GT Hemanth Kumar, Tirupathi, News18.
Extramarital Affair: జీవన ప్రయాణంలో దాంపత్య జీవితం అత్యంత కీలకమైనది. తమకంటూ ఓ అందమైన ప్రపంచాన్ని దాంపత్య జీవితాన్ని ద్వారానే సృష్టించగలం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచిన బాగస్వామితోనే నూరేళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది. చిన్న మనస్పర్ధలను.. ఇగోలను పక్కన పెట్టి.. ఒకరికి ఒకరు అన్నట్టు బతికితే ఆ సంసారం (Married life) సాఫీగా సాగిపోతుంది. కానీ చిన్న చిన్న కోరికలు అదుపులో పెట్టుకోలేక.. ఇద్దరి మధ్య సరైన అవగాహన లేక.. కొందరు తప్పటడుగులు వేస్తారు.. ఆ అడుగులు తడబడుతున్నాయి అని తెలిసిన వెంటనే సరిదిద్దుకుంటే.. సరే లేదంటే.. జీవితాలు నాశనం అవుతాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలతోనే (Extramarital Affair) చాలామంది పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు.
తాజాగా ఓ ఘటన.. సమాజం తలదించుకునేలా చేసింది. ఒక వ్యక్తి తన స్నేహితుడి భార్య (Husband Wife) పైనే కన్నేశాడు. ఆమెను మాటల్లో పెట్టి.. మొత్తానికి ముగ్గులోకి దింపాడు. స్నేహితుడు ఇంట్లో లేని సమయం చూసి.. తరచు ప్రియురాలిని కలిసేందుకు వచ్చేవాడు.. కానీ నిత్యం కలవడానికి కుదిరేది కాదు. దీంతో వారిద్దరూ ఓ ప్లాన్ చేశారు. చివరకు ప్రియురాలితో కలసి ఊసలు లెక్కిస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు జిల్లా, నగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో విజయ్, వనిత దంపతులు నివాసం ఉంటున్నారు.. విజయ్ నగిరిలో మొబైల్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు.. టిఆర్ కండ్రిగ గ్రామానికి చేందిన తమిళ అరసుతో పరిచయం ఏర్పడింది.. దీంతో విజయ్, తమిళ అరసులు ఎంతో స్నేహంగా మెలిగేవారు.. విజయ్ సెల్ ఫోన్ దుకాణంకు అవసరం అయ్యే వస్తువులను చెన్నైలో కొనుగోలు చేసేందుకు ఇద్దరు కలిసి వెళ్ళేవారు.. విజయ్ కు కష్ట సుఖాల్లో తమిళ అరసు అండగా నిలిచేవాడు.
ఇదీ చదవండి : అందరి టార్గెట్ మంత్రి రోజానే.. బహిరంగంగానే ఫైట్ స్టార్ట్ చేసిన ప్రత్యర్థి వర్గం
ఇద్దరి మధ్య స్నేహ భావం మరింత బలపడింది.. ఈ క్రమంలో విజయ్ ఇంటికి తమిళ అరసు తరచూ వస్తూ పోయేవాడు.. విజయ్ భార్యతో తమిళ్ అరసు పరిచయం అక్రమ సంబంధంకు దారి తీసింది.. కొన్నాళ్ళు పాటు విజయ్ కు తెలియకుండా వీరి అక్రమ సంబంధం సాగింది.. ఓ రోజు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతంకు వెళ్ళిన విజయ్ అనుకోకుండా భార్యకు ఎటువంటి ఫోన్ చేయకుండా ఇంటికి చేరుకున్నాడు.. అదే సమయంలో వనిత తన స్నేహితుడు తమిళ అరసుతో సన్నిహితంగా ఉండడంను గమనించిన విజయ్ ఇద్దరిపై కోపగించుకున్నాడు.. వనితను ప్రవర్తన మార్చుకోవాలని విజయ్ హెచ్చరించాడు.
అప్పటి నుండి విజయ్ తమిళ అరసుకు ఫోన్ చేయడం మానేసి దూరంగా ఉండేవాడు.. భర్త ఇంటిలో లేని సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడేది.. తరచూ వనిత ఫోన్ బిజీ బీజీ అని రావడంతో అనుమానం వచ్చిన విజయ్ ఇంటికి వచ్చి వనితతో గొడవ పడ్డాడు.. తన ప్రియుడిని ఇంటికి రాకుండా చేసాడన్న కోపంతో వనిత ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. వీరి ప్లాన్ ఫెయిల్ కావడంతో వనిత తమిళ అరసుతో గొడవకు దిగ్గింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను చంపేయాలని తమిళ అరసుపై ఒత్తిడి తీసుకుని వచ్చేది.
ఈ క్రమంలో మరో సారి వనిత భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది.. ఈనెల 29వ తేదీన సాయంత్రం వనిత తన భర్త మొబైల్ షాపు వద్దకు వెళ్ళి వినాయక చవితికి అవసరం అయ్యే సరుకులు కావాలని కొనుక్కోవాలని చెప్పి సరుకులు తీసుకుని ఇంటికి చేరుకుంది.. ఇలా ఇంటికి చేరుకున్న వనిత ప్రియుడికి ఫోన్ చేసి సమాచారం అందించింది.
ముందస్తుగా అనుకున్న విధంగానే తమిళ అరసు తన స్నేహితులైన సంతోష్, నాగరాజుతో ప్లాన్ అమలు చేసాడు.. ద్విచక్ర వాహనంకు పెట్రోల్ అయ్యి పోయిందని నాగరాజు వద్ద నుండి విజయ్ కు ఫోన్ చేసిన గుండ్రాలకుప్పం క్వారీ వద్దకు పిలిపించారు.. పెట్రోల్ తీసుకుని గుండ్రాజు కుప్పం క్వారీ వద్దకు వెళ్ళిన విజయ్ ను తమిళ అరసు అతని స్నేహితులైన నాగరాజు, సంతోష్ లు పెద్ద బండపై నుండి నీటి గుంతలోకి తోసి.. బండ రాళ్లతో కొట్టారు.. ఈత రాని విజయ్ నీటి గుంతలో పడి రాళ్ళ దెబ్బలకి మృతి చేందాడు.. విజయ్ మృతి చేందాడని నిర్ధారణ చేసుకున్న తమిళ అరసు, నాగరాజు, సంతోష్ లు సంఘటన స్ధలం నుండి వెళ్ళి పోయారు.
ఇదీ చదవండి: వెంట వెంటనే రంగులు మారుతున్న బంగాళాఖాతం.. కారణమిదే అంటున్న సైంటిస్టులు
విజయ్ రాత్రి అంతా ఇంటికి రాక పోవడంతో మరుసటి రోజు విజయ్ తమ్ముడు, అతని స్నేహితులు చుట్టు ప్రక్కల ప్రాంతాలను గాలించారు.. కానీ విజయ్ ఆచూకీ లభించలేదు.. మరుసటి రోజు పశువుల కాపరుల సమాచారం మేరకు క్వారీ గుంతలో పడి ఉన్న విజయ్ మృత దేహాన్ని చూసిన విజయ్ అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు.. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్ధితిలో మృతి చేందినట్లు కేసు నమోదు చేసిన దర్యాప్తు సాగించారు.
ఇదీ చదవండి: అయ్యో పాపం.. పొలం కోసం పోరాడుతూ తహసీల్దార్ ఆఫీసులోనే రైతు మరణం.. చంద్రబాబు ఏమన్నారంటే
విషయం తెలుసుకున్న వనిత గుండ్రాజుకుప్పం విఆర్ఓకు ఫోన్ చేసిన తన భర్త మృతికి కారణం తానే అని ఒప్పుకుని పోలీసులకు లొంగి పోయింది. దీంతో విజయ్ హత్యకు కారకులైన మిగిలిన ముగ్గురు నిందుతులు తమిళ అరసు, నాగరాజు,సంతోష్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor, Crime news