే వారిలో కక్షలు, కార్పణ్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్ధమవుతుంది.

ఇది చదవండి: పచ్చని పల్లెల్లో తుపాకుల మోత.., అత్మరక్షణ పేరుతో అరాచకాలు.. ఎక్కడంటే..!


జంట హత్యల అనంతరం నిందితులతోపాటు వారి కుటుంబాలు పరారు కావడంతో వీధంగా ఖాళీగా దర్శనమిస్తోంది. ఆ కుటుంబాలకు సంబంధించిన వరికుప్పలు భారీగా రోడ్డుపై రాసులుగా పోసి ఉన్నాయి. వంద బస్తా లకుపైగా వడ్లు రోడ్లపై ఆరబోశారు. మరికొన్నింటిని కుప్పలుగా వేశారు. వీటిని సైతం పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు బాధిత కుటుంబాలు ప్రయత్నం చేసాయి. జంట హత్యలు జరగటం., నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఆరవీడు గ్రామాన్ని తమ వలయంలో బంధించారు పోలీసులు. మొత్తం ముగ్గురు డీఎస్సీలు, సీఐలు, ఎస్ఐలు, స్పెషల్పార్టీ సిబ్బంది, స్థానిక పోలీసులతో గ్రామం పోలీసు వలయంగా మారింది. గ్రామానికి ఆటు ఇటు ఉన్న రహదారిని పూర్తిగా మూసి వేశారు. గ్రామంలో నుంచి బయటకు, బయట నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామం పోలీసు వలయంగా మారడంతో తటస్థంగా ఉన్న వారి కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి.

పోలీసుల విచారణ జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ప్రతీకార దాడుల్లో ఎక్కడ తమపేరు చేర్చుతారోనన్న భయం వారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిందితులకు సహకరించిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Rayalaseema

ఉత్తమ కథలు