Extramarital Affair: పచ్చని సంసంరంలో చిచ్చు పెడుతున్నాయి అక్రమ సంబంధాలు.. కోరికలను అదుపులో ఉంచుకోలేక ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు కొందరు.. పరిచయం లేని వ్యక్తులు మధ్యలోకి రావడంతో.. కాపురాలు కూలడమే కాదు.. దారుణాలకు కారణమవుతున్నాయి. తాజాగా తిరుపతి (Tirupati) లో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. భార్య (Wife) తో వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకున్నాడో వ్యక్తి.. అయితే గుట్టుచప్పుడుగా ఉండాల్సిన వారు ఫేస్ బుక్ (Facebook)లో ఫోటోలు పెట్టుకున్నారు. ఆ ఫోటో మహిళ భర్త కంటపడడంతో కామెంట్ చేశారు. ఆ కామెంట్ పై కోపంతో ఊగిపోయిన ప్రియుడు కశి తీర్చుకోవాలి అనకున్నాడు.. తన స్నేహితుల సహకారం తీసుకున్నాడు.. వేసుకున్న ప్లాన్ ప్రకారం పగ తీర్చుకున్నాడు కూడా.. దీంతో ఆ బాధిత భర్త కన్నీరు పెడుతున్నాడు.. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు.
అసలు ఏం జరిగింది అంటే..? ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం ఆరేపల్లి రంగంపేటకు చెందిన వంశీ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు చెందిన ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమీప ముస్లింపేటకు చెందిన అన్వర్‌కు వంశీకి తన ఆటో అద్దెకు ఇచ్చాడు. వీరి మధ్య స్నేహం ఏర్పడటంతో అన్వర్ తరచూ వంశీ ఇంటికి వస్తూ
పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో వంశీ భార్యతో అన్వర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
భర్తకంటే ఆ వ్యక్తే బెటర్ అనుకున్న ఆమె.. నెలన్నర కిందట ఆమె పుట్టింటికి వెళ్తున్నానని భర్తతో చెప్పి, అన్వర్ వద్దకు చేరుకుంది. విషయం
తెలుసుకున్న వంశీ బెంగళూరు చేరుకుని ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. ఈ క్రమంలో అన్వర్ ఫేస్‌బుక్ ఖాతాలో అతనితోపాటు తన
భార్య కలిసి ఉన్న ఫొటో చూశాడు. ఆవేశాన్ని ఆపుకోలేకపోయిన వంశీ.. సోషల్ మీడియాలో హర్షా రెడ్డి, అతని స్నేహితుడు అన్వర్‌లపై
RIP అంటూ ప్రచారం చేశాడు.
ఇదీ చదవండి : టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాంగంటి.. కారణం ఇదే
ఈ పోస్టింగ్స్ చూసి ఆగ్రహించిన హర్షా, అన్వర్.. బెంగళూరులో ఉన్న వంశీని కిడ్నాప్ చేసి, చంద్రగిరి తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అతడిపై మూత్రం పోసి, గుండు గీయించారు. అనంతరం వంశీని బెదిరించి, అతనితో క్షమాపణ చెప్పిస్తూ వీడియో తీయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? హర్షా, అన్వర్‌లకు ఓ పోలీస్ కానిస్టేబుల్ సహకరించాడు.
వంశీని శిరోముండనం చేయడం, అతనితో క్షమాపణ చెప్పించిన వీడియోలు వైరల్ అవ్వడంతో.. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుడికి, అతని కుటుంబానికి ధైర్యం చెప్పారు. వాళ్లిచ్చిన ధైర్యంతో వంశీ ఎట్టకేలకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, నిందితులైన హర్షా, అన్వర్‌లను అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Extramarital affairs